pizza
S/o Satyamurthy success celebrations at Vizag
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 April 2015
Hyderabad

వ‌రుణుడు ఆశిస్సుల‌తో అభిమానుల స‌మ‌క్షంలో s/o సత్యమూర్తి థాంక్స్ మీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన చిత్రం 's/o స‌త్య‌మూర్తి' విడుద‌లై రికార్డు క‌లెక్ష‌న్ల దిశ‌గా వెలుతున్న సంధ‌ర్బంలో ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అందించిన మెగా అభిమానుల‌కి, తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌న్య‌వాదాలు తెలుపుదామ‌ని ఈనెల 23న వైజాగ్ లో సెల‌బ్రెష‌న్స్ ఏ సూప‌ర్‌హిట్ అంటూ ఫంక్ష‌న్ చేశారు. ఈ ఫంక్ష‌న్ స్టార్ట‌వుతున్న ద‌గ్గ‌ర‌నుండి వ‌రుణుడు చిరుజ‌ల్లులు కురిపిస్తునే వున్నాడు. ఫంక్ష‌న్ ప్రారంభానికి వాన పెరిగినా ఏ ఒక్క అభిమాని, మ‌హిళా ప్రేక్ష‌కుల సైతం క‌ద‌ల‌కుండా వుండ‌టమే కాకుండా మెగాఫ్యామిలి సాంగ్స్ కి వాన‌లో త‌డుస్తూనే డాన్స్ లు చేయ‌టం ఈ సినిమా ఏ రేంజి సక్స‌స్ అనేది తెలియ‌జేసింది. ఇంత‌టి విలువ‌లున్న చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ భారీ స్థాయిలో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఈ ఫంక్ష‌న్ కి స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, ద‌ర్శ‌క‌డు త్రివిక్ర‌మ్ లు హ‌జ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఆనందంలో మాట్లాడుతూ " ముందుగా వైజాగ్ అభిమానుల‌కి, తెలుగు ప్రేక్ష‌కుల‌కి నా ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు, ఇంత‌లా వ‌ర్షం ప‌డుతున్నా కూడా ఏ మాత్రం తొణ‌కకుండా ఎక్క‌డి వారు అక్క‌డే మా కోసం వెయిట్ చేస్తున్న మీ అభిమానాన్ని ఎన్న‌టికి మ‌ర‌వ‌ను, త్రివిక్ర‌మ్ గారు అత్తారింటికి దారేది లాంటి చిత్రం త‌రువాత వ‌చ్చి వెంట‌నే చిత్రం చేయ్యోచ్చు. కాని ఆయ‌న నా ద‌గ్గ‌రకి వ‌చ్చి నా ద‌గ్గ‌ర రెండు స్టోరిలున్నాయి. ఒక‌టి ఈజి గా వుంటుంది, రెండ‌వ‌ది చేసే ట‌ప్పుడు, రిలిజ‌య్యాక కొన్ని ఇబ్బందులు ప‌డాలి కాని చిర‌కాలం నిలిచిపోయె క‌థ అన్నారు. ఫైన‌ల్ గా రెండ‌వ దాన్ని ఎంచుకున్నాం, అదే s/o సత్యమూర్తి ఈ చిత్రం ఎవ‌రేజ్ టాక్ వ‌చ్చింది కాని క‌లెక్ష‌న్లు రికార్డు స్థాయిలో వ‌చ్చాయి. ఈ చిత్రాన్ని మైండ్ తో కాదు హ‌ర్టు తో చూడాలి, అలా చూసిన మీ అంద‌రికి ఈ చిత్రం న‌చ్చింది. అంతే కాదు త్రివిక్ర‌మ్ గారి మాటలు, నా స్నేహితుడు ఇచ్చిన ఆడియో ఇలా ఈ చిత్రానికి ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క టెక్నిషియ‌న్ కి కూడా నేను మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు మాత్రం ఇక్క‌డ‌కి వ‌చ్చిన వారంద‌రికి నా ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు" అని అన్నారు

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ "'s/o సత్యమూర్తి' చిత్రం విలువ‌ల కోసం తీసిన చ‌క్క‌టి చిత్రం. మా న‌మ్మ‌కాన్ని మీరు నిజం చేశారు. బ‌న్ని చాలా బాగా న‌టించి మెప్పించాడు. ఈ చిత్రానికి ప‌నిచేసిన ప్ర‌తిఒక్క‌రికి నా ధ‌న్య‌వాదాలు. మా నిర్మాత రాధాకృష్ణ గారికి ఈ చిత్రం ఆనందాన్ని తెచ్చిపెట్టింది. అలాగే దేవి అందించిన ఆడియో చాలా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ వ‌ర్షంలో మా కోసం ఇలా వెయిట్ చేసినందుకు ప్ర‌తి ఒక్క‌రిని నా ద‌న్య‌వాదాలు " అని అన్నారు

నటీనటులు
అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు

సాంకేతిక వర్గం
పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను
ఆర్ట్ - రవీందర్
కెమెరా - ప్రసాద్ మూరెళ్ల
మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్
నిర్మాత - రాధాకృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved