pizza
Bhaagamathie success meet
`భాగ‌మ‌తి` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

30 January 2018
Hyderabad

అనుష్క టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `భాగ‌మ‌తి`. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అశోక్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా జ‌న‌వ‌రి 26న విడుద‌లైంది. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్‌లో స‌క్సెస్ మీట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో అనుష్క‌, దిల్‌రాజు, అశోక్‌, ర‌వీందర్‌, త‌మ‌న్‌, వంశీ, ప్ర‌మోద్‌, విక్కీ, జాషువా, ప్ర‌భాస్ శ్రీను, ధ‌న్‌రాజ్, ర‌విరాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అనుష్క మాట్లాడుతూ ```భాగ‌మ‌తి` విడుద‌లైన రోజు నుండి నేటి వ‌ర‌కు పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతుంది. చాలా మంది లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా చేస్తున్నావ‌ని అంటుంటారు. ఒక మంచి బ్యాన‌ర్‌, టీం కుదిరిన‌ప్పుడే అది కుదురుతుంది. మ‌రోసారి భాగ‌మ‌తితో అది సాధ్య‌మైంది. సినిమాలో ప‌నిచేసిన ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్‌`` అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ``అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి చిత్రాల‌కు అనుష్క ఎంత ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేసిందో ఈ సినిమాకు అంతే ఎఫ‌ర్ట్ పెట్టి ప‌ని చేసింది. అందుకు త‌న‌కు హ్యాట్సాఫ్. ఈ సినిమా పాయింట్‌ను న‌మ్మి అశోక్ ఇన్నేళ్లు ట్రావెల్ చేశాడు. అది ఈరోజు నిజ‌మైంది. తెలుగులో కాకుండా త‌మిళం, మ‌ల‌యాళంలో సినిమా మ్యాజిక్ చేసింది. కొత్త కాన్సెప్ట్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తామ‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి నిరూపించారు. అలాగే వంశీ, ప్ర‌మోద్‌, విక్కీల‌ను చూస్తుంటే న‌న్ను నేను చూసుకుంటున్న‌ట్లు ఉంది. ఎందుకంటే ఆరు సంవ‌త్స‌రాల్లో ఐదు హిట్స్ నేను కొట్టినట్లే, యు.వి.క్రియేష‌న్స్ ఆరు ఏళ్ల‌లో ఐదు హిట్స్ సాధించారు. సోమ‌వారం ఒక కోటి ఎన‌భై ల‌క్ష‌ల రూపాయ‌లు షేర్ సాధించింది. ఈ వీకెండ్‌కంతా మ‌రో మూడు నాలుగు కోట్ల‌ను సాధిస్తుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు అశోక్ మాట్లాడుతూ - ``ఇది స‌క్సెస్‌మీట్ కాదు... స‌క్సెస్‌ఫుల్ ప్ర‌యాణం. 2012లో స్టార్ట్ చేసిన జ‌ర్నీ ఇది. అప్పుడు తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ద‌ని ఈరోజు రుజువు అయ్యింది. నాతో పాటు ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ అంద‌రూ కూడా న‌మ్మ‌కంగా ట్రావెల్ చేశారు. ముఖ్యంగా అనుష్క నా క‌థ‌ను న‌మ్మి, ఈ స‌క్సెస్ వ‌ర‌కు ట్రావెల్ చేసింది. అందుకు స్వీటీ గారికి థాంక్స్‌. ఈ స‌క్సెస్ క్రెడిట్ అంతా అనుష్క, నిర్మాత‌ల‌కు చెందుతుంది`` అన్నారు.

 


 
Photo Gallery (photos by G Narasaiah)
 
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved