16 August 2022
Hyderabad
క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన "కార్తికేయ 2" చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13 న థియేటర్స్ లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు,డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా
ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..ఈ సినిమాను హిందీ లో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్ లలో రిలీజ్ చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయి ఈ రోజు 700 థియేటర్స్ లలో ఆడుతుంది. అంటే ఈ వాల సినిమా లాంగ్వేజ్ అనే బారికేడ్లను క్రాస్ అయ్యి ప్రజల గుండెల్లోకి వెళ్ళింది అంటే సినిమా లో సత్తా లేకపోతె అన్ని థియేటర్స్ లలో ఆడదు కదా.. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి అన్నారు
ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండియా వైజ్ అందరి ప్రేక్షకులకు రిచ్ చేసిన కార్తికేయ 2 సినిమా హోల్ టీం కు కంగ్రాట్స్, ఆగష్టు మంత్ సినిమా ఇండస్ట్రీ కి ఊపిరి పోసిన ప్రేక్షకులకు ధన్యవాదములు. నిఖిల్, చందు గార్లు నాతో సినిమా రిలీజ్ గురించి మాట్లాడారు .మాకు ఏ సినిమా అయినా బాగా ఆడితే ముందు మేము ఆనందపడతాము తప్ప మాకు సినీ ఇండస్ట్రీ లో మాకు ఎలాంటి విభేదాలు లేకుండా మేమంతా హెల్టీ అట్మాస్ఫియార్ లో ఉంటాము అని అన్నారు.
చిత్ర నిర్మాత తి. జి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు.. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్,అనుపమ మరియు టీం అలాగే టెక్నీకల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడం తో సినిమా బాగా వచ్చింది అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ.. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
అతిధిగా వచ్చిన దర్శకుడు శ్రీ వాస్ మాట్లాడుతూ.. సినిమా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అందరూ కొత్త యాక్టర్స్ లా చాలా బాగా నటించారు. వీరందరికీ ఇది 2.0 అనుకోవచ్చు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు. ముఖ్యంగా మా సినిమా ఇంత బాగా రావడానికి మా టీం వారికి నా ధన్యవాదములు.టెక్నీకల్ గా అందరూ ఫుల్ కొ ఆపరేట్ చేశారు.షూటింగ్ మొదలు ఎండింగ్ వరకు నాతో ట్రావెల్ చేసిన మణి బాబు కర్ణం, కార్తీక్ ఘట్టమనేని లకు థాంక్స్ చెపుతున్నాను.అలాగే మా చిత్ర నిర్మాతల సహకారం మరువలేనిది. నాకింత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఇంత పెద్ద విజయం సాదించిన ఈ చిత్రం ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి అన్నారు.
నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు
సాంకేతిక నిపుణులు :
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్యం – చందు మెుండేటి
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరి& అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
కొ-ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్లనిర్మాతలు: టి.జి విశ్వ ప్రసాద్&అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్