pizza
Kobbari Matta - Kobbari Aakulu Song launch
`కొబ్బ‌రి మ‌ట్ట` సాంగ్ టీజ‌ర్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


19 September 2018
Hyderabad

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టించిన చిత్రం `కొబ్బ‌రి మ‌ట్ట‌`. రూప‌క్ రొనాల్డ్ స‌న్ ద‌ర్శ‌కుడు. ఆది కుంభ‌గిరి, సాయిరాజేష్ నీలం నిర్మాత‌లు. ఈ సినిమా న‌వంబ‌ర్ 14న విడుద‌ల‌వుతుంది. సినిమా సాంగ్ టీజ‌ర్‌ను హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో శుక్ర‌వారం విడుద‌ల చేశారు.

డైరెక్ట‌ర్ రూప‌క్‌, హీరోయిన్ ఇషికా సింగ్‌, గీతాంజ‌లి, భ‌ర‌త్‌, అజ‌య్‌, క్త‌తి కార్తీక‌, స‌మీర్‌, ముమైత్ ఖాన్‌, చిత్ర స‌మ‌ర్ప‌కుడు కృష్ణారావు, రైట‌ర్ కిట్టు, అనురాగ్‌, సంపూర్ణేష్ బాబు, సౌమ్య వేణుగోపాల్‌, శ్ర‌వ‌ణ్, సాయి బాలాజీ, ధ‌న‌రాజ్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అజ‌య్ మాట్లాడుతూ - ``హృద‌య కాలేయం కంటే వంద రెట్లు కామెడీ ఉంటుంది. మీ న‌వ రంధ్రాల నుండి న‌వ‌ర‌సాల‌ను సంపూ బ‌య‌ట‌కు తీసుకొస్తాడనేది గ్యారంటీ. ఈ జ‌ర్నీ ఇంకా కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నాను. హృద‌య కాలేయం కంటే కొబ్బ‌రి మ‌ట్ట పెద్ద స‌క్సెస్ కావాలి`` అన్నారు.

భ‌ర‌త్ మాట్లాడుతూ - ``హృద‌య కాలేయం త‌ర్వాత స్టార్ట్ చేసిన ఈ సినిమాలో దాని కంటే ఎక్కువ కామెడీ ఉంటుంది`` అన్నారు.

హీరోయిన్ గీతాంజ‌లి మాట్లాడుతూ `` రెండేళ్లుగా ఈ సినిమా టీజ‌ర్, పోస్ట‌ర్స్ రూపంలో ప్రేక్ష‌కుల ముందుక వ‌స్తూనే ఉంది. సినిమా న‌వంబ‌ర్ 14న విడుద‌ల‌వుతుంది. హృద‌య కాలేయం కంటే రెండింతలు హిట్ అవుతుంది`` అన్నారు.

ఇషిక సింగ్ మాట్లాడుతూ - ``సినిమా మేకింగ్‌కి మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. త‌ప్ప‌కుండా సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది`` అన్నారు.

స‌మీర్ మాట్లాడుతూ - ``సినిమా ఎంత లేట‌య్యింది అనేదాని కంటే ఎప్పుడూ వ‌చ్చిన హృద‌య కాలేయం సినిమాని మించి పోతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను`` అన్నారు.

క‌త్తి కార్తీక మాట్లాడుతూ - ``సంపూ అన్న సినిమా బాహుబ‌లి సినిమాను కూడా మంచి పోయేంత పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ముమైత్ ఖాన్ మాట్లాడుతూ - ``ఈ సినిమా సంపూకి, టీమ్ మెంబ‌ర్స్‌కి పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

మ‌ధు ప్రియ మాట్లాడుతూ - ``నవంబ‌ర్ 14న విడుద‌ల‌వుతున్న కొబ్బ‌రి మ‌ట్ట సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ధ‌న‌రాజ్ మాట్లాడుతూ - ``హృద‌య కాలేయం కంటే పెద్ద హిట్ అవుతుంది. సంపూ చిన్న పిల్లాడివంటి వాడు. చాలా మంచి వ్య‌క్తి. అత‌ని మంచిత‌నం వ‌ల్లే ఆద‌ర‌ణ ల‌భిస్తుంది`` అన్నారు.

శివ బాలాజీ మాట్లాడుతూ - `` సినిమా అనేది ఆడియెన్స్‌కు రీచ్ కావాలి. అలా రీచ్ కాన‌ప్పుడు ఎప్పుడు రిలీజ్ చేసినా లాభం ఉండ‌దు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ప్లానింగ్ ప్ర‌కారం చేస్తున్నారు. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు కృష్ణారావు మాట్లాడుతూ - `` చాలా శాటిస్‌ఫాక్ష‌న్ ఇస్తున్న సినిమా. ఈ సినిమా రిలీజ్ రోజున సంపూర్ణేష్‌, సాయిరాజేశ్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. షూటింగ్ మొత్తం అమెరికాలో ఉంటుంది. సంపూ ఇన్ అమెరికా. సంపూ వర్సెస్ ట్రంప్ అని ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

డైరెక్ట‌ర్ రూప‌క్ రొనాల్డ్ స‌న్ మాట్లాడుతూ - ``సినిమా ఆల‌స్య‌మైంది కానీ.. సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. ఒక సంపూని చూస్తేనే కామెడీ ఎంత ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో ముగ్గురు సంపూర్ణేష్‌లుంటారు. అంద‌రం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. న‌వంబ‌ర్ 14న సినిమా విడుద‌ల‌వుతుంది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ - ``న‌వంబ‌ర్ 14న సినిమా విడుద‌ల‌వుతుంది. హృద‌య‌కాలేయం సినిమాను మేం ఎద‌గాల‌ని అంద‌రూ స‌పోర్ట్ చేశారు. అయితే కొబ్బ‌రి మ‌ట్ట దానికి పూర్తి రివ‌ర్స్‌. చాలా స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేశాం. మూడేళ్లు అనేక స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాం. కొబ్బ‌రిమ‌ట్ట సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు సంపూ నా వెనుకే నిల‌బ‌డ్డాడు. నేను స్క్రిప్ట్‌ని అవుట‌ర్ రింగురోడ్డు తిప్పిన‌ట్లు తిప్పాను. బ్యాచిల‌ర్స్ మందు, చికెన్ ముక్క పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఇది. సినిమా ప్ర‌మోష‌న్స్ మారిపోతుంది. అందుకు కార‌ణం మాకు స‌పోర్ట్ అందించ‌డానికి వ‌చ్చిన బిగ్ బాస్ స‌భ్యుల‌కు థాంక్స్‌`` అన్నారు.

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ - ``హృద‌య‌కాలేయం కంటే వంద రెట్టు ఎంజాయ్ చేస్తారు. మిట్ట‌ప‌ల్లె అనే చిన్న ఊరు నుండి న‌న్ను తీసుకొచ్చి రాజేష్ అన్న హృద‌య కాలేయం సినిమా చేశాడు. అలాగే కొబ్బ‌రి మ‌ట్ట సినిమాకు త‌నే ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న వెనుక నిల‌బ‌డి ఎన్నిరోజులైనా స‌పోర్ట్ అందిస్తాను. సినిమాలో న‌టించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. హృద‌య కాలేయం సినిమాను ఆద‌రించిన‌ట్టుగానే కొబ్బ‌రి మ‌ట్ట సినిమాను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved