pizza
MATINEE ENTERTAINMENT’s PRODUCTION NO:9 LAUNCHED WITH SREE VISHNU IN MAIN LEAD AND TEJA MARNI AS DIRECTOR
శ్రీ‌విష్ణు హీరోగా, తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 9 ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us


10 December -2020
Hyderabad

Besides making high budget entertainers, Matinee Entertainment with the purpose of encouraging young talent is making content rich films on moderate budgets. Known for their distinct commercial successes like Kshanam, Ghazi and Gaganam, the production house is currently making two crazy projects - megastar Chiranjeevi’s Acharya and King Nagarjuna’s Wild Dog.

Matinee’s had recently announced a medium budget film with director Swaroop RSJ whose debut directorial Agent Sai Srinivasa Athreya was critically acclaimed and was a big commercial hit.

Matinee Entertainment has today announced their Production No 9 with hero Sree Vishnu and director Teja Marni of Johaar Fame. Proving to be a perfect choice for unique subjects, Sree Vishnu picks another intriguing concept. Teja Marni, on the other hand, won rave reviews for his very first film Johaar. The first collaboration of the hero, director and producers is irrefutably one of the most interesting films of 2021.

Billed to be a caper comedy, the yet to be titled flick was launched today with Pooja ceremony at Matinee Entertainment office in Hyderabad. Script was handed over to the makers by Anvesh Reddy, Sree Vishnu and Amritha Aiyer. Clap was sounded by director Vivek Athreya, wherein camera was switched on by Sivalanka Krishna Prasad and first shot was directed by Swaroop RSJ.

Amritha Aiyer who has become one of the most sought after actress in Tollywood much before the release of her first Telugu film will be paired opposite Sree Vishnu in this new film.

Niranjan Reddy and Anvesh Reddy will bankroll the project, while N M Pasha is the co-producer. Story & screenplay for the film is by director Teja Marni himself, dialogues are provided by Sudheer Varma P.

Coming to the other technical departments, the film will have music by Priyadarshan Balasubramanian and cinematography by Jagadeesh Cheekati. Regular shoot begins this month.

Cast: Sree Vishnu, Amritha Aiyer, Senior Naresh, Sivaji Raja, Subba Raju, Devi Prasad, Rangasthalam Mahesh, Raj Kumar Chowdary (Raja Vaaru Rani Gaaru fame), Chaitanya (Middle class Melodies fame) and others.

Technical Crew:

Producers: Niranjan Reddy, Anvesh Reddy
Co-Producer: N M Pasha
Story, Screenplay, Direction: Teja Marni
Dialogue Writer: Sudheer Varma .P
Cinematography: Jagadeesh Cheekati
Art Director: Gandhi Nadikudikar
Action: Ram Sunkara
Music Director: Priyadarshan Balasubramanian
Lyrics: Chaitanya Prasad
Publicity Design: Anil & Bhanu
PRO: Vamsi-Sekhar
Costume Designer: Prasanna Varma Danthuluri

 

క్ష‌ణం, ఘాజి, గ‌గ‌నం లాంటి చ‌క్క‌ని కంటెంట్ ఉన్న క‌మ‌ర్షియ‌ల్ హిట్ సినిమాల్ని నిర్మించిన ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 'ఆచార్య‌', కింగ్ నాగార్జున్ హీరోగా 'వైల్డ్ డాగ్' లాంటి క్రేజీ ఫిలిమ్స్‌ను నిర్మిస్తోంది.

ఇటు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లుపొందిన 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ' చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె. ద‌ర్శ‌క‌త్వంలో ఓ మీడియం బ‌డ్జెట్ మూవీని ప్రొడక్షన్నంబర్ 8గా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

కాగా, గురువారం (డిసెంబ‌ర్ 10) శ్రీ‌విష్ణు హీరోగా, జోహార్ ఫేమ్ తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వంలో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 9 మూవీని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనౌన్స్ చేసింది. విల‌క్ష‌ణ‌ల స‌బ్జెక్టుల‌ను ఎంచుకుంటూ వ‌స్తున్న శ్రీ‌విష్ణు, తొలి సినిమా జోహార్‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న తేజ మార్ని, కంటెంట్ రిచ్ ఫిలిమ్స్‌కు పేరుపొందిన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తొలి క‌ల‌యిక‌లో రూపొందనున్న ఈ సినిమా 2021లో వ‌చ్చే ఆస‌క్తిక‌ర సినిమాల్లో త‌ప్ప‌కుండా ఉంటుంద‌నేది నిస్సందేహం.

కేప‌ర్ కామెడీగా రూపొందే ఈ టైటిల్ నిర్ణ‌యించ‌ని సినిమా గురువారం హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. అన్వేష్ రెడ్డి, శ్రీ‌విష్ణు, అమృతా అయ్య‌ర్ క‌లిసి సినిమా స్క్రిప్టును ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అంద‌జేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ క్లాప్ నివ్వ‌గా, సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె. గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

త‌న తొలి తెలుగు సినిమా విడుద‌ల కాక‌మునుపే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోన్న అమృతా అయ్య‌ర్ ఈ చిత్రంలో శ్రీ‌విష్ణు జోడీగా న‌టిస్తున్నారు.

నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్‌.ఎమ్‌. పాషా స‌హ నిర్మాత‌. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లేల‌ను తేజ మార్ని అందిస్తుండ‌గా, సుధీర్ వ‌ర్మ పి. డైలాగ్స్ రాస్తున్నారు.

ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే ఈ చిత్రానికి ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, జ‌గ‌దీష్ చీక‌టి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తారాగ‌ణం:
శ్రీ‌విష్ణు, అమృతా అయ్య‌ర్‌, న‌రేష్‌, శివాజీ రాజా, సుబ్బ‌రాజు, దేవీప్ర‌సాద్‌, రంగ‌స్థ‌లం మ‌హేష్‌, రాజ్‌కుమార్ చౌద‌రి ('రాజావారు రాణిగారు' ఫేమ్‌), చైత‌న్య ('మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్‌)

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: తేజ మార్ని
నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
స‌హ నిర్మాత‌: ఎన్‌.ఎమ్‌. పాషా
బ్యాన‌ర్‌: మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
డైలాగ్స్‌: సుధీర్ వ‌ర్మ పి.
సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీష్ చీక‌టి
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
యాక్ష‌న్‌: రామ్ సుంక‌ర‌
మ్యూజిక్‌: ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌
సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

 

 


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved