pizza
Right Right making video launch
స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎం.ఎస్‌.రాజు చేతుల మీదుగా `రైట్ రైట్` మేకింగ్ వీడియో విడుద‌ల‌
ou are at idlebrain.com > News > Functions
Follow Us

10 May 2016
Hyderabad

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస ఘ‌న విజ‌యాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎం.ఎస్‌.రాజు చేతుల మీదుగా క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన `రైట్ రైట్‌` మేకింగ్ వీడియో విడుద‌లైంది. మంగ‌ళ‌వారం ఎం.ఎస్‌.రాజు పుట్టిన‌రోజు వేడుక‌ల్లో భాగంగా ఆయ‌న చేతుల మీదుగా `రైట్ రైట్‌` యూనిట్ త‌మ చిత్ర మేకింగ్ వీడియో ఆవిష్క‌రించారు.

సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `రైట్ రైట్`. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న `ఆర్డిన‌రీ` చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు సమర్పిస్తున్నారు. మ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్ స‌ర‌స‌న‌ పూజా జవేరి నాయిక‌గా న‌టించారు. బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ కీల‌క పాత్ర పోషించారు.ఈ సందర్భంగా

ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ ``సుమంత్ అశ్విన్ ఈ మ‌ధ్య క్యూట్ చిత్రాలు చేసుకుంటూ విజ‌యాల‌ను సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా త‌ను న‌టిస్తున్న `రైట్ రైట్‌` అత‌ను కెరీర్లో చెప్పుకునే చిత్ర‌మ‌వుతుంది. మేకింగ్ వీడియో చూస్తుంటే ప్రామిసింగ్‌గా ఉంది. యూనిట్ ఎంత నిబ‌ద్ధ‌త‌తో, లీన‌మై సినిమా చేశారో అర్థ‌మైంది. టీమ్ అంద‌రికీ ఈ చిత్రం పెద్ద హిట్ ను తెచ్చిపెట్టాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను`` అని తెలిపారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ``నాన్న‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేకింగ్ వీడియో విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న అభిరుచి గ‌ల నిర్మాత అనే విష‌యం జ‌గ‌మెరిగినదే. `రైట్ రైట్` త‌ప్ప‌కుండా మంచి సినిమా అవుతుంది. మా ద‌ర్శ‌కుడు మ‌నుకు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది. ఈ చిత్రంతో `బాహుబ‌లి`లో అంద‌రినీ భ‌య‌పెట్టిన ప్ర‌భాక‌ర్ నాకు మంచి మిత్రుడ‌య్యారు`` అని చెప్పారు.

నిర్మాత జె.వంశీకృష్ణ మాట్లాడుతూ ``ఈ నెల 15న పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. జె.బి.చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ చేస్తున్నారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఎం.ఎస్‌.రాజుగారి చేతుల మీదుగా మా చిత్ర మేకింగ్ వీడియో విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంది. ఆయ‌న ఈ సినిమాకు వెన్నెముక‌గా నిలిచారు. ఎస్‌.కోట నుంచి గ‌విటికి వెళ్లే ఓ ఆర్టీసీ బ‌స్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, ల‌వ్‌, మిస్ట‌రీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది'` అని చెప్పారు.

సంగీత ద‌ర్శ‌కుడు జె.బి. మాట్లాడుతూ ``మా చిత్రం ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. ఇటీవ‌లే ఫ‌స్టాఫ్ రీరికార్డింగ్ పూర్త‌యింది`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మను మాట్లాడుతూ - ``మ‌ల‌యాళం `ఆర్డిన‌రీ` సినిమా స్ఫూర్తితో తెర‌కెక్కిస్తున్నాం. మ‌న తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు, చేర్పులు చేశాం. ఇందులో `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ డ్రైవ‌ర్‌గా, సుమంత్ అశ్విన్ కండ‌క్ట‌ర్‌గా క‌నిపిస్తారు. `సుమంత్ అశ్విన్ కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. `ల‌వ‌ర్స్`, `కేరింత‌` సినిమాల స‌క్సెస్‌లో ఉన్న ఆయ‌న‌కు ఈ సినిమా గుర్తుండిపోతుంది. నాజ‌ర్ చాలా అద్భుత‌మైన పాత్ర‌ను పోషించారు. తొలి స‌గం వినోదాత్మ‌కంగా సాగుతుంది. మ‌లి స‌గంలో మిస్ట‌రీ ఉంటుంది. ఔట్‌పుట్ బాగా వ‌చ్చింది. సుమంత్ అశ్విన్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్ర‌మ‌వుతుంది`` అని అన్నారు.

నాజ‌ర్‌, ధ‌న‌రాజ్‌, `ష‌క‌ల‌క` శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జీవా, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌త్‌రెడ్డి, వినోద్‌, పావ‌ని, క‌రుణ‌, జ‌య‌వాణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాట‌లు: శ్రీమ‌ణి, కెమెరా: శేఖ‌ర్ వి.జోస‌ఫ్‌, మాట‌లు: `డార్లింగ్‌` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్‌.రాజీవ్‌, కో ప్రొడ్యూస‌ర్‌: జె.శ్రీనివాస‌రాజు, నిర్మాత‌: జె.వంశీకృష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ను, స‌మ‌ర్ప‌ణ‌: వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు.​​


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved