pizza
Tulasidalam release on 11 March
11న తుల‌సీద‌ళం విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

07 March 2016
Hyderabad

క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న సినిమా తుల‌సీద‌ళం. కిశోర్ కంఠ‌మ‌నేని స‌మ‌ర్పిస్తున్నారు. నిశ్చ‌ల్‌, వంద‌న గుప్త‌, డా.బ్ర‌హ్మానందం, రాధారాయ‌సం, అనితా చౌద‌రి, దువ్వాసి మోహ‌న్‌, దీప‌క్ రావెళ్ళ‌, సునీల్ బ‌డ్డేప‌ల్లి, ఆర్పీ ప‌ట్నాయ‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు ఆర్పీ ప‌ట్నాయ‌క్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంగీతాన్నిఅందించారు. ద‌ర్శ‌క‌నిర్మాత కూడా ఆయ‌నే. ఈ చిత్రం ప్రెస్‌మీట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ ``ఈ నెల 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాం. క‌న్‌స్ట్ర‌క్టివ్ హార‌ర్ సినిమాగా తెర‌కెక్కించాం. ఈ చిత్రంలో అన్నీ కొత్త‌గా ఉంటాయి. ప్ర‌పంచంలోనే వైటెస్ట్ ప్లేస్ లాస్ వెగాస్‌. అక్క‌డ ఈ సినిమాను చిత్రీక‌రించాం. జుగుప్స క‌లిగించే హార‌ర్ ఇందులో ఉండ‌దు. అన్నీ ఎమోష‌న్స్ ఉంటాయి. అంద‌రూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. 36 ఏళ్ళ‌కు ముందు వెలువ‌డిన తుల‌సీద‌ళం న‌వ‌ల‌కు మా సినిమాకూ ఏ సంబంధ‌మూ ఉండ‌దు. ఇందులో ప్ర‌తి పాత్ర‌కూ ప్రాధాన్య‌త ఉంటుంది. హీరో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా ఉంటాడు. ల‌వ‌ర్‌బోయ్ గా క‌నిపిస్తాడు. వంద‌న గుప్తా ఇందులో లాస్ వెగాస్‌లో టూరిస్ట్ గైడ్ గా ప‌నిచేస్తున్నారు. దువ్వాసి థ్రూ అవుట్ ఉంటారు. బ్ర‌హ్మానందం పాత్ర‌ను ఇండియాలోనే తీశాం. ఆయ‌న భూత‌వైద్యుడిగా క‌నిపిస్తారు. ఇందులో నా పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంది. తెలుగు స్క్రీన్ మీద ఇప్ప‌టిదాకా రాని పాత్ర‌లో చేస్తున్నాను. ఇందులో సైకిక్ రీడ‌ర్‌గా క‌నిపిస్తాను. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీ ఇది. మెలోడీ సాంగ్స్ ఉంటాయి. లేడీస్ కూడా ఇష్ట‌ప‌డే సినిమా అవుతుంది. ఆద్యంతం డిఫ‌రెంట్‌గా సాగుతుంది. నెక్స్ట్ ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఎవ‌రూ ఎక్స్ పెక్ట్ చేయ‌రు. ఇప్ప‌టిదాకా ఇలాంటి హార‌ర్ చూడ‌లేద‌ని అనుకుంటారు. శ్రీ కృష్ణుడిని తూయ‌ద‌గిన తుల‌సీద‌ళం ఎంత గొప్ప‌దో అంత గొప్ప క్రీమ్ ఈ సినిమాలో ఉంటుంది. మా సినిమాను చూసి అచ్చిబాబు తీసుకున్నారు`` అని తెలిపారు.

నిశ్చ‌ల్ మాట్లాడుతూ ``45 రోజులు విల్లా తీసుకుని ఈ సినిమాను వెగాస్‌లో చేశాం. ప్రాడ‌క్ట్ చాలా బాగా వ‌చ్చింది`` అని చెప్పారు.
దీప‌క్ రావెళ్ళ మాట్లాడుతూ ``ఆర్పీ ప‌ట్నాయ‌క్ యూఎస్‌కి వ‌చ్చిన‌ప్పుడు ఈ క‌థ‌ను చెప్పారు. నేను క‌నెక్ట్ అయ్యాను. హార‌ర్ సినిమా. వేగాస్‌లో నైట్‌లైఫ్ బ్రైట్‌గా ఉంటుంది. అలాంటిది అక్క‌డ హార‌ర్ సినిమాను ఎలా చేస్తారా? అని అనుమానం ఉండేది. అయినా ఆర్పీకి ఏవో ప్లాన్స్ ఉండే ఉంటాయ‌ని అనుకున్నాను. అదే నిజ‌మైంది. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత నాకు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని భావిస్తున్నాను`` అని చెప్పారు.

దువ్వాసి మోహ‌న్ మాట్లాడుతూ ``ఆర్పీ ప‌ట్నాయ‌క్ సినిమాల ముద్ర ఈ సినిమాపై త‌ప్ప‌కుండా ఉంటుంది. ప్రేమ‌, ఫ్యామిలీ, సంగీతం, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, భ‌యం అన్నీ ఉండే చిత్ర‌మిది. ఇందులో నేను పెద్ద‌దిక్కుగా క‌నిపిస్తాను. స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే పాత్ర‌లో న‌టించాను. ఆయ‌న ఆలోచ‌నా విధానం, శైలి వైవిద్యంగా ఉంటుంది`` అని తెలిపారు.
అచ్చిబాబు మాట్లాడుతూ ``ఈ సినిమాను చూసి ఎంత బ‌డ్జెట్ అయిందో క‌నుక్కుని నేను తీసుకున్నాను. 200 స్క్రీన్స్ లో విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో అనితా చౌద‌రి కూడా పాల్గొన్నారు.

ఈ సినిమాకు సౌండ్ ఎఫ్ ఎక్స్: టి.ర‌ఘునాథ్‌, మాట‌లు: తిరుమ‌ల నాగ్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: సునీల్ బొడ్డేప‌ల్లి, ఎడిట‌ర్‌: ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌, కెమెరా: శ‌ర‌త్ మండ‌వ‌, స‌హ నిర్మాత‌: దిలీప్ వ‌డ్ల‌మూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: నంద‌న కుమార్ పొట్లూరి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved