pizza
Silly Fellows success meet
'సిల్లీఫెలోస్‌' సక్సెస్‌ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


11 September 2018
Hyderabad

అల్లరి నరేష్‌, సునీల్‌, చిత్రాశుక్లా, పూర్ణ, నందినిరాయ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'సిల్లీఫెలోస్‌'.పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భీమనేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో కిరణ్‌ రెడ్డి, భతర్‌ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్‌ 7న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగాా మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...

సునీల్‌ మాట్లాడుతూ '' ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్‌ సిల్లీ ఫెలోస్‌'గా ఆదరించి ముద్ర వేసినందుకు. ఒకసారి భోజనానికి డబ్బులు లేకపోతే ఫంక్షన్‌కి వెళితే ఫుల్‌మీల్స్‌ దొరికింది. ఈ సక్సెస్‌ నాకు అదే విధంగా ఉంది. ముందుగా నేను నరేష్‌కి థ్యాంక్స్‌ చెప్పాలి. నేను డైలాగ్స్‌ చెప్పేటప్పుడు నాకు హెల్ప్‌ చేశారు. భీమనేని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన సెట్‌లో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి స్క్రిప్ట్‌ గురించి వివరించి మరీ బాగా చెప్పారు. ఓపిక చాలా ఎక్కువ. హీరోయిన్స్‌ కూడా చాలా బాగా నటించారు. గౌతంరాజుగారు చాలా జాగ్రత్తగా చాల బాగా ఎడిట్‌ చేశారు. అందరికి నా క తజ్ఞతలు'' అన్నారు.

నిర్మాత కిరణ్‌ రెడ్డి మాట్లాడుతూ ''గతంలో మేము ఎంఎల్‌ఎ, నేనేరాజు నేనే మంత్రి వంటి చిత్రాలను నిర్మించాం. ఒకసారి నన్ను ఇంటర్యూలో ఒకరు అడిగారు అన్నీ పాలిటిక్స్‌కి సంబంధించిన చిత్రాలే నిర్మిస్తారా? అలా ఏమీ లేదు అని అన్నా దాంతో భీమనేనిగారు మా దగ్గరకు ఈ స్క్రిప్ట్‌తో వచ్చారు 'సిల్లీఫెలోస్‌' ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ సో కథ నచ్చి చేశాం. ఈ చిత్రంతో డిఫరెంట్‌ జోనర్‌ మూవీస్‌ని కూడా నిర్మించగలం అని కామెడీ ట్రాక్‌ కూడా చెయ్యగలం అని అనిపించింది. ఈ చిత్రాన్ని నిర్మంచినందుకు చాలా గర్వంగా ఉంది'' అన్నారు.

అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''మా హీరో అల్లరి నరేశ్‌, మా శ్రేయోభిలాషి సునీల్‌ కలిసి నటించిన చిత్రమిది. ఇద్దరికీ ఒకే సినిమాతో సక్సెస్‌ రావడం మరింత ఆనందంగా ఉంది'' అన్నారు.

చిత్రా శుక్లా మాట్లాడుతూ - ''మా సిల్లీఫెలోస్‌' సినిమాను సక్సెస్‌ చేసిన అభిమానులకు థాంక్స్‌. మా టీంకు కంగ్రాట్స్‌. దర్శకుడు భీమనేని, నిర్మాతలు భరత్‌ చౌదరి, కిరణ్‌ రెడ్డి, విశ్వప్రసాద్‌లకు థాంక్స్‌. అల్లరి నరేశ్‌గారు, సునీల్‌గారు, పోసానిగారు, జయప్రకాశ్‌గారు...ఇలా అందరి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను'' అన్నారు.

భీమనేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా రూపకల్పనకు ముఖ్యకారణం వివేక్‌గారు. ఆయనకున్న ఓపికను చూసి ఆశ్చర్యపోయాను. ఆయన నా మిత్రుడు కావడం సంతోషంగా ఉంది. ఆయన వల్లనే నిర్మాతలు పరిచయమైయారు. ప్లానింగ్‌తో, ప్రొఫెషనల్‌గా సినిమాను పూర్తి చేయడంలో ఎంతో సహకారం అందించారు. వీరే మెయిన్‌ పిల్లర్స్‌గా నిలిచారు. వారి వల్లే సినిమా గెలిచింది'' అన్నారు.

అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ - ''తమిళ సినిమా చూసిన తర్వాత ఐదారుగురు నిర్మాతలు ఈ సినిమా చేద్దామని అన్నారు. నేను కూడా సినిమా చూసిన తర్వాత మాకు నచ్చింది. కితకితలు, బెండు అప్పారావు ఎంత ఎంజాయ్‌ చేసినా.. పిల్లల్ని కూడా నవ్వించాలనేదే నా టార్గెట్‌. ఈ సినిమాలను అందరితో పాటు పిల్లలు కూడా బాగా ఎంజాయ్‌ చేశారు. చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్‌తో హ్యాపీగా ఉన్నాను. నేను, సునీల్‌ ఇద్దరం మాట్లాడుకుని ప్రేక్షకులను నవ్వించాలనే ప్రయత్నించాం. మా ప్రయత్నం సక్సెస్‌ అయ్యింది. భీమనేనిగారికి, వివేక్‌, విశ్వప్రసాద్‌, కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరిగారికి థాంక్స్‌'' అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అనిల్‌ సుంకర్‌, పోకూరిబాబురావు, ప్రొడ్యూసర్‌ గోపి తదితరులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved