pizza
KGF success meet
`కె.జి.య‌ఫ్‌` స‌క్సెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us



27 December 2018
Hyderabad

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై రాక్‌ స్టార్‌ యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ నిర్మాతగా రూపొందిన చిత్రం 'కేజీఎఫ్‌(కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌)'. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్రం విడుదల చేసింది. ఈ సినిమా స‌క్సెస్‌మీట్ గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది...

స్టార్‌ యష్‌ మాట్లాడుతూ - ''కె.జి.యఫ్‌ గణవిజయం సాధించిన సందర్భంగా ముందుగా ప్రొడ్యూసర్‌ గారిని గుర్తుచేసుకోవాలి. చాలా మంచి ప్రొడ్యూసర్‌. ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమా, బిజినెస్‌ సినిమా అవుతుంది అని ముందుగా నమ్మిన వ్యక్తి విజయ్‌ కిరగందుర్‌. తెలుగు ప్రజల అభిమానం చూస్తుంటే డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ గారు చెప్పిన 'అభిమానులే దేవుళ్ళు' అనే మాట గుర్తుకు వస్తుంది. నా ఫస్ట్‌ సినిమాకే ఇంత గొప్ప వెల్‌కమ్‌ చెప్పిన తెలుగు ప్రజలు నిజంగానే దేవుళ్ళు. నేను 10 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా నాకు ఇలాంటి వెల్‌కమ్‌ చెప్పి నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా నన్ను ప్రేమగా హగ్‌ చేసుకున్నారు. ఈ సినిమాను ముందు నుండి నమ్మి ప్రతీఊరిలో ప్రతిఇంటికీ తీసుకెళ్లిన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలకి మంచి డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా అవసరం. ఆ విషయంలో నేను సాయి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాను చూసి ముందుకు వచ్చి మా టీంకు బూస్టప్‌ ఇచ్చిన ఎస్‌. ఎస్‌. రాజమౌళిగారికి నా ప్రత్యేకమైన క తజ్ఞతలు. అంత గ్రేట్‌ పర్సన్‌ నా గురించి అద్భుతంగా మాట్లాడడం నిజంగా నాకు ఆశ్ఛర్యం వేసింది. ఆయన అంచనాలను ఈ సినిమా ఘన విజయం ద్వారా అందుకున్నామని అనుకుంటున్నాం. రామరాజుగారు చాలా హార్డ్‌ వర్కర్‌. ఈ సినిమాకు ఆయన తండ్రి శ్రీ కైకాల సత్యనారాయణగారి పేరును ఇచ్చి చాలా సహాకారం అందించారు. హనుమాన్‌గారు నిజంగా నన్ను ఇన్‌స్పైర్‌ చేసిన వ్యక్తి. ఆయన క షి వల్లనే ఈ సినిమా డబ్బింగ్‌ సినిమాలా కాకుండా స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలా మాటలు అందించారు. ఈ సినిమా కోసం ఆయన ఐదు వెర్షన్స్‌లో డైలాగ్స్‌ రాసి ఇచ్చారు. ఇక సాహిత్యం విషయానికి వస్తే రామజోగయ్య శాస్త్రిగారు ఈ స్క్రిప్ట్‌లో ఇన్‌వాల్వ్‌ అయి రాశారు. ముఖ్యంగా 'ఎవరికి ఎవరు బానిస' అనే పదానికి తెలుగు ప్రజలు కనెక్ట్‌ అయ్యారు. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించారు. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది అంటే ఆయన టేకింగ్‌ కారణం. భువన గౌడ గారి ప్రతీ ఫ్రేమ్‌ అద్భుతంగా ఉండి హాలీవుడ్‌ స్థాయిని గుర్తుచేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టి చాలా లక్కీ. ఒకేసారి అయిదు భాషలలో పరిచయం అయింది. తెలుగు హీరోలు చాలా గ్రేట్‌ వాళ్ళ డాన్సులు, ఫైట్స్‌ లకు నేను పెద్ద ఫ్యాన్‌ని. తెలుగు హీరోలందరి సినిమాలు చూసి నేను తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాను. వాళ్ళే నాకు ఇన్‌స్పిరేషన్‌'' అన్నారు.

పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - ''కె.జి.యఫ్‌' అంటే కన్నడ గోల్డెన్‌ ఫిలిమ్‌ అనేలా సినిమా ఉంది. ఈ సంవత్సరానికి బ్రహ్మాండమైన ముగింపు. ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమా అయ్యిందంటే ఆ క్రెడిట్‌ అంతా చిత్ర యూనిట్‌కి దక్కుతుంది. ఈ సినిమాను నేను పూర్తిగా చూసి పాటలు రాయడం జరిగింది. ఈ సినిమాలో అన్ని పాటలు నేనే రాయడం జరిగింది. పాటలు వింటుంటే గూస్‌బమ్స్‌ వస్తున్నాయి. డబ్బింగ్‌ సినిమాకు ఇంత మంచి ఆదరణ నిజంగా ఊహాతీతం. ఈ సినిమా గణ విజయం ద్వారా యష్‌ నటుడిగా ఇంకో మెట్టు పైకి ఎదిగాడు. ఇంత పెద్ద మాన్‌స్టర్‌ హిట్‌ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది'' అన్నారు.

మాటల రచయిత హనుమాన్‌ మాట్లాడుతూ - ''స్క్రిప్ట్‌ చూసి తెలుగులో కూడా విడుదల చేస్తే బాగుంటుంది అనుకున్నాను సినిమా తెలుగులో ఇంత పెద్ద హిట్‌ అవుతుంది అనుకోలేదు. ఇలాంటి సినిమాలోభాగం అయినందుకు హ్యాపీ'' అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ భువమ్‌ గౌడ మాట్లాడుతూ - ''మా సినిమా యూనిట్‌ మూడు సంవత్సరాల కష్టానికి తగిన గౌరవం దక్కింది. మా టీం అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ - ''ఈ సినిమా లో నేను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ గారికి, విజయ్‌, యష్‌కు థాంక్స్‌'' అన్నారు.

కైకాల రామారావు
మాట్లాడుతూ - ''సినిమాను ఆదరించిన ప్రతీప్రేక్షకుడికి నాహ దయపూర్వక క తజ్ఞతలు. సినిమా మంచి హిట్‌ అయినందుకు టీంకు నా అభినందనలు'' అన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved