pizza
Yatra 2 Press Meet
'Yatra 2' Is The Story Of A Son Who Fulfilled His Promise To His Father - Director Mahi V Raghav
తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కొడుకు కథే ‘యాత్ర 2’ : దర్శకుడు మహి వీ రాఘవ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


6 February 2024
Hyderabad

 

 

'Yatra' was made as a story of the United Andhra Pradesh's Chief Minister, late YS Rajasekhar Reddy's quest to understand and resolve the problems of needy people through his walkathon. 'Yatra 2' is made as a continuation of 'Yatra'. Popular Malayalam star Mammootty reprised the role of YSR and Kollywood star Jiiva played the role of his son YS Jagan. 'Yatra 2' explored the political scenario of Andhra Pradesh between the 2009-2019 period along with YS Jagan's walkathon for the poor people. The film is getting released on 8th February. The team interacted with the media on Tuesday.

Mahi V Raghav says, " Though every one knows about the story, no one knows about how we made the film. Everyone might be familiar with starting and ending. But, no one has an idea about how we narrated and with which emotion we have navigated the film. People might not be aware of scenes we showed in teaser and trailer. Not everyone knows about the scene with a deaf girl and scene involving a blind man. I have made 'Yatra 2' with so many unknown aspects and emotional scenes. Keeping aside whether those scenes actually happened or not, the key aspect is should we be able to connect the audience with the core emotion in that scene. That scene depicts, YSR's persona who helped numerous poor and specially abled people. That blind man's role reflects numerous people who walked behind YS Jagan during his walkathon. We didn't go towards the reasons about the demise of YSR garu. This film revolves around the promise made by the son of his father. I didn't write about going against Delhi and becoming Chief Minister on my own. I didn't create any characters with an agenda of belittling them. People know the facts. I didn't project some characters in a bad light to make some people heroes. No matter how many films get released or re-released. Every film should have a successful run and earn good money. Our industry gets back those profits in one way or another. Theatres prosper if movies make good money. Every politician bears cases on them. I didn't purposefully praise someone in the film. The audience understands if it is genuine or is it propaganda. Movies must reflect reality or they should convince. We can't say how much is truth and how much is fiction exactly. I can't say if Mammootty gari scene with deaf girl is truth or not but the soul and emotion in it is fact."

Jiiva says, " I find it tough to act in the role of YS Jagan garu. I regularly follow his videos from Youtube and media. I carefully observed how Jagan garu speaks and walks. I have to do a lot of research. Whenever Director okayed a shot I felt huge relief. Mahi garu worked very hard for this film. He took a lot of time to finalise me for Jagan gari role. I heaved ahige relief when he played the first shot. I realised in fact I look like Jaganmohan Reddy garu. Since then I stopped looking at the monitor. When I asked Mammootty garu whether he has recieved any threatening calls from opposition, he said that we are actors and this is a creative space... Just look at it like a cinema. I became very emotional while filming for 'Chudu Nanna' song.

Ketaki Narayan says, " This is my first time to play a real life character. Telugu is not my mother tongue. I have acted in Marathi and Hindi languages. This is my first Telugu film. Bharathi garu has a special image. I started knowing more about her like what kind of person she is, how did she react to certain issues. While I was shooting in Pulivendula I understand the intensity my role is actually carrying.

తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కొడుకు కథే ‘యాత్ర 2’ : దర్శకుడు మహి వీ రాఘవ్


ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు. 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగళవారం ‘యాత్ర 2’ చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు.

మహి వీ రాఘవ్ మాట్లాడుతూ.. ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశామన్నది ఎవ్వరికీ తెలియదు. ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ ఎమోషన్‌తో నడిపించామన్నది తెలియదు. ఈ టీజర్, ట్రైలర్‌లో చూసిన సీన్లు ప్రజలకి తెలిసి ఉండకపోవచ్చు. ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్ ఇవన్నీ బయటి ప్రజలకు తెలియవు. ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని తీశాను. ట్రైలర్‌లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఆ సీన్‌తో ఎమోషన్‌ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నదే సినిమా ఉద్దేశం. వైఎస్సార్ పేదల కోసం, వికలాంగుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పే ఉద్దేశంలో ఆ సీన్ అనుకోవచ్చు. వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది ఆయన వెనకాల నిలిచారు అనేది చెప్పడం కోసం ఆ అంధుడి పాత్రని చూపించాం. ఇక ఈ చిత్రంలో వైఎస్సార్ గారి మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. ఇందులో కేవలం ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఢిల్లీని ఎదురించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఇందులో నేను ఎవ్వరినీ కించపరిచేలా పాత్రలు సృష్టించలేదు. నిజానిజాలు జనాలకు తెలుసు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించలేదు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, రీ రిలీజ్ చేసినా పర్వాలేదు.. అన్నీ బాగా ఆడాలి.. ఆ డబ్బులన్నీ మన ఇండస్ట్రీకే వస్తాయి. అన్ని సినిమాలకు కలెక్షన్స్ వస్తే.. థియేటర్లు బాగుంటాయి కదా. ప్రతీ రాజకీయ నాయకుడి మీద కేసులుంటాయి. ఇందులో ఎవరికీ డప్పు కొట్టలేదు. నమ్మేలా ఉందా? భజనలా అనిపించిందా? అన్నది ఆడియెన్స్‌కి అర్థం అవుతుంది. సినిమాలంటే.. నిజాలైనా చూపించాలి.. నమ్మేలా అయినా చూపించాలి. ఇందులో నిజాలెంత?, కల్పితం ఎంత అంటే.. అన్నంలో నీళ్లలా 1:2 శాతం అని చెప్పలేం. మమ్ముట్టి గారు చేసిన ఆ మూగమ్మాయి సీన్ నిజమా? అంటే నేను చెప్పలేను..కానీ ఆ పాత్ర సోల్, ఎమోషన్‌ మాత్రం నిజం’ అని అన్నారు.

జీవా మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించింది. యూట్యూబ్, మీడియా నుంచి వీడియోలు రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాను. జగన్ గారు ఎలా మాట్లాడతారు.. ఎలా నడుస్తారు.. ఇలా ప్రతీ ఒక్క విషయం మీదో ఎంతో శ్రద్ద తీసుకున్నాను. ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ ఎప్పుడైతే షాట్‌కి ఓకే చెప్పారో అప్పుడు నాకు రిలీఫ్ అనిపించింది. మహి గారు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైం తీసుకున్నారు. ఇక షాట్ ఓకే చెప్పడంతో నాకు పెద్ద రిలీఫ్‌లా అనిపించింది. నేను జగన్ మోహన్ రెడ్డి గారిలానే కనిపిస్తున్నానని అప్పుడే నాకు అర్థమైంది. ఆ తరువాత నేను మానిటర్ కూడా చూడలేదు. ప్రతిపక్షం నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టి గారిని అడిగాను. మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. ఇది కేవలం సినిమాలనే చూడు అని ఆయన చెప్పారు. చూడు నాన్నా అనే పాట చిత్రీకరిస్తున్నప్పుడు చాలా ఎమోషన్‌కు లోనయ్యాను’ అని అన్నారు.

కేతకి నారాయణ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఓ రియల్ పాత్రను పోషించడం ఇదే మొదటిసారి. ఇది నా మాతృభాష కాదు. నేను మరాఠీ, హిందీల్లో నటించాను. తెలుగులో ఇది నాకు మొదటి చిత్రం. భారతి గారికి ఓ ఇమేజ్ ఉంది. ఆమె గురించి ఎక్కువగా తెలుసుకున్నాను. ఎలాంటి మనిషి.. ఎలాంటి విషయాలకు ఎలా రియాక్ట్ అవుతారు.. అనే విషయాలను తెలుసుకున్నాను. పులివెందులలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ పాత్రలోని ఇంటెన్సిటీ నాకు అర్థమైంది’ అని అన్నారు.

 

 


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved