pizza
I am fearless and I am not afraid of experiments: Nagarjuna
`వైల్డ్‌డాగ్` ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన సినిమా అంటుంటే చాలా హ్యాపీగా ఉంది - కింగ్ నాగార్జున
Wild Dog Success Celebrations
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 April -2021
Hyderabad

King Nagarjuna's Wild Dog has released the other day and there is applause all over for the honest attempt of the team and Nagarjuna's hard work in a raw action entertainer. The team celebrated their success meet in Hyderabad as Mission Accomplished.

Speaking at the film's success meet, Nagarjuna said," I thank the audience for encouraging the film and our team. We were skeptical about releasing the film because of the increasing number of cases but we always believed in people encouraging good films. Happy with the audience going to theaters taking all safety measures. I thank the fans for all their support. They are always behind me in whatever I do. I will be always indebted to you. I should also thank the media for your support. I can not ask for more when people say every Indian should watch this film. I never feel anything risk during so much action. I am fearless and I am not afraid of experiments. I am hungry for new subjects. I am as such in my real life as well. It is not difficult when you do something you like".

Producer Niranjan Reddy said, "We got calls from every distributor saying that the audience is enjoying the film and the audiences are glued to their seats in the last 30 minutes. This Success meet is not to celebrate the box office numbers. This is because we got appreciation from the audience for our honest attempt. The collections are increasing with every show. There is COVID fear but the audience is coming to theaters appreciating a Good film. Everyone is appreciating our banner for making such an honest film. Nag sir has encouraged us to make this film. He is also the reason behind making this film so honest without deviating in the name of songs etc. He gave complete freedom to the director. We are happy with the response of the audience".

`వైల్డ్‌డాగ్` ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన సినిమా అంటుంటే చాలా హ్యాపీగా ఉంది - కింగ్ నాగార్జున

కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. దియా మీర్జా, సయామీఖేర్‌, అలీ రెజా, మ‌యాంక్‌, ప్ర‌దీప్‌, ప్ర‌కాశ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని ‌మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్‌2న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌లై స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో స‌క్సెస్ కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా...‌

న‌టుడు మయాంక్‌ మాట్లాడుతూ–‘‘మా సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నాగ్‌సర్‌ దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. మేమందరం ఓ కుటుంబంలా ఈ సినిమా చేశాం. ఈ సినిమా జర్నీ నాకు లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది’’ అన్నారు

న‌టుడు ప్రదీప్‌ మాట్లాడుతూ–‘‘ ఈ సినిమా సక్సెస్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆడియన్స్‌ ప్రతి సీన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అవకాశం ఇచ్చిన దర్శకల నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు.

న‌టుడు ప్రకాష్‌ మాట్లాడుతూ – ‘‘మా సినిమాపై ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.నాగ్‌ సర్‌ లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు’’ అని అన్నారు

న‌టుడు అలీ రెజా మాట్లాడూతూ –‘‘ఈ సినిమా రిలీజ్‌ కోసం ఎంతగానో ఎదురుచూశాను. థియేటర్‌లో ఆడియన్స్‌తో కలిసి ఈ సినిమా చూశాను. ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా చూడనివారు కచ్చితంగా చూడండి. వైల్డ్‌డాగ్‌ సినిమాను ప్రేక్షకులు తప్పక ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు.

చిత్ర నిర్మాత అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ - ‘‘వైల్డ్‌డాగ్‌’ సినిమాను మంచి సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ముందు ముందు ఇంకా పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని న‌మ్ముతున్నాను ‌’’ అన్నారు

చిత్ర నిర్మాత నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ - ``బాక్సాఫీస్‌ కోణంలో ఆలోచించి మేం ఈ సక్సెస్‌మీట్‌ పెట్టలేదు. సినిమా నిన్న‌నే రిలీజైంది. నాగార్జున‌గారు ముందు నుండి ఒక్క‌టే చెప్పారు. ఈ క‌థ‌ని మ‌నం హానెస్ట్‌గా చెబుతేనే ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతార‌ని. కాబ‌ట్టి మేం ఎలాంటి సినిమా తీయాలని ఆశించామో అలాంటి సినిమా తీశాం. మా ప్రయత్నం సఫలమైనందుకు ఈ మీట్‌ ఏర్పాటు చేశాం. అయితే మార్నింగ్‌ షో నుండి సెకండ్‌ షోకు కలెక్షన్స్ మ‌రింత పెరిగాయి. సినిమా చూసినవారు అంద‌రూ బాగుందని చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్‌ ఓనర్స్‌ చెబుతుండటం హ్యాపీ. మా బ్యానర్‌లో మరో మంచి సినిమా వచ్చిందని మా స‌న్నిహితులు, స్నేహితులు అన‌డం సంతోషంగా ఉంది. ఇలాంటి ఓ కొత్తరకం సినిమా తీయడానికి నాగార్జునగారే కారణం. డైరెక్టర్‌ అహిషోర్‌కు నాగార్జునగారు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. అందువ‌ల్లే ఇంత మంచి సినిమా తీయ‌గ‌లిగాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి యూనానిమ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ విజ‌యానికి కార‌ణ‌మైన మా టీమ్ అంద‌రికీ, అలాగే మంచి రివ్యూస్ ఇచ్చి మాకు స‌పోర్ట్ చేసిన మీడియా వారికి ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ – ‘‘నేను ఓ కొత్త ప్రయత్నం, ఓ కొత్త సినిమా తీసిన ప్రతిసారి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి ధన్యవాదాలు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో సినిమా రిలీజ్‌ చేయాలా? ఆడియన్స్‌ వస్తారా? అనుకున్నాం. కానీ సినిమా బాగుంటే ప్రేక్షకుల సపోర్ట్ త‌ప్ప‌కుండా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. కలెక్షన్స్‌ బాగున్నాయని నిర్మా త నిరంజ‌న్‌గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ప్రొత్సహిస్తున్న అభిమానుల అండదండలతోనే నేను కొత్తరకం సినిమాలు చేయగలగుతున్నాను. వారికి ఎప్ప‌టికీ ఋణ‌‌ప‌డి ఉంటాను. ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన సినిమా అని చాలా మంది అన్నారు. అదే ఈ సినిమాకు నాకు వ‌చ్చిన బెస్ట్ అప్రిసియేష‌న్‌. చాలా మంది ఈ ఏజ్‌లో రిస్కులు అవ‌స‌ర‌మా అన్నారు. నేను రిస్కులు చేయ‌బ‌ట్టే ఈ స్టాయికి రాగ‌లిగాను. రిస్క్ చేయ‌డం నాకు కొత్తేమి కాదు.. ప్రేమించే ప‌ని చేసిన‌ప్పుడు శ్ర‌మ ఎప్పుడు ఉండ‌దు. ఇంత మంచి అప్లాజ్ వ‌స్తున్నందుకు ద‌ర్శ‌కుడు సాల్మ‌న్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే మా టీమ్ మెంబ‌ర్స్ అంద‌రూ మంచి స‌పోర్ట్ చేశారు. వారికి మంచి అప్రిసియేష‌న్ వ‌స్తున్నందుకు హ్యాపీ`` అన్నారు.

Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved