pizza
118 success meet
You are at idlebrain.com > News > Functions
Follow Us


13 March 2019
Hyderabad

నందమూరి కల్యాణ్‌రామ్‌, షాలినీ పాండే, నివేదా థామస్‌ హీరోహీరోయిన్లుగా ప్రముఖ ఛాయాగ్రహకుడు కె.వి. గుహన్‌ దర్శకత్వంలో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై యంగ్‌ ప్రొడ్యూసర్‌ మహేష్‌ ఎస్‌. కోనేరు నిర్మించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ '118'. మార్చి 1న వరల్డ్‌వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సంద‌ర్బంగా శ‌నివారం ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్‌లో...

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతూ - ``సినిమాల్లో మాకు గుర్తింపు వ‌స్తూనే ఉంటుంది. అయితే ఓ సినిమా ప్రారంభ‌మైన‌ప్పుడు అంద‌రి కంటే ముందే నిద్ర లేచే ప్రొడ‌క్ష‌న్ యూనిట్ ఉంటారు. అలాగే అంద‌రికీ కంటే ముందుగానే వ‌చ్చి, ఆల‌స్యంగా వెళ్లే లైట్ మ్యాన్స్ ..అలాగే మ‌మ్మ‌ల్ని సేఫ్‌గా తీసుకెళ్లే డ్రైవ‌ర్స్‌.. ఇలా చాలాడిపార్ట్‌మెంట్స్ వాళ్లు క‌ష్టం ఈ సినిమాలో ఉంది. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాకు ఇంత పెద్ద స‌క్సెస్ ఇవ్వ‌డం ద్వారా న‌న్ను రుణ‌ప‌డిపోయేలా చేశారు. అలాగే మా యూనిట్ ఈ సినిమా బావుంటుంద‌ని న‌మ్మి ప‌నిచేశారు. ఈ సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన షాలినికి కృత‌జ్ఞ‌త‌లు. త‌ను పాజిటివ్ ఆలోచ‌న‌తో చేసిన సినిమా. అలాగే నివేదా ఈ సినిమాకు సెకండ్ హీరో. త‌న పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. త‌మ్మిరాజుగారికి థాంక్స్‌. శేఖ‌ర్ చంద్ర‌గారు త‌న మ్యూజిక్‌తో, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో స‌న్నివేశాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. గుహ‌న్‌గారు సినిమాను చాలా చ‌క్కగా తెర‌కెక్కించారు. చాలా మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్ర‌మిది. ఇంత మంచి సినిమా చేసిన గుహ‌న్‌గారికి థాంక్స్‌. ఆయ‌న నెక్ట్స్ సినిమా కూడా నాతోనే చేయాల‌ని కోరుకుంటున్నాను. మా తార‌క్ ఫస్ట్ ఆడియెన్‌గా సినిమా గురించి కాంప్లిమెంట్ ఇచ్చారు. త‌న‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్‌. ఈ సంద‌ర్భంగా మా నాన్న‌గారిని మిస్ అవుతున్నాం. స‌క్సెస్ ఫెయిల్యూర్‌ని ప‌క్క‌న పెడితే.. `ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ నాన్న` అని నాన్న చెబుతుండేవారు. ఈ స‌క్సెస్‌ను మా నాన్న‌గారికి అంకిత‌మిస్తున్నాను`` అన్నారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``డిస్ట్రిబ్యూట‌ర్‌గా 23 ఏళ్లు పూర్త‌య్యాయి. అందులో కొన్ని బ్యూటీఫుల్ మెమొరీస్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ చిత్రం కూడా నిలిచిపోతుంది. మంచి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయ‌డం నాకు ఆనందాన్నిచ్చింది. కల్యాణ్‌రామ్‌గారికి, నిర్మాత మ‌హేష్ కొనేరుకి థాంక్స్‌`` అన్నారు.

హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ - ``షాలిని పాండే నైస్ జాబ్ చేశారు. ఇక నివేదాగారు కాసేపే క‌నిపించినా అద్భుత‌మైన క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. క‌ల్యాణ్ రామ్‌గారు ఈ సినిమా కోసం అద్భుత‌మైన వ‌ర్క్ చేశారు. ఎప్పుడూ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటారు. అలాగే ఈ సినిమా క‌థ‌ను న‌మ్మి కూడా ఎక్స్‌పెరిమెంట్ చేసి స‌క్సెస్‌ను అందుకున్నారు.

ప్ర‌భాస్ శ్రీను మాట్లాడుతూ - ``స‌ర‌దాగా న‌వ్వుకునే నాకు.. సీరియ‌స్ క్యారెక్ట‌ర్ అనుకోగానే, ఆలోచించాను. ఆ క్యారెక్ట‌ర్ కోసం బాగానే వ‌ర్క‌వుట్ చేసి ప‌నిచేశాను`` అన్నారు.

డైరెక్ట‌ర్ కె.వి.గుహ‌న్ మాట్లాడుతూ - ``డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న క‌ల‌ను క‌ల్యాణ్‌రాంగారు ఈసినిమాతో నిజం చేశారు. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. ఆయ‌న‌తో మ‌రో సినిమా చేయాల‌నుకుంటున్నాను. ఇక 118 సినిమాను ముందు నుండి చ‌క్క‌గా ప్ర‌మోట్ చేశారు నిర్మాత మ‌హేష్‌గారు. అలాగే ప్ర‌మోష‌న్స్‌తో పాటు మౌత్ టాక్ కూడా సినిమాకు బ‌లంగా తోడైంది. సినిమాను పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్. స‌క్సెస్‌తో పాటు గౌర‌వం కూడా తెచ్చిపెట్టిన చిత్ర‌మిది`` అన్నారు.

షాలిని పాండే మాట్లాడుతూ - ``కాన్సెప్ట్ సినిమాల‌ను ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. స్క్రిప్ట్ విన‌గానే ఇందులో భాగం కావాల‌నుకుని నిర్ణ‌యించుకుని న‌టించాను. క‌ల్యాణ్‌గారు చాలా మంచి కోస్టార్‌. నివేదా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

నివేదా థామ‌స్ మాట్లాడుతూ - ``చాలా మంచి ప్ర‌య‌త్నం చేశాన‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం పూర్తి ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేసిన అంద‌రికీ థాంక్స్‌. గుహ‌న్‌గారికి, క‌ల్యాణ్ రామ్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

 

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved