3 June 2019
Hyderabad
`ఫలక్‌నుమాదాస్` విశ్వక్ సేన్.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడంటూ దుమారం రేగింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో హీరో విశ్వక్ పోస్ట్ చేసిన వీడియోలో, విజయవాడ ప్రెస్‌మీట్‌లో హీరో విశ్వక్ సేన్ విజయ్‌దేవరకొండ ఫ్యాన్స్‌ను, రివ్యూ రైటర్స్‌ను దూషించాడని.. కొందరిని టార్గెట్ చేస్తూ వివాదస్పదంగా మాట్లాడాడు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ
- మీడియా ముందు, లైవ్‌లో, ఇంటర్వ్యూలో అయినా నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడుతాను. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1500 ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెడితే.. పెట్టిన నలభై సెకన్స్‌లో చివరి ఆరు సెకన్స్ వదిలేసి, అసలు ఎవడిని అన్నాడు? అనే డైలామా క్రియేట్ అయ్యింది. ఎవడ్ని అన్నాననే బ్లాంక్స్‌ను కొంత మంది నిన్ను అన్నాడు.. కాదు నిన్ను అన్నాడంటూ పబ్లిసిటీ చేశారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు.. పెద్ద జోక్ కూడా. నేను ఏ రివ్యూ రైటర్‌నికానీ.. మీడియాను కానీ.. ఏ హీరోను కూడా ఏమీ అనలేదు. కానీ కొందరు పని కట్టుకుని సినిమాపై నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు.
- నేను ఓ ఐదు కోట్లు ఖర్చు పెట్టుకుని ఓ కమర్షియల్ సినిమా చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా చాలా మంది ఫిలిం మేకర్స్‌కు నా సినిమా ఒక లాంచింగ్ ప్యాడ్‌లా ఉండాలని 80 మంది కొత్తవాళ్లను పెట్టి సినిమా చేశాను. మా యూనిట్‌లో మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ మాత్రమే సీనియర్స్. మిగతా వారెవ్వరూ సీనియర్స్ కారు. ఇంత మంది రెండేళ్లు కష్టపడి సినిమా తీసి.. ఈ సినిమాతో అందరం బాగుపడతాంరా! అనుకుని పనిచేశాం. అయితే మా సినిమాపై నెగిటివీని ప్రచారం చేయడానికి ఓగ్రూప్ తయారైంది.
- ఎంత ఖర్చు పెట్టి వేసిన పోస్టర్స్‌ను కొందరు చించేశారు. అది చూసి చాలా బాధేసింది. నేను డబ్బులు ఎక్కువై సినిమా చేయలేదు. అందరి డబ్బు తిరిగి ఇవ్వాలనే బాధ్యత నాకుంది. అలాగే ఎవరినో ఏదో అనేసి పబ్లిసిటీ తెచ్చుకుందామనే చీప్ మెంటాలిటీ నాకు లేదు. అలాగైతే ఇంత పెద్ద సినిమాను నేను డైరెక్ట్ చేయలేను. ఏదో చీప్ ట్రిక్స్ చేసుకుంటుండేవాడిని.
- నా సినిమా పైరసీని ఆరికట్టడంలో సపోర్ట్ చేస్తున్న నాతోటి వారికి, ఫిలించాంబర్ పైరసీ సెల్ వాళ్లకు థాంక్స్. మూడు రోజులుగా పైరసీ లింకులు వస్తుంటే వాటిని అరికట్టడంతో బిజీగా ఉన్నాం. నా సినిమాపై కొందరు నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఈ పనిని వారు కావాలనే చేస్తున్నారు. నా సినిమాకు పదికోట్లు నష్టం వస్తుందని తెలిసినప్పుడు కంట్రోల్ తప్పి, ఒక మాట అన్నాను. దానికి నా తరపు నుండి వెరీ వెరీ సారీ!. మూడు రోజులుగా నిద్రలేకుండా కష్టపడుతున్నాం. అలాంటి సందర్భంలో సినిమా బాగోలేదంటే నాకు సుర్రుమని కోపం వచ్చింది.
- సమస్య వచ్చిందని నేను బాధపడలేదు. ఎందుకంటే నేను నిజాయతీగా ఉన్నాను. ఎవరినీ పాయింట్ ఔట్ చేయలేదు. ఒకరినీ పాయింట్ ఔట్ చేస్తే మనకు హైప్, అటెన్షన్ వస్తుందని అనుకుని ఉండుంటే ఆ కథ మరోలా ఉండేది. నాకున్న పరిస్థితికి నేను కూల్‌గా ఉంటూ హీరోగా సినిమాలు చేసుకోవచ్చు. రెండేళ్లు కష్టపడి సినిమా తీయనవసరం లేదు.
- లక్షన్నర, రెండు లక్షలు ఖర్చు పెట్టి వేసిన పోస్టర్స్‌ను చింపేశారు. మా సినిమాపై అంత నెగటివ్‌గా ఉండాల్సిన అవసరమేంటి? నేను ఎవడినీ ముంచి సినిమా తీయలేదు. సినిమాను ఆదరిస్తే మరో సినిమా వస్తుంది. నా స్థానంలో ఎవరైనా భయపడేవాడు ఉంటే కచ్చితంగా పారిపోతాడు. ముందు 10 నిమిషాలు నేను షాక్ అయ్యాను. తర్వాత ఆలోచించాను. అసలు నేను ఎవరికి భయపడాలి అనిపించింది. ఆ విషయంపై నేను విజయవాడలో క్లారిటీ ఇచ్చాను. ఫుల్ వీడియో చూపకుండా, కట్ చేసి చూపిస్తున్నారు. నేను ఆడియెన్స్‌ను తిట్టానని అంటున్నారు. నేను ఆడియెన్స్‌ను ఎందుకు తిడతాను? నా సినిమా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ వీక్‌లో విడుదలైన సినిమాలన్నింటిలో నా సినిమాకే హయ్యస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. నేను ఎవరినీ హర్ట్ చేయలేదు. అయితే నా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో కస్ వర్డ్ వాడినందుకు సారీ. నేను ఎవరికీ సవాల్ విసరలేదు. ఎవరి ఫ్యాన్స్‌ను ఏమీ అనలేదు. నాకు అన్నం పెట్టేదే సినిమా. అలాంటిది రివ్యూ రైటర్స్‌ను నేను ఎందుకు విమర్శిస్తాను. నిజంగా నేను వాళ్లని అన్నట్లు నిరూపిస్తే ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతాను.
- ఇండస్ట్రీ అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి. నా సినిమాపైన అంత పగ ఎందుకు? ప‌్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమా బాగుండాలనే అనుకుంటాను.
- నా మైల్ స్టోన్ వేరే. అక్కడి చేరుకునే రేసులో కొంత మంది నాకు తారసపడొచ్చు. వాళ్లని దాటేశాం కదా! చాలులే అని అనుకోను.
-నా కంటికి ఎవడైతే టాలెంటెడ్‌గా కనిపించాడో వారందినీ పెట్టుకుని సినిమా చేశాను. ఈరోజు సినిమా నడుస్తుంది.
- నిన్న సెకండ్ షో కాకుండా 4.80 కోట్ల రూపాయల గ్రాస్‌ను మా సినిమా కలెక్ట్ చేసింది. ఈ వీక్‌లో విడుదలైన సినిమాలన్నింటీలో మాదే హయ్యస్ట్ గ్రాసర్. ఇదే స్పీడుతో మరో వారం కూడా సినిమా నడుస్తుంది. రివ్యూలు, రేటింగ్స్‌ను పక్కన పెడితే ప్రేక్షకులు సినిమాను బ్రతికిస్తున్నారు.
- సినిమాకు టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుంది. నా సినిమాకే కాదు.. ఏ సినిమాకు ఇలాంటి నెగివిటీ ఉండకూడదు.