pizza
Supreme Grand success meet
సుప్రీమ్ సక్సెస్ మీట్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

08 May 2016
Hyderabad

సాయిధరమ్ తేజ్ హీరోగారాశీఖన్నా హీరోయిన్ గాఅనిల్ రావిపూడి దర్శకత్వం లో శిరీష్ నిర్మించిన చిత్రం 'సుప్రీమ్'. మే 5న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మే 8న హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని  శ్రీనివాస యాదవ్దిల్ రాజుసాయిధరమ్ తేజ్రాజేంద్రప్రసాద్సాయికుమార్రాశిఖన్నావెన్నెలకిషోర్పృథ్వీప్రభాస్ శ్రీనుమ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరాం తదితరులు హజరయ్యారు.

తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ‘’సుప్రీమ్ సినిమాను నేను చూశాను. చాలా బాగా నచ్చింది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకలు సినిమాను పెద్ద సక్సెస్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఫిజికల్లీ చాలెంజ్ పర్సన్ చేసిన ఫైట్ చాలా బావుంది. సాయిధరమ్ నటన చాలా బావుంది. తనకు మంచి భవిష్యత్ ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంది. తెలుగు చిత్రసీమకు మంచి రోజులు వచ్చాయనడానికి మొన్న సరైనోడు హిట్ అయ్యింది. అలాగే ఇప్పుడు సుప్రీమ్ హిట్ అయ్యింది. బ్రహ్మోత్సవం ఆడియో కూడా చాలా బావుంది. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సక్సెస్ భాగమైన సాయిధరమ్ తేజ్రాశిఖన్నాతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడినిర్మాత శిరీష్దిల్ రాజు సహా యూనిట్ సభ్యులందరికీ కంగ్రాట్స్’’ అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ ‘’సుప్రీమ్ సక్సెస్ లో సాయిధరమ్ తేజ్అనిల్ ముఖ్య కారణమైనప్పటికీ వారితో పాటు మికెల్ గాంధీ నటనక్లైమాక్స్ ఫిజికల్ చాలెంజ్ వ్యక్తులు చేసిన ఫైట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి వారితో పాటు రాజేంద్రప్రసాద్సాయికుమార్ సహా ప్రభాస్ శ్రీనుపృథ్వీపోసానిశ్రీనివాస్ రెడ్డిరాశిఖన్నా అందరి సపోర్ట్ తోనే సినిమా బాగా వచ్చింది. చివర్లో వచ్చే ఫిజికల్లీ చాలెంజ్డ్ వక్తులు ఫైట్ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. అనిల్ రావిపూడి ఇలాంటి సన్నివేశంతో ఓ మెసేజ్ ను కూడా ఇచ్చాడు. సక్సెస్ కు కారణమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

 

Rashi Khanna Glam gallery from the event

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘’మెగాభిమానుల సపోర్ట్ తోనే సుప్రీమ్ పెద్ద హిట్టయ్యింది. దిల్ రాజుశిరీష్లక్ష్మణ్ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. సబ్జెక్ట్ ను నమ్మి సినిమాను ప్రొడ్యూస్ చేశారు. బాలు అనే అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన అనిల్ గారికి థాంక్స్. ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ వల్లే చాలా బాగా చేయగలిగాను. నాకురాజేంద్రప్రసాద్ గారికి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్నాకుమికెల్ కు మధ్య వచ్చే సీన్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే వెన్నెలకిషోర్రాశిఖన్నాల మధ్య మంచి కెమిస్ట్రీ కుదరడంతో వారి మధ్య కామడి బాగా వచ్చింది’’ అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో వర్క్ చేసిన అందరూ ప్రేమతో చేయడం వల్లనే ఇంత పెద్ద సక్సెస్ వీలైంది. ఈ సినిమాను రామాయణం నుండి ఇన్ స్పిరేషన్ గా తీసుకుని చేశాం. రాముడు మికెల్ అయితేహనుమగా సాయిధరమ్ తేజ్ నటించాడు. మిగిలిన నటీనటులందరూ వానరసైన్యంలా సపోర్ట్ చేశారు. ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్ తో ఫైట్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు ఎంతో ఎమోషన్ ఫీలయ్యాను. అలాగే ఎగ్జయిట్ మెంట్ తో సినిమా చేశాను. రాజేంద్రప్రసాద్ గారు నాకేంతో ఇష్టమైన హీరో. జంధ్యాలరాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూడకుండా ఉండుంటే నేను నా సినిమాల్లో ఇంత మంచి కామెడిని చేసే చేయగలిగేవాడిని కాను. అలాగే నా వెల్ విషర్ సాయికుమార్ గారు అద్భుతంగా నటించారు. రాశిఖన్నా బెల్లం శ్రీదేవి పాత్రకు ప్రాణం పోసింది. రవికిషన్ గారు ఎంతో కమిట్ మెంట్ తో యాక్సిడెంట్ అయినా ఈ సినిమా చేశారు. సాయిధరమ్ తేజ్ డ్యాన్సులుఫైట్స్పెర్ ఫార్మెన్స్ పరంగా నెక్ట్స్ లెవల్ కు వెళ్లాడని అంటున్నాడు. ఈ సమ్మర్ లో కూల్ ఎంటర్ టైనర్’’ అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువ భాగం అనిల్ రావిపూడికే దక్కుతుంది. సీన్ పేపర్ లేకుండా నాతో యాక్ట్ చేయించకున్నారు. తేజ్ లో యంగ్ చిరంజీవిని చూశాను. ఆయన్ను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని సాయిఎదగాలి. శిరీష్ సినిమాను చక్కగా నిర్మించాడు. అందరికీ అభినందనలు’’ అన్నారు.

సాయికుమార్ మాట్లాడుతూ ‘’ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. టీం వర్క్ తోనే ఈ సక్సెస్ సాధ్యమైంది. మికెల్ సాయిధరమ్రాశిఖన్నావెన్నెల కిషోర్ సహా అందరూ చక్కగా నటించారు’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫిజికల్లీ చాలెంజ్డ్ ఫైట్ లో నటించిన ఆనంద్ అండ్ టీంను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సత్కరించారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved