pizza
Sulthan success meet
సుల్తాన్ సినిమాని ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తున్నారు - హీరో కార్తి.
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 April -2021
Hyderabad

హీరో కార్తి న‌టించిన‌ లేటెస్ట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్‌ ‘సుల్తాన్’‌. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శకుడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు నిర్మించారు. ఈ మూవీని తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ ద్వారా వ‌రంగ‌ల్ శ్రీ‌ను ఏప్రిల్‌2న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్ష‌న్స్ సాధిస్తోంది. ఈ సంద‌ర్భంగా హైదారాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో..

మాట‌ల ర‌చ‌యిత రాకేందు మౌళి మాట్లాడుతూ - ``సుల్తాన్ మూవీని ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. నేను రిలీజైన‌ప్ప‌టి నుండి ప‌బ్లిక్ టాక్ ఫాలో అవుతున్నాను. మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. హైద‌రాబాద్ బిర్యాణిలా ఈ సినిమాలో కూడా అన్ని లేయ‌ర్స్ ఉన్నాయి. ప‌క్కా మాస్ మసాలా సినిమా. పాట‌లు కూడా క‌థ‌ని ముందుకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ సినిమాకి ఎక్కువ క‌నెక్ట్ అవుతున్నారు`` అన్నారు.

ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌చేసిన వ‌రంగ‌ల్ శ్రీ‌ను మాట్లాడుతూ - ``ఈ సినిమా వెన‌క ఎస్ ఆర్ ప్ర‌భుగారు, భాగ్య‌రాజ్, కార్తి ముగ్గురు సుల్తాన్‌లు ఉన్నారు. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, రొమాన్స్‌, ల‌వ్‌, కామెడీ, యాక్ష‌న్ ఇలా అన్ని అంశాలు మిళిత‌మై ఉన్నాయి. క్రాక్ త‌ర్వాత నేను థ‌రోగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. ముఖ్యంగా ఇంట‌ర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్ ఉంది. గూజ్‌బ‌మ్స్ వ‌చ్చాయి. భాగ్య‌రాజ్ టేకింగ్ అద్భుతంగా అనిపించింది. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉంది. మాస్ ఉంది. కార్తి అన్న‌య్య న‌ట‌న ఎక్స్‌లెంట్‌. యువ‌న్ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యూత్‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి కార్తి‌, ర‌ష్మిక గారి కెమిస్ట్రి బాగా న‌చ్చింది. మంచి సినిమా అంద‌రూ థియేట‌ర్స్‌లోనే చూడండి`` అన్నారు.

నిర్మాత ఎస్ ఆర్ ప్ర‌భు మాట్లాడుతూ - ``ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్న‌ప్ప‌డు ఒక మంచి డిస్ట్రిబ్యూట‌ర్ అయితే బాగుంటుంది అని వ‌రంగ‌ల్ శ్రీ‌ను గారికి ఇవ్వ‌డం జ‌రిగింది. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ అన్ని మంచి సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. సుల్తాన్ సినిమా చాలా గుడ్ రిలీజ్‌. మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ మూవీలో పార్ట్ అయిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. మంచి రివ్యూస్ ఇచ్చి మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేసిన మీడియా వారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు భాగ్య‌రాజ్ క‌ణ్ణ‌న్ మాట్లాడుతూ - ``ఈ క‌రోనా ప‌రిస్థితుల్లో కూడా మా సుల్తాన్ సినిమాని ఆద‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి థ్యాంక్స్‌. నా క‌థ మీద న‌మ్మ‌కంతో ఈ అవ‌కాశం ఇచ్చిన ప్ర‌భుగారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. త‌మిళ్‌లో, తెలుగులో సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తోంది. అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి. నాకు స‌పోర్ట్ చేసిన కార్తిగారికి, ర‌ష్మిక గారికి ధ‌న్య‌వాదాలు. తెలుగులో రాకేందు మౌళి డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది‌`` అన్నారు.

హీరో కార్తి మాట్లాడుతూ - ``ముందుగా వెల్డ్‌డాగ్ స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా మా అన్న‌య్య నాగార్జున‌స‌ర్‌కి బిగ్ కంగ్రాచ్యులేష‌న్స్‌. కొత్త కంటెంట్‌ని తీసుకురావ‌డానికి ఒక బోల్డ్ అటెంప్ట్ చేశారు. మంచి కంటెంట్ తీసుకువ‌స్తే ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా ఆదరిస్తారు అని ప్రూవ్ చేశారు. సుల్తాన్ మూవీని ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆడ‌వాళ్ల‌కి ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా న‌చ్చాయి. ఈ సినిమా తీసిందే చిన్న‌పిల్ల‌ల నుండి పెద్ద‌వారిదాకా అంద‌రూ ఎంజాయ్ చేయాల‌ని. అది నిజ‌మైంది. ద‌ర్శ‌కుడు భాగ్య‌రాజ్ మంచి కాన్సెప్ట్‌తో వంద‌మంది అన్న‌య్య‌ల మ‌ధ్య నేను ఉంటే ఎలా ఉంటుంది అని చూపించారు. అన్ని అంశాల్నిసృషిస్తూ ఒక కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని తెర‌కెక్కించారు. యువ‌న్ శంక‌ర్ రాజా త‌న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని మ‌రింత ఎలివేట్ చేశాడు. సాంగ్స్ చాలా బాగా కుదిరాయి. అంద‌రూ ఇంట‌ర్వె‌ల్ బ్లాక్ మ‌రియు క్లైమాక్స్ ఫైట్స్ గురించే మాట్లాడుతున్నారు. అలాగే నైట్ ఫైట్ థియేట‌ర్‌లో చూస్తున్న‌ప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు రాస్తున్న‌ప్పుడు ఎప్పుడు న‌న్ను ఒక లీడ‌ర్‌గా చూడ‌లేదు.. ఒక త‌మ్ముడిగా ఏం చేయాలో అది మాత్ర‌మే చేపించాడు. ఈ సినిమాలో ఎక్క‌డ కూడా వ‌ల్గారిటీ లేదు. అందుకే ల‌వ్ స్టోరీకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అలాగే 100మంది రౌడీల‌ను మార్చ‌డ‌మే ఈ సినిమా..వారిని మార్చే క్ర‌మంలో.. వ్య‌వ‌సాయం చేస్తే మీరు ఎవ్వ‌రి ద‌గ్గ‌ర ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేదు.. అని ఒక బ్యూటిఫుల్ ఆల్ట‌ర్‌నేట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు భాగ్య‌రాజ్‌. ఆ పాయింట్ ఎమోష‌న‌ల్‌గా కూడా బాగా క‌నెక్ట్ అయ్యింది. ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వ‌రంగ‌ల్ శ్రీ‌ను ఒక సినిమాని కేవ‌లం బిజినెస్ ప‌రంగానే కాకుండా ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యి చూస్తాడు. మంచి స‌క్సెస్ వ‌స్తున్నందుకు కంగ్రాచ్యులేష‌న్స్ శ్రీ‌ను.. తెలుగులో నా కెరీర్‌లో సుల్తాన్ సినిమాకి బిగ్గెస్ట్ ఓపెనింగ్ వ‌చ్చింది. అన్న‌య్య వదిన సినిమా చూసి.. అంత మందిని ఎలా మేనేజ్ చేశారు అని అడిగారు..మంచి థియేట‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ ఈ సినిమాలో ఉంది. థియేట‌ర్‌లో సినిమా చూడండి త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.

Photo Gallery
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved