pizza
Supreme Hero Sai Tej's new film with Sri Venkateswara Cine Chitra LLP, Sukumar Writings launched
సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ నూతన చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us


26 December -2020
Hyderabad


Sai Dharam Tej, who is known for a variety of movies and has a unique image for himself, is now doing a crazy movie in a crazy combination. Prominent production house Sri Venkateswara Cine Chitra LLP, which is known for big-ticket films, has teamed up with Sukumar Writings, which encourages creative and novel ideas, for the promising project. Well-known producer BVSN Prasad is bankrolling it.

Karthik Dandu, who has previously worked in the direction team of the super-talented filmmaker Sukumar, is its director. Sukumar, who is known for his creative writing, is penning the screenplay. On Thursday, the project was launched with a pooja ceremony. Supreme Hero Sai Tej gave the clap for the muhurtham shot picturized on the portraits of Gods. Sukumar's daughter Sukruthi Veni, son Sukranth switched on the camera. BVSN Prasad handed over the script to Karthik Dandu.

More details about the mystical thriller will be divulged soon.

Banner: Sri Venkateswara Cine Chitra LLP, Sukumar Writings
PRO: Vamsi Kaka, Maduri Madhu
Screenplay: Sukumar
Story, Direction: Karthik Dandu

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ నూతన చిత్రం ప్రారంభం

వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, సాధించుకున్న సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ హీరోగా ఓ క్రేజీ కాంబినేషన్‌లో మరో క్రేజీ చిత్రం ప్రారంభమైంది. తెలుగు సినీ పరిశ్రమలో భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ, క్రియేటివ్‌ థాట్స్‌ను ప్రోత్సహించడంలో ముందుండే సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై భారీ చిత్రాల అగ్రనిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వ శాఖలో పనిచేసిన కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి చిత్ర కథానాయకుడు సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ క్లాప్‌ నిచ్చారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతివేణి, కుమారుడు సుక్రాంత్‌ కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. నిర్మాత బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ దర్శకుడు కార్తీక్‌ దండుకు స్క్రిప్ట్‌ను అందజేశారు. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రానికి నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌, పీఆర్‌వో: వంశీ కాక, మడూరి మధు, స్క్రీన్‌ప్లే: సుకుమార్‌, కథ-దర్శకత్వం: కార్తీక్‌ దండు


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved