pizza
Ee Nagaraniki Emaindi success meet
`ఈ న‌గ‌రానికి ఏమైంది?` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


02 July 2018
Hyderabad

విశ్వక్‌సేన్‌, సాయి సుశాంత్‌, వెంకట్‌ కాకుమాను, అభినవ్‌ గోమటం, అనీషా అంబ్రోస్‌, సిమ్రాన్‌ చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?'. తరుణ్‌ భాస్కర్‌ దర్శకుడు. డి.సురేశ్‌ బాబు నిర్మాత. ఈ సినిమా జూన్‌ 29న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్‌లో...

చిత్ర నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ - ```ఈన‌గ‌రానికి ఏమైంది?` సినిమా విడుద‌లై చాలా పెద్ద సక్సెస్‌ను సాధించింది. ఈ సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. త‌రుణ్ ఇత‌ర న‌టీన‌టుల‌కు థాంక్స్‌. వాళ్ల కృషికి ప్రేక్ష‌కులు మంచి ఫ‌లితాన్ని ఇచ్చారు. సినిమా చూసిన వారంద‌రూ ఈ సినిమా వారి చిన్నత‌నంలో జ‌రిగిన విష‌యాల‌ను గుర్తుకు తెస్తుంద‌ని అంటున్నారు. చాలా ఎంట‌ర్‌టైనింగ్ ఉంద‌ని అంటున్నారు. పైర‌సీని ఎంక‌రేజ్ చేయ‌వ‌ద్దు. ఎందుకంటే సినిమా అనేది చాలా మంది క‌ష్టం. చాలా మంది భ‌విష్య‌త్ సినిమాపై ఆధార‌ప‌డి ఉంటుంది. సినిమాలు కొన్ని రోజుల‌కు డిజిటల్ ఫ్లాట్‌పామ్స్‌, శాటిలైట్ ప్లాట్‌ఫామ్‌ల్లోకి వ‌స్తాయి... కాబ‌ట్టి పైర‌సీలో చూడాల్సిన అవ‌స‌రం లేదు`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్ మాట్లాడుతూ - ``సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. కొత్త‌వాళ్ల‌తో చేసిన‌ప్పుడు ప్రాబ్ల‌మ్ అవుతుందేమో, ఓపెనింగ్ ఉంటుందా? ఉండ‌దా? అని ముందు భ‌య‌ప‌డ్డాను. కానీ చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ రెస్పాన్స్ చూడ‌గానే ఆనందంగా అనిపించింది. ఇంత క‌ష్ట‌ప‌డినందుకు మంచి రెస్పాన్స్ రావ‌డం ఆనందంగా ఉంది. రిపీటెడ్ ఆడియెన్స్ వ‌స్తున్నారు. అంద‌రూ సినిమాకు రిలేట్ అవుతున్నారు. ఈ సినిమాను `పెళ్ళిచూపులు` సినిమాతో కొంద‌రు పోల్చుకుంటున్నారు. కానీ.. ఇది డిఫ‌రెంట్ మూవీ. రెండింటికీ పోలిక లేదు. ఆల్క‌హాల్‌, ఆల్క‌హాల్‌కు బానిసైన వారి గురించి, ఈ త‌రం యువ‌త గురించి ఈ సినిమా మాట్లాడుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా సినిమా చూసేలా ఉంది. చూడ‌ని వారేవ‌రైనా ఈ సినిమా చూస్తే వారికి పాత జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తాయ‌ని న‌మ్ముతున్నాం. రివ్యూవ‌ర్స్ గురించి నేను ఏదో అన్నాన‌ని అంటున్నారు. రివ్యూస్ అనేవి బాధ్య‌త‌తో ఉండాలి. ఎందుకంటే సినిమాను చాలా క‌ష్ట‌ప‌డి తీస్తాం. రివ్యూస్ వ‌ల్ల‌నే `పెళ్ళిచూపులు` పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు `ఈ న‌గ‌రానికి ఏమైందిఝ‌` సినిమాకు కూడా మంచి రివ్యూస్ వ‌చ్చాయి. రివ్యూస్ వ‌ల్ల‌నే నేను ఇంకా విష‌యాలు తెలుసుకుని బెట‌ర్ అవుతాను. కెమెరా ఎక్క‌డ పెట్టాలి.. లైటింగ్ ఎలా ఉండాలి అనే విష‌యాన్ని ఓ రివ్యూలో చ‌దివి డిస్ట్ర‌బ్ అవ‌డం వ‌ల్ల‌నే అలా మెసేజ్‌లో పెట్టాను. ఇక‌పై సోష‌ల్మీడియాలో ఉండ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నాను. నేను ఏదీ మాట్లాడిన ఇష్యూ అవుతుంది. రివ్యూస్ ముఖ్య‌మే. ప్ర‌తి ఒక్కరి రివ్యూని నేను గౌర‌విస్తున్నాను`` అన్నారు.

అభిన‌వ్ గోమ‌టం మాట్లాడుతూ - ``సినిమాను థియేట‌ర్‌లో చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఇంజ‌నీరింగ్ టైమ్‌లో.. వాళ్లు చ‌దువుకున్న టైమ్‌లో రోజులు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని చాలా మంది మాకు చెబుతున్నారు`` అన్నారు.

విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ - ``అన్ని ఏజ్ గ్రూపుల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయిన సినిమా ఇది. అంద‌రికీ వారు చ‌దుకున్న రోజులు, వారి స్నేహితుల‌తో ఉన్న రోజులు గుర్తుకు వ‌స్తున్నాయని అంటున్నారు. త‌రుణ్‌భాస్క‌ర్‌గారికి, సురేశ్‌బాబుగారికి థాంక్స్‌`` అన్నారు.

సాయిసుశాంత్ మాట్లాడుతూ - ``అనుకుని ఉంటే స్టార్స్‌తో కూడా త‌రుణ్ భాస్క‌ర్ రెండో సినిమాను చేసుకుని ఉండొచ్చు. కానీ త‌ను మ‌ళ్ళీ కొత్తవాళ్ల‌తోనే ఈ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. అందుకు త‌న‌కు థాంక్స్‌. త‌రుణ్ నిజాయ‌తీగా చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు కూడా నిజాయ‌తీగానే ఆద‌రిస్తున్నారు`` అన్నారు.

సిమ్రాన్ చౌద‌రి మాట్లాడుతూ - ``ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. సోష‌ల్ మీడియా ద్వారా చాలా మంది ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని అభినందిస్తున్నారు. థియేట‌ర్స్‌లోనే సినిమా చూడండి. ఏవైనా పైర‌సీ లింక్స్ ఉంటే ఫేస్‌బుక్ ద్వారా మాకు మెసేజ్ పంపండి`` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇత‌ర యూనిట్ స‌భ్యులు పాల్గొని స‌క్సెస్ ప‌ట్ల త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved