pizza
Aravinda Sametha success meet
'అరవింద సమేత వీర రాఘవ' సక్సెస్‌ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


11 October 2018
Hyderabad


యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్‌హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. అక్టోబర్‌ 11న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా...

దిల్‌రాజు మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌గారితో కలిసి సినిమా చూశాం. చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. ప్రేక్షకులు ఎలా రెస్పాండ్‌ అవుతారోనని ఆసక్తిగా ఎదురుచూశాను. ఉదయం ఆట నుండే అందరూ బావుంది అన్నారు. చాలా మంచి సినిమా చూశామని అంటున్నారు. ఓపెనింగ్స్‌ వైజ్‌ చూస్తే ఎన్టీఆర్‌గారి కెరీర్‌లోనే హయ్యస్ట్‌ గ్రాసర్‌గా ఉండబోతుంది. ఈ దసరాకి ఈ చిత్రం ఎలాంటి ట్రెండ్స్‌ క్రియేట్‌ చేయనుందో వేచి చూడాల్సిందే. మాటల మాంత్రికుడుగా పేరున్న త్రివిక్రమ్‌ మరోసారి మాయ చేశారు. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ అనగానే ఇంద్ర, ఆది, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఎగ్రెసివ్‌ మూవీస్‌ చూశాం. అయితే ఈ సినిమాలో చాలా సెటిల్డ్‌గా చేశారు. ఎన్టీఆర్‌గారి వన్‌ మ్యాన్‌ షో. త్రివిక్రమ్‌గారు అందరితో బాగా చేయించారు. తమన్‌తో మంచి పాటలు, రీరికార్డింగ్‌ చేయించిన త్రివిక్రమ్‌గారికి ఈ సందర్భంగా థాంక్స్‌ చెప్పుకుంటున్నాను. రెండు నెలలు మంచి హిట్‌ కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది. మంచి సినిమాను అందించిన శ్రీనివాస్‌గారికి, ఎంటైర్‌ టీమ్‌కు థాంక్స్‌'' అన్నారు.

సునీల్‌ మాట్లాడుతూ - ''నేను కూడా ప్రేక్షకులతోనే సినిమా చూశాను. నా క్యారెక్టర్‌ నాకు బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో రానంత ఆనందమేసింది సినిమా చూసి. ఎందుకంటే ఓ మంచి క్యారెక్టర్‌లో ఇలా నన్ను నేను చూసుకుని చాలా కాలమైంది. చాలా తృప్తిగా ఉంది. మామూలుగా ఫ్యాక్షన్‌ సినిమా అంటే ఓ యాక్షన్‌ సినిమా. కానీ త్రివిక్రమ్‌గారు యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ సినిమా కూడా చేసేశారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో మంచి క్లాసిక్‌ చూసినట్లు అనిపించింది'' అన్నారు.
ఎస్‌.ఎస్‌.తమన్‌ మాట్లాడుతూ ''దసరా సీజన్‌ నాకు చాలా బాగా వర్క్‌ అయ్యింది. ఎందుకంటే 2010లో దిల్‌రాజుగారి బ్యానర్‌లోనే అక్టోబర్‌ 14న బృందావనం విడుదలైంది. మళ్లీ ఈ దసరాకు అరవిందసమేతతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. సినిమాకు పనిచేసే మొదటి రోజు నుండి పాజిటివ్‌ ఫీలింగ్‌ కనపడుతూ వచ్చింది. చాలా హెల్దీ డిస్కషన్స్‌ చేసుకున్నాం. రీరికార్డింగ్‌ సమయంలోనే సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం వచ్చింది. త్రివిక్రమ్‌గారితో తొలిసారి చేసిన సినిమా. తారక్‌ అన్నతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది'' అన్నారు.

నవీన్‌ చంద్ర మాట్లాడుతూ - ''ఇలాంటి మంచి సినిమాలో బాల్‌ రెడ్డి పాత్ర చేసినందుకు ఆనందంగా ఉంది. ఒకప్పుడు అందాల రాక్షసి సూర్య అని పిలిచేవారు. ఇప్పుడు అందరూ బాల్‌రెడ్డి అని పిలుస్తున్నారు. నిర్మాత చినబాబుగారే నన్ను సజెస్ట్‌ చేశారు. అందుకు ఆయనకు థాంక్స్‌. యూనానిమస్‌గా హిట్‌ టాక్‌ రావడం ఆనందంగా ఉంది'' అన్నారు.

శత్రు మాట్లాడుతూ - ''సినిమాను బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. క్లైమాక్స్‌లో నేను నటించిన సీన్‌కు వస్తున్న రెస్పాన్స్‌ చూసి ఆనందమేసింది. అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌గారికి, నిర్మాతలకు థాంక్స్‌. ఇలాంటి మంచి క్యారెక్టర్స్‌ మరెన్నింటినో చేయాలనుకుంటున్నాను'' అన్నారు.

నవీన్‌ నూలి మాట్లాడుతూ - ''మా సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''నేను బేసిక్‌గా పెసిమిస్టిక్‌గా ఉండటానికే ప్రిపేర్‌ అయ్యుంటాను. అంత త్వరగా ఏదీ నమ్మను. చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. పరిచయం లేనివాళ్లు కూడా నాకు ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. నాకు గౌరవం ఇచ్చిన సినిమా. కాబట్టి ఇది నాకు స్పెషల్‌ మూవీ. మా అందరి కంటే ఎన్టీఆర్‌గారు ఈ కథను ఎక్కువగా నమ్మారు. సాంగ్స్‌ లేవు. ఆడియన్స్‌ కోరుకునే స్టెప్పులు తగ్గుతున్నాయా? అని మేం ఆలోచించేవాళ్లం.. ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గుతుందా? అని అనుకుంటే ఎనీఆర్‌గారు మాత్రం 'మీరేం పట్టించుకోకండి.. మీరు నాకు ఏ కథైతే చెప్పారో దాన్ని అలాగే తీయండి చాలు' మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపించారు. కాబట్టి ఈ సినిమా పరంగా ఫస్ట్‌ థాంక్స్‌ ఎన్టీఆర్‌గారికే చెప్పాలి. హిట్‌ ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. ఏ ఒత్తిడికీ లోను కాకుండా జెన్యూన్‌గా కథను చెప్పడానికి ప్రయత్నించాను. గత రెండేళ్లుగా నేను ప్రేక్షకుల్లో, మీడియా అందరూ మంచి కథలున్న సినిమాలకు సపోర్ట్‌ అందిస్తున్నారు. 1960లో సినిమాకు గోల్డెన్‌ ఏరా . కథలను నమ్మి సినిమాలు తీసేవారు. అది మళ్లీ మొదలైంది. దానికి ఉదాహరణలే గత రెండేళ్లుగా విడుదలైన సినిమాలు ప్రూవ్‌ చేశాయి. జెన్యూన్‌గా ఉండటంతో అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా వెయిట్‌ చేశాం. యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో చెప్పాలనేదే ఐడియా. అది జనాలకు బాగా నచ్చింది. కాస్త రిస్క్‌ తీసుకున్నాం. అందుకే ఎన్టీఆర్‌కు థాంక్స్‌ చెబుతున్నాను. యాక్షన్‌ సీక్వెన్స్‌లు బావున్నాయంటే అందుకు కారణం రామ్‌లక్ష్మణ్‌ మాస్టర్‌లే. ప్లాన్‌ చేసిన సీక్వెన్స్‌లను అద్భుతంగా ఎగ్జిక్యూట్‌ చేశారు. వాళ్లు ఫైట్‌ మాస్టర్స్‌ కాదు.. కథలో ఓ భాగాన్ని డైరెక్ట్‌ చేసే స్థాయి వాళ్లు చేరుకున్నారు. ఎన్టీఆర్‌గారితో క్లైమాక్స్‌లో ఓ యాక్షన్‌ ఏపిసోడ్‌ అనుకుని డిజైన్‌ కూడా చేసేశాం. అయితే ఫస్ట్‌ దాన్ని వద్దని చెప్పింది రామ్‌లక్ష్మణ్‌ మాస్టర్స్‌ చెప్పి వెర్బల్‌గా వెళతామని చెప్పారు. అందుకు కూడా రామ్‌లక్ష్మణ్‌లకు థాంక్స్‌. హీరో విలన్‌కి సారీ చెప్పడమే సినిమాకు బి,సిల్లో మంచి ఆదరణ వచ్చింది. సాధారణంగా మనం తప్పు చేస్తే సర్దడానికి ప్రయత్నిస్తాం. కానీ అన్‌ కండిషనల్‌గా క్షమాపణలు చెప్పడమనే సీన్‌ను నమ్మే సీన్‌ను ప్రీ క్లైమాక్స్‌ను డిజైన్‌ చేసుకున్నాం. ఎందుకనో స్టార్‌ ఇమేజ్‌ అని ముందు నుండి ఎవరం మాట్లాడుకోలేదు. ఉదాహరణకు నవీన్‌ చంద్రకు క్యారెక్టర్‌ గురించి చెప్పి క్యారెక్టర్‌ గురించి తనను ఆలోచించుకోమని అన్నాను. వారం తర్వాత తనే క్యారెక్టర్‌కి సంబంధించిన లుక్‌ అనుకున్నాడు. చిన్న కరెక్షన్స్‌తో నటించాడు. పెంచలదాస్‌కు చాలా చాదస్తం. ఎవరైనా సరిగ్గా చేయకపోతే.. ఎందీ సామీ ఇది సరిగ్గా లేదు అనేసేవాడు. ఆయన కోసం కూడా సీన్స్‌ రీటేక్‌ చేసిన సందర్భాలున్నాయి. అలాంటి వ్యక్తి కూడా శత్రు యాస మాట్లాడిన తీరు చూసి అప్రిషియేట్‌ చేయడమే శత్రుకి పెద్ద కాంప్లిమెంట్‌. డైరెక్టర్‌గా మమ్మల్ని ఎగ్జయిట్‌ చేసిన అంశాల్లో యాస ఒకటి. ఎందుకు యాసను ఫాలో చేయకూడదు ఓ అప్రోచ్‌తో ఫాలో అయ్యాం. అందరం ఓ సినిమాలో ప్యాట్రన్‌ను వెతికే ప్రయత్నం చేస్తుంటాం. దానికి సెంటిమెంట్‌ అని పేరు పెట్టుకుంటాం. కథను చెప్పినప్పుడే అందరికీ నచ్చిన ఐడియా ఆడవాళ్ల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చెప్పడమే. ఇప్పుడు అందరికీ అదే నచ్చింది.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved