pizza
C/o Kancharapalem success meet
`కేరాఫ్ కంచ‌రపాలెం` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


8 September 2018
Hyderabad


రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్ప‌ణ‌లో సురేశ్ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ మ‌హా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `కేరాఫ్ కంచ‌ర‌పాలెం`. విజ‌య్ ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌.సుబ్బారావు, రాధా బెస్సి, కేశ‌వ‌, కార్తీక్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..

విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి మాట్లాడుతూ - ``నేను అమెరికాలో కార్డియాల‌జిస్ట్‌గా ప‌నిచేస్తుంటాను.సినిమాలు చేయాల‌నే ఆస‌క్తితో ఇండియా వచ్చాను. వెంక‌ట్ మ‌హా నా ద‌గ్గ‌ర‌కు ఈ క‌థ తీసుకు వ‌చ్చారు. న‌చ్చ‌డంతో సినిమా చేశాం. అయితే సురేశ్ బాబు, రానాగారి స‌పోర్ట్‌తో సినిమాకు మంచి పేరు వ‌చ్చింది. మంచిన‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల కార‌ణంగా మంచి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాం. ప్రేక్ష‌కులు ఆదరిస్తున్నందుకు హ్యాపీగా ఉంది`` అన్నారు.

మోహ‌న్‌భ‌గ‌త్ మాట్లాడుతూ - ``సినిమాలో గడ్డం పాత్ర‌లో న‌టించాను. సినిమారిలీజ్ త‌ర్వాత అంద‌రూ న‌న్ను అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్`` అన్నారు.

కార్తీక్ మాట్లాడుతూ - ``నేను థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వ‌చ్చాను. సినిమాలో జోసెఫ్ పాత్ర‌లో న‌టించాను`` అన్నారు.
సినిమాటోగ్రాఫ‌ర్ ఆదిత్య మాట్లాడుతూ - ``ఇలాంటి సినిమాను నేను ప‌నిచేస్తాన‌ని..అనుకోలేదు. మ‌హా చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమాను ప్రేక్ష‌కుల‌కు రీచ్ చేయించిన సురేర‌శ్‌బాబుగారికి, రానా గారికి థాంక్స్‌`` అన్నారు.

సౌండ్ డిజైన‌ర్ నాగార్జున‌ మాట్లాడుతూ -`` సింక్ సౌండ్‌లో సినిమా చేయాల‌న‌గానే కంచ‌రపాలెం చేరుకున్నాను. అక్క‌డ‌కు చేరుకోగానే సింక్ సౌండ్ ఎలా చేయాలో అర్థం కాలేదు. అంత డిస్ట్రబెన్స్ అనిపించింది. 9 రోజుల పాటు షూటింగ్ కూడా ఆపేశాం. ఆ సౌండ్‌లో గ్యాప్ తీసుకుని శ‌బ్దాలు లేని స‌మ‌యంలో షూటింగ్ చేశాం. న‌టీన‌టులు ముందుగానే ప్రిపేర్ రావ‌డం మాకు సుల‌భ‌మైంది`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ - ``ఈ సినిమాకు సంగీతం అందించ‌డ‌మే కాదు.. ఓ పాట కూడా పాడాను. విజ‌య‌గారు సినిమాకు రైట్ ప్రొడ్యూస‌ర్‌. రైట్ టైమ్‌లో సురేశ్‌బాబుగారు స‌హ‌కారం అందించారు. డైరక్ట‌ర్ వెంక‌ట్ సౌండ్ విష‌యంలో చాలా క్లియ‌ర్‌గా ఉన్నారు కాబట్టే మంచి అవుట్‌పుట్ రాబ‌ట్టుకోగ‌లిగాం`` అన్నారు.

వెంక‌ట్ సిద్దారెడ్డి మాట్లాడుతూ - ``సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌లో 2.0 వెర్ష‌న్ స్టార్ట‌య్యింది. ఇప్పుడు స‌క్సెస్ అవుతున్న కొత్త కాన్సెప్ట్ సినిమాల్లోఏదో ఒక ర‌కంగా సురేశ్ ప్రొడక్ష‌న్స్ భాగంగా ఉంది. ఇలాంటి సినిమాలు మ‌రిన్ని రావాలి`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు వెంక‌టేశ్‌ మ‌హా మాట్లాడుతూ - ``యాక్టింగ్ అనేది డెడ్లీ స్పోర్ట్‌. చాలా ఎన‌ర్జీ ఖ‌ర్చు అవుతుంది. నేను క‌నీస స‌దుపాయాలు కూడా ఏర్పాటు చేయ‌లేదు. షూటింగ్ మ‌ధ్య దాహం వేసినా.. ఇంటికి వెళ్లి నీళ్లు తాగి వ‌చ్చేవాళ్లు. నటీన‌టులు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అలాగే సాంకేతిక నిపుణులు ఎంత‌గానో సపోర్ట్ అందించారు. ఆదిత్య‌, వ‌రుణ్‌లు ఎంతో బ్యూటీఫుల్ విజువ‌ల్స్ అందించారు. కంచ‌ర‌పాలెంను నేను ఎలా చూపించాల‌నుకున్నానో అలాగే క‌న‌ప‌డుతుంది. ఎడిట‌ర్ ర‌వి.. చంఢ‌శాస‌నుడు. క‌చ్చితంగా త‌ను జాతీయ‌స్థాయిలో శ్రీక‌ర్ ప్ర‌సాద్‌లా గొప్ప ఎడిట‌ర్ అవుతాన‌ని చెప్ప‌గ‌ల‌ను. కంచ‌ర‌పాలెంలో ఐదు నిమిషాల‌కు ఒక‌సారి ట్ర‌యిన్ వ‌స్తుంది. అర‌గంట‌కో, గంట‌కో ఓ ఫ్లైట్ వ‌స్తుంది. ఈ సౌండ్స్ మ‌ధ్య‌లో షూటింగ్ చేయాలంటే చాలా క‌ష్టం. అలాంటిది దాన్ని సౌండింగ్‌ చేయాలంటే ఇంకెంత క‌ష్టముంటుందో అర్థం చేసుకోండి. నాగార్జున అద్భుత‌మైన సింక్ సౌండ్ అందించాడు. నేను స్వీక‌ర్, క‌లిసి పెరిగాం. త‌ను మ‌ణిశ‌ర్మ‌గారి వ‌ద్ద ప‌నిచేశాడు. ఫైన‌ల్ క‌ట్ త‌ర్వాతే స్వీక‌ర్ మ్యూజిక్ ఇచ్చాడు. త‌ను ఓ పాట‌ను కూడా పాడాడు. సినిమాను క్రౌడ్ ఫండింగ్ చేద్దామ‌ని అనుకుంటున్న త‌రుణంలో.. విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరిగారు .. నేను డైరెక్ట్ చేసిన వీడియో చూసి సినిమాను ప్రొడ్యూస్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆ రోజు నుండి నేటి వ‌ర‌కు ఆమె నాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఆమె నుండి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. సురేశ్‌బాబుగారు, రానాగారు ఓ ఎర్ర‌బ‌స్సు ప్ర‌యాణాన్ని బిజినెస్ క్లాస్ ప్ర‌యాణంగా మార్చారు. సురేశ్‌బాబుగారు, రానాగారు బ్యాక్ అప్ ఇచ్చి ఉండ‌క‌పోతే.. ఈ రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌కు సినిమా రీచ్ అయ్యేది కాదు. ఈ సంద‌ర్భంగా వారికి నా కృత‌జ్ఞ‌త‌లు. ప్రేక్ష‌కుల రెస్పాన్స్ చూసి నిజ‌మేనా! అనే అనుభూతి క‌లుగుతుంది. ఆద‌రిస్తున్న అందరికీ థాంక్స్‌`` అన్నారు.

డి.సురేశ్ బాబు మాట్లాడుతూ - ``చిన్న సినిమాలంటే చిన్న చూపు ఉండ‌టమే చెడు అల‌వాటుకు అల‌వాటు ప‌డిపోయి ఉన్నాం. మంచి సినిమాల‌ను త‌క్కువ మంది చూస్తున్నారు. కాబ‌ట్టి ఫిలిం ల‌వ‌ర్స్‌కు, సెల‌బ్రిటీస్‌కి సినిమా చూపించాం. అంద‌రూ సినిమా చూసి.. చాలా బావుంద‌ని జ‌నాల్లోకి సినిమాను తీసుకెళ్లిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. విజ‌య ప్ర‌వీణ అమెరికా నుండి.. వెంక‌టేశ్ మ‌హా అనే కొత్త అబ్బాయితో ధైర్యంగా సినిమా చేసింది. ఫ‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్ అయిన మ‌హా ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గా రాసి నేచుర‌ల్‌గా తెర‌కెక్కించారు. అందుకే సినిమా చూసిన అంద‌రూ అభినందించారు. ఇక న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రూ గ్రేట్ జాబ్ చేశారు. ముఖ్యంగా సినిమాలో న‌టించిన వారంద‌రూ కొత్త‌వాళ్లైనా అద్భుతంగా న‌టించారు. ఈ సినిమా ఇంకా స‌క్సెస్ కావాలి.. ఇంకా చాలా మందికి సినిమా ఎంత మంచి సినిమానో తెలియాల్సిన అవ‌స‌రం ఉంది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved