13 February 2020
Hyderabad
దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్.. వైవిధ్యమైన కథా చిత్రాలకు అండగా నిలబడుతూ ఇండియన్ సినిమాను భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది. రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో నటిస్తోన్న `అరణ్య`ను ఈరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సహా హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాండన్’ పేర్లతో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేస్తుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా...
చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ - ``ఈ సినిమా రూపొందడానికి ముఖ్యకారణమైన వారిలో సురేష్‌బాబుగారు మొదటి వ్యక్తి. ఆయన్ని కలవడానికి వెళుతున్నానని చెప్పగానే అందరూ ఆయనకు కథ చెప్పి ఒప్పించడం చాలా కష్టమైన పని అంటూ భయపెట్టారు. ఎందుకంటే పూర్తి వేరే ఫ్లాట్‌ఫామ్‌లో చేసే సినిమా కావడంతో ఏమంటారోనని అనుకున్నాను. అలాగే నేను ఎప్పుడూ కథను నెరేట్ చేయను. కానీ సురేష్‌బాబుగారికేమో కథను నెరేట్ చేయాలని అన్నారు. నేను ఆయన్ని కలిసి 20 నిమిషాల పాటు మాట్లాడాను. సినిమాలో స్టార్టింగ్ సీన్, క్లైమాక్స్ చెప్పాను. మరసటి రోజు మరోసారి కలిసి మాట్లాడిన తర్వాత సినిమా ట్రాక్ ఎక్కేసింది. అలాగే తర్వాత రానాగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏనుగులతో ఒక లాంగ్వేజ్‌లోనే సినిమా చేయడం చాలా కష్టమైన పని. కానీ మూడు లాంగ్వేజెస్‌లో ముప్పై ఏనుగులతో సినిమా చేయడమంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఎంత కష్టమైన పనిని రానాగారు చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా కోసం తనని తాను అరణ్యగా మార్చుకున్నారు. తర్వాత విష్ణు విశాల్‌గారికి థ్యాంక్స్ సినిమాలో నటించడానికి ముందు ఏనుగును కడటంతో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి ట్రైనింగ్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. ఇదొక ఐకాన్ మూవీ అని చెప్పగలను. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఏనుగుల్లో లీడర్ ఏనుగు కోసం ఆడిషన్ కూడా చేశామంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ షూటింగ్ చేసి ఒళ్లు నొప్పులు వచ్చేసేవి.. కానీ మరుసటి రోజు కొత్తగా వచ్చి షూటింగ్ చేయడానికి రెడీ అయ్యాం. ప్రతి యూనిట్ సినిమా కోసం త్యాగం చేసింది. ఇలాంటి సినిమా కోసం మాతో పాటు ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
ఈరోస్ ఇంటర్నేషనల్ సీఎంఓ మానవ్ సేతీ మాట్లాడుతూ - ``రానా దగ్గుబాటి, ప్రభుసాల్మన్, విష్ణు విశాల్ ఇలా ఎంటైర్ టీమ్ ఎంతో ప్యాషన్‌తో టాలెంట్, ఓపికతో తెరకెక్కించిన సినిమా అరణ్య. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది`` అన్నారు.
ఈరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ నందు అహుజా మాట్లాడుతూ - ``ఇలాంటి సినిమా కోసం డైరెక్టర్ ప్రభు సాల్మన్ ఎంతగానో కష్టపడ్డారు. ఆయనతో పాటు రానా, విష్ణు, పుల్కిత్ సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు`` అన్నారు.
విష్ణు విశాల్ మాట్లాడుతూ - ``తెలుగులో నేను నటించిన తొలి చిత్రమిది. చాలా ఛాలెంజింగ్ రోల్‌లో నటించాను. గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ప్రభు సాల్మన్, రానాగారికి థాంక్స్. సినిమాలో బ్రిలియంట్ క్యారెక్టర్ చేశాం. ప్రభుగారు గ్రేట్ విజన్‌తో సినిమాను తెకెక్కించారు. అస్సాంలో జరిగిన నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. నా పాత్ర ప్రథమార్థంలో ఉండేదానికి, ద్వితీయార్థంలో ఉన్న పాత్రకు చాలా మార్పు ఉంటుంది. ఇంత లార్జ్ స్కేల్‌లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది`` అన్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు మాట్లాడుతూ - ``ప్రభు తెరకెక్కించిన మైనా, కుంకి సినిమాలు చూశాను. ఆ రెండు సినిమాలు బాగా నచ్చాయి. ప్రభు నన్ను కలవడానికి వచ్చి నెరేట్ చేసినప్పుడు నాకు అవుట్ స్టాండింగ్‌గా అనిపించింది. ప్రభుగారి ఇమేజినేషన్, క్రియేటివిటీ నాకు బాగా నచ్చింది. ఓ వ్యక్తిగా ప్రకృతిని కాపాడుకోవాలనే తన తత్వం అభినందనీయం. ఎంటైర్ యూనిట్ ఎంతో ఓపిక, ప్రేమతో సినిమా చేశాడు. మన కష్టం ఎప్పటికీ వృథా కాదు. ఇప్పటి సోసైటీకి ఎంతో అవసరమైన చిత్రం. మనం నేచర్‌ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని కూడా ఈ సినిమాతో తెలుస్తుంది. మన కమర్షియల్ పంథాలో సినిమాను ప్రభు అండ్ టీమ్ చక్కగా తెరకెక్కించారు`` అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ - ``రెండున్నరేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అస్సాంలోని నిజ ఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమిది. పద్మశ్రీ అవార్డ్ పొందిన ఈయన 1300 ఎకరాల అడవిని నాటాడు. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఆయన చేసిన పని వల్ల భూమి నది కోత నుండి పరిరక్షింపబడింది. జంతువులు ఉండే ప్రాంతాలను, ప్రకృతిని మనం మార్చాలని అనుకున్నప్పుడు వాటికేం ప్రమాదం ఉండదు. నేను పదేళ్లకు పైగా సినిమాల్లో నటించాను. సినిమాల్లో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ అరణ్య సినిమా చేయడం వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. ప్రభుగారితో సినిమా చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. కథ విని నేను క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడానికి నాకు అరు నెలల సమయం పట్టింది. థాయ్‌లాండ్ షెడ్యూల్‌కి వెళ్లినప్పుడు నాకు అరణ్య పాత్రేంటో తెలిసింది. చాలా రోజుల పాటు నాకు కో యాక్టర్ లేకుండా నటించాల్సి వచ్చింది. మొబైల్స్ కూడా లేదు. దీంతో నేనెవరు? నేనెంటి? అనే విషయాలు తెలుసుకున్నాను. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభు సాల్మన్‌గారికి రుణపడి ఉంటాను. మూడు లాంగ్వేజెస్‌లో సినిమా చేయడం ఎంతో కష్టం. తెలుగు, తమిళంలో సులభంగానే చేశాను. కానీ.. హిందీలో చేయడానికి చాలా కష్టపడ్డాను. ప్రభుగారి టేకింగ్ వేరే రిథమ్‌లో ఉంటుంది. మనకు ఇచ్చిన డైలాగ్ పేపర్‌కి, సెట్స్‌కి వెళ్లేటప్పటికీ ఎంతో మార్పు ఉంటుంది. చాలా డీటెయిల్డ్‌గా తెరకెక్కించారు. వ్యక్తిగా, నటుడిగా చాలా విషయాలను నేర్చుకున్నాను. పర్యావరణంలో మనం ఒక భాగం అని చెప్పే సినిమా ఇది. త్వరలోనే మిగతా వీడియోలు, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం`` అన్నారు.