pizza
Bhale Manchi Chowka Beram success meet
`భ‌లే మంచి చౌక‌బేర‌మ్‌` స‌క్సెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


07 October 2018
Hyderabad

ఆరోళ్ల గ్రూప్ నిర్మించిన సినిమా `భ‌లే మంచి చౌక‌బేర‌మ్‌`. కె.కె.రాధామోహ‌న్ స‌మ‌ర్పించారు. మారుతి కాన్సెప్ట్ అందించారు. న‌వీద్‌, నూక‌రాజు, యామిని భాస్క‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌కుడు. స‌తీష్ నిర్మాత‌. ఈ సినిమా స‌క్సెస్‌మీట్ ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర‌యూనిట్ మొత్తం పాల్గొన్నారు.

కె.కె. రాధామోహ‌న్ మాట్లాడుతూ ``మా బ్యాన‌ర్‌లో విడుద‌ల చేసిన ఈ సినిమా చిన్న సినిమా అయినా ఆద‌ర‌ణ బావుంది. కంటెంట్ బావుండ‌టం వ‌ల్ల సినిమాను బాగా ఆద‌రిస్తున్నారు. రోజు రోజుకూ క‌లెక్ష‌న్లు బావున్నాయి. ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకా పిక‌ప్ అయి ఇంకా పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నా`` అని అన్నారు.

మారుతి మాట్లాడుతూ ``సినిమా తీయ‌డం తేలిక‌. విడుద‌ల క‌ష్టం. మౌత్‌టాక్‌తో రీచ్ అయ్యేలా చేయ‌డం చాలా క‌ష్టం. శ‌నివారం సాయంత్రానికి మాకు కాన్ఫిడెన్స్ వ‌చ్చింది. మేం అనుకున్న టార్గెట్‌ని రీచ్ అయ్యాం. క‌ష్ట‌పడి సినిమా చేశాం. మా చిన్న కాన్సెప్ట్ ని పెద్ద హిట్ చేసిన వారికి థాంక్స్ `` అని అన్నారు.

ముర‌ళీకృష్ణ మాట్లాడుతూ ``చిన్న సినిమా పెద్ద విజ‌యం సాధించినందుకు ఆనందంగా ఉంది. క‌లెక్ష‌న్లు ప్ర‌స్తుతం నార్మ‌ల్‌గా ఉన్నా, రోజురోజుకీ పెర‌గ‌డం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

న‌వీద్ మాట్లాడుతూ ``అంద‌రి స‌పోర్ట్ బావుంది సినిమాకు. క‌లెక్ష‌న్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 100 రూపాయ‌లు పెడితే 1000 రూపాయ‌ల వినోదం వ‌స్తుంది. మంచి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు ఉన్న సినిమా ఇది`` అని అన్నారు.

ముస్త‌ఫా మాట్లాడుతూ ``ఇంత మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన మారుతిగారికి, నిర్మాత‌కు థాంక్స్`` అని అన్నారు.

నూక‌రాజు మాట్లాడుతూ ``శుక్ర‌వారం విడుద‌ల రోజు మార్నింగ్ ఓపెనింగ్స్ చూసి డిస‌ప్పాయింట్ అయ్యాం. ఆ రోజు ఈవెనింగ్ కి ఫుల్స్ అయ్యాయి. ఇంకా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని చెప్పారు.

రాజా ర‌వీంద్ర మాట్లాడుతూ ``ఈ కేర‌క్ట‌ర్ బావుంద‌ని నాకు పాత్రికేయులు ఎప్పుడూ ఫోన్లు చేయ‌లేదు. ఈ సినిమాలో పాత్ర బావుంద‌ని అన్నారు. డైర‌క్ట‌ర్ బాగా తీశారు. ర‌వి బాగా డైలాగులు రాశారు`` అని అన్నారు.

యామిని భాస్క‌ర్ మాట్లాడుతూ ``సినిమా క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయ‌నే విష‌యం పక్క‌న‌పెడితే, ప్ర‌తి ఒక్క‌రూ సినిమా చూసి ప‌ది మందికి చెబుతున్నారు. టీమ్ అంద‌రికీ థాంక్స్`` అని అన్నారు.

ఉద్ధ‌వ్ మాట్లాడుతూ ``జెన్యూన్ హిట్ ఇది. మారుతిగారు అందించిన కాన్సెప్ట్ తో ముర‌ళీగారు బాగా తీశారు`` అని అన్నారు.

పూర్ణాచారి మాట్లాడుతూ ``స‌క్సెస్‌ఫుల్గా ర‌న్ అవుతోంది. మారుతి గారి కాన్సెప్ట్ బావుంది`` అని అన్నారు.

స‌తీష్ మాట్లాడుతూ ``ట‌ఫ్ సిచ్చువేష‌న్‌లో కాన్ఫిడెన్స్ తో విడుద‌ల చేశాం. టాక్ బావుంది. ఇంకా పెద్ద హిట్ కావాలి`` అని అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved