pizza
ఇలాంటి సమయంలో రిలీజ్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనే మా భయాన్ని ప్రేక్షకులు భారీ విజయంతో పోగొట్టేశారు -లవ్ స్టొరీ మ్యాజికల్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాగ చైతన్య
Love Story movie Magical Success Meet THRILL CITY Necklace road
You are at idlebrain.com > News > Functions
Follow Us


30 September -2021
Hyderabad

నాగ చైతన్య హీరోగా,సాయి పల్లవి హీరోయిన్ గా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం "లవ్ స్టోరి" ఇటీవల విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో చిత్ర బృందం మాట్లాడుతూ...

డైరక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ " మమ్మల్ని ఆహ్వానించిన థ్రిల్ సిటీ యాజమాన్యానికి థాంక్స్. నాకు ఈ స్థలం బాగా తెలుసు, నేను ఇక్కడ దగ్గర్లోనే టెన్నిస్ ఆడే వాడిని, మా ఇంటికి చాలా దగ్గరే. నిర్మాణ సమయంలో చూసి జురాసిక్ పార్క్ నేపథ్యంలో ఏదో ప్లాన్ చేసారు అనుకున్నాను. మన సిటీ కి ఇలాంటి సక్సెస్ఫుల్ థీమ్ పార్క్స్ అవసరం. మా సినిమా టీం నుండి ప్రేక్షకులందరికి చాలా థాంక్స్. 3 ఏళ్ల నుండి కష్టపడి చేసాము, పాండమిక్ టైం లో రిలీజ్ చేయాలా లేదా అని ఆలోచిస్తూ ఓ టీ టీ వద్దు అనుకుని చివరికి థియేటర్స్ లో రిలీజ్ చేసినందుకు దానికి భారీ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో ఇంకా చాలా మూవీస్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు, థియేటర్స్ ఇంకా ఓపెన్ అయ్యి పూర్వ వైభవం రావాలి అని అనుకుంటున్నాను. మా నిర్మాతలకి చాలా పెద్ద థాంక్స్"

హీరో నాగచైతన్య మాట్లాడుతూ " అందరికీ నమస్కారం. లవ్లీ పెర్ఫార్మన్స్ ఇచ్చినందుకు థాంక్స్ సత్య మాస్టర్ & గ్రూప్. థాంక్యూ థ్రిల్ సిటీ టీం ఈ ఈవెంట్ కోసం జరిపిస్తున్నందుకు. చాలా చాలా బాగుంది, ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లవ్ స్టోరీ 24th సెప్టెంబర్ రిలీజ్ అయింది, 1st రోజు నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నిటికంటే ముందు తెలుగు ప్రేక్షకులందరికి థాంక్యూ చెప్పాలి. ఇలాంటి టైం లో సినిమా రిలీజ్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని సందేహం గా ఉండేది కానీ ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించి అవన్నీ మొదటి రోజే తుడిచేశారు. ఏ కథని నమ్మి మేము తీసామో దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ శేఖర్ కి, నిర్మాతలకి, మా మొత్తం టీం కి థాంక్స్. మా సినిమా చూసిన వారికి థాంక్యూ . చూడని వాళ్ళు థియేటర్లోనే చూడండి. థియేటర్ అనుభూతిని మిస్ అవ్వకండి, తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది" అని అన్నారు

థ్రిల్ సిటీ అధినేత తలసాని సాయి కిరణ్ మాట్లాడుతూ, "మళ్ళీ ఆడియన్స్ అందరినీ థియేటర్స్ కి తీసుకొచ్చిన లవ్ స్టోరీ టీం అందరికీ అభినందనలు. ఈ సక్సెస్ మీట్ ప్రేక్షకులతో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక ఐకానిక్ ఫ్యూచరిస్టిక్ థీమ్ పార్క్, ఇండియా లోనే మొదటిసారి మూవీ లవర్స్ కోసం ప్రపంచంలో పెద్ద డైమెన్షన్స్ థియేటర్ ఉంది. చైతన్య గారికి కార్లు ఇష్టమని మాకు తెలిసింది, మా దగ్గర వర్చువల్ కార్ రేస్ కూడా ఉంది అయన తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నా. అన్ని వయసుల వాళ్ళకి, ప్రైవేట్ మరియు గవర్నమెంటు సహకారంతో ఒక మంచి థీమ్ పార్క్ తేవటం జరిగింది. ఇది లాంచ్ అయిన 20 రోజులకే పెద్ద హిట్ అయిన లవ్ స్టోరీ మూవీ ఈవెంట్ మా దగ్గర చేసుకోడం మా థ్రిల్ సిటీ కి చాలా ప్లస్, అందుకు అందరికీ థాంక్స్. ఈ సినిమా తో పాటు మరెన్నో సక్సెస్ కాంబినేషన్స్ చై, శేఖర్ కమ్ముల మరియు నిర్మాతల కాంబినేషన్లో ఇంకా చిత్రాలు రావాలి అని కోరుకుంటున్నాను" అన్నారు.


Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved