pizza
Hi 5 Movie Shooting Coverage
అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో పాటలతో అదరగొట్టే ‘హై 5’
You are at idlebrain.com > News > Functions
Follow Us


7 November 2019
Hyderabad

జీవితంలో డబ్బే ప్రధానం కాదు... కుటుంబం, సుఖసంతోషాలే ముఖ్యం అని తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హై 5’. రాధ క్యూబ్ బ్యానర్ పై అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్ కు సమీపంలోని అలేఖ్య రిసార్ట్స్ లో జరుగుతోంది. హీరోయిన్ మన్నార చోప్రాపై ఇక్కడ ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా విశేషాలను నిర్మాత రాధరాజశేఖర్, ధర్శకుడు అమ్మ రాజశేఖర్ వివరించారు. ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఇది ఆఖరిరోజు షూటింగ్ అని అమ్మ రాజశేఖర్ చెప్పారు. ఇంతకుముందు గోవా సమీపంలోని చిన్న దీవిలో సెట్ వేసి చిత్రీకరణ జరిపామని, మంచి మ్యూజికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని వివరించారు. గోపీచంద్ తో ‘రణం’ తర్వాత మళ్లీ అంతటి వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తన భార్య నిర్మాతగా తనే సొంతంగా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ‘ఈ సినిమాలో మొత్తం 12 పాటలు ఉంటాయి. ఐదుగురు సంగీత దర్శకులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. లండన్, మలేషియా, బోస్టన లకు చెందిన ముగ్గురు మ్యూజిక్ డైరెక్టను దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. తమన్ ఒక పాట చేస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ తో ఒక పాట అనుకుంటున్నాము. రీరికార్డింగ్ ఒకరు చేస్తారు. పాటలతోనే కథ చెప్పేలా దీన్ని తెరకెక్కిస్తున్నాం. పాత సినిమాల్లో ఈ తరహాలో చిన్నచిన్న పాటలుండేవి. మాటల్ని పాటల్లా మార్చి నేటి తరానికి తగ్గట్టు పూర్తి వినోదభరితంగా రూపొందిస్తున్నాం. చిన్న మెసేజ్ తో ఆసాంతం ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’అని వివరించారు.

హీరో్యిన్ మన్నార చోప్రా మాట్లాడుతూ మాంచి మసాలా పాటలతో ఈ సినిమా ఉంటుందని, ఇలాంటి సినిమా చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరిందని చెప్పారు. తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని, ఈ సినిమాతో తన కోరిక నెరవేరిందని చెప్పారు.

నిర్మాత రాధ రాజశేఖర్ మాట్లాడుతూ జనవరిలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. నృత్య దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ అమ్మ రాజశేఖర్ వద్ద చాలా కాలం సహాయకుడిగా పనిచేసినట్లు చెప్పారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ సినిమాకు నృత్యరీతుల్ని సమకూరుస్తున్నట్లు వివరించారు. మంచి మసాలా డ్యాన్సులు ఇందులో ఉంటాయన్నారు. ఇందులో ఇంకా జాస్మిన్, ఛాయా, ప్రణాళి, త్రిప్తి, త్రిష, సమీర్, సుధీర్, సెల్వరాజ్, దీక్షిత్, జునైద్, జేవీఆర్, ప్రేమనాథ్, మల్లి, యోగి, జబర్దస్త్ బ్యాచ్, అమ్మరాజశేఖర్ నటిస్తున్నారు. కెమెరా ముజీర్ మాలిక్, ఎడిటింగ్ నందమూరి తారక్, సంగీతం: తమన్, పాప్ సింగర్ డాడి షాక్ (లండన్), పునీత్ రాజా (మలేషియా), జేడీ జాన్ (యు,ఎస్.ఏ), పాటలు: భాషాశ్రీ, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మంగారావు, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved