'స్వామిరారా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్ సూర్య', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వామిరారా, దోచెయ్ చిత్రాల డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కేశవ'. ఈ సినిమా మే 19న విడుదలైంది. ఈ సందర్బంగా సోమవారం హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా..
నిఖిల్ మాట్లాడుతూ - సినిమా పెద్ద సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారేమోనని అనుకున్నాను. కానీ నేను ఊహించిన దానికంటే పెద్ద హిట్ చేశారు. మూడు రోజుల్లో 11.4 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. నా సినిమాల్లో ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా కేశవ నిలిచింది. నేను వైవిధ్యమైన కథలతో చేస్తున్న సినిమాలను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
రీతూవర్మ మాట్లాడుతూ - ``సినిమాకు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు`` అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ - ``సినిమా సక్సెస్ అయ్యిందా లేదా అని నిర్మాతను చూస్తే తెలుస్తుంది. నిర్మాత అభిషేక్ నామా ఎంతో సంతోషంగా ఉన్నారు. సుధీర్ వర్మ ముందుగా ఈ కథను నాకే చెప్పారు. డిఫరెంట్‌గా ఉందని నేను చెప్పాను. హ్యాపీడేస్‌లో నిఖిల్‌కు, ఈ కేశవ సినిమాలో నిఖిల్‌కు చాలా తేడా కనపడుతుంది. ఏ కథలోనైనా ఒదిగిపోతున్నాడు. సింగిల్ ఎమోషన్‌ను చక్కగా పలికించాడు. డైలాగ్స్ తక్కువగా ఉన్నా, అందరూ మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. సుదీర్ వర్మ సినిమాను బాగా తెరకెక్కించాడు. సినిమా ఇంకా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సుధీర్ వర్మ మాట్లాడుతూ - ``నేను అనుకున్నది అనుకున్నట్లుగానే సినిమా చేశాను. నిఖిల్ కథ చెప్పగానే ఒప్పుకున్నాడు. సుకుమార్‌గారు ముందు కథ విని చెయ్యమనే చెప్పారు. కథ మామూలుగానే ఉన్నా, ట్రీట్‌మెంట్ కొత్తగా ఉందని అభిషేక్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు`` అన్నారు.