pizza
Taxiwala Success celebrations
విజ‌య్‌కి స‌క్సెస్ కొత్తేమి కాదు - అల్లు అర‌వింద్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


17 November 2018
Hyderabad

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన‌ చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమా విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన ఈ సందర్భంగా శ‌నివారం జరిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ... విజ‌య్‌కి స‌క్సెస్ కొత్తేమి కాదు అత‌ను ఎన్నో స‌క్సెస్‌లు అందుకున్నాడు. ఎస్‌కెన్‌కి ఇది మొద‌టి చిత్రం స‌క్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మేమంతా వెన‌కుండి కేవ‌లం స‌పోర్ట్ చేస్తాం కాని ఈ విజ‌యం వెనుక వీరంద‌రి కృషి చాలా ఉంది. ఈ చిత్రం ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. త్వ‌ర‌లో మ‌నంద‌రం స‌క్సెస్‌మీట్‌లో క‌లుద్దాం అని అన్నారు.

విజ‌య‌దేవ‌ర‌కొండ మాట్లాడుతూ... అంద‌రం ఒక టీమ్ వ‌ర్క్ లాగా క‌లిసి చేశాం. ఆడియోలో నేను మిమ్మ‌ల్ని ఒక్క‌టే కోరాను థియేట‌ర్ల‌ను నింప‌మ‌న్నా ధియేట‌ర్లు నింపేశారు అందుకు కృత‌జ్ఞ‌త‌లు. నాకు ఈ అవ‌కాశం ఇచ్చి న‌న్ను ఇంత‌గా స‌పోర్ట్ చేస్తున్న నాప్రొడ్యూస‌ర్స్‌కి అర‌వింద్‌గారికి చాలా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ద‌ర్శ‌కుడు రాహుల్ మాట్లాడుతూ..
. ఈ సినిమా టెక్నిక‌ల్ గా చాలా స‌క్సెస్ అయింది అని అంద‌రూ అంటున్నారు. నేను నా టెక్నిక‌ల్ టీమ్ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. నేను ఉద‌యం సంధ్య థియేట‌ర్‌లో సినిమా చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని మార్పులు అర్ధ‌మ‌య్యాయి.
నాకు వంశీగారు, బ‌న్నీగారు, మారుతిగారు చెప్పిన మార్పులు చెప్పారు అందుకు వాళ్ళ‌కు చాలా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ... నిన్న‌టి వ‌ర‌కు పైర‌సీ అయిన సినిమా ఎలా హిట్ అవుతుందో అని ఆందోళ‌న ప‌డ్డాను. కాని ఒక పైర‌సీ అయిన సినిమాకి కూడా ఇంత మంచి ఓపెనింగ్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. తెలుగ‌మ్మాయిలు ఇంకా రావాలి తెలుగు అమ్మాయిల‌ను ఎంక‌రేజ్ చేస్తున్నందుకు కూడా నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ప్రొడ్యూస‌ర్ ఎస్‌.కె.ఎన్. మాట్లాడుతూ... ముందుగా నాకు అవ‌కాశం ఇచ్చిన వంశీ, బ‌న్నీ, అర‌వింద్ గారికి చాలా కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమాకి ఇంత హైప్ రావ‌డానికి విజ‌య‌దేవ‌ర‌కొండ క్రేజ్ వ‌ల్లే ఇది సాధ్యం అయింది. నా సినిమాని ఇంత బాగా హిట్ చేసినందుకు ప్రేక్ష‌కుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ... నేను ఈ సినిమా లైన్ గురించి చెప్పిన‌ప
్పుడు వంశీ నాకు విజ‌య్‌ని స‌జ‌స్ట్ చేశాడు. రాహుల్ చాలా ఇన్నోసెంట్‌గా చేశాడు. ఈ సినిమా పైర‌సీ అయిన‌ప్పుడు ఈ టీమ్ మొత్తం కొత్త వాళ్ళు కావ‌డంతో ముందు మేము చాలా భ‌య‌ప‌డ్డాము. ఎంతో క‌ష్ట‌ప‌డి చేస్తున్నారు ఈ సినిమా పైర‌సీ అవ్వ‌డ‌మేంటి అని. కాని ఇంత‌గా హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అర‌వింద్ గారు ఒక బ‌డ్జెట్ ఇచ్చారు. అందులోనే వాళ్ళు చేసుకెళ్ళారు. అంద‌రికీ ఇంత హైప్ వ‌చ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved