pizza
Dwaraka song teaser launch
'ద్వారక' టీజర్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 August 2016
Hyderaba
d

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్‌ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక'. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా....

ఆర్‌.బి.చౌదరి మాట్లాడుతూ - ''మా బ్యానర్‌లో రూపొందుతోన్న 90వ చిత్రమిది. ఇప్పటి వరకు చాలా మంది నటీనటులను, టెక్నిషియన్స్‌ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాం. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నిర్మాతలు ప్రద్యుమ్న, గణేష్‌లతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు శ్రీనివాస్‌ రవీంద్రను ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నాం. ఇక హీరో విజయ్‌, హీరోయిన్‌ పూజ సహా నటీనటులు, టెక్నిషియన్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఒక సాంగ్‌ మినహా సినిమా అంతా పూర్తయ్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

లక్ష్మీభూపాల్‌ మాట్లాడుతూ - ''ఎంతో మంది కొత్త వారికి సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆర్‌.బి.చౌదరిగారి బ్యానర్‌ ద్వారా నిర్మాతలు ప్రద్యుమ్న, గణేష్‌లు పరిచయం కావడం గొప్ప విషయం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్యామ్‌.కె.నాయుడు సినిమాటోగ్రఫీ, బ్రహ్మకడలి ఆర్ట్‌ వర్క్‌, సాయికార్తీక్‌ సంగీతం ఇలా బెస్ట్‌ టెక్నిషియన్స్‌ అంతా ఈ సినిమాకు పనిచేశారు. పెళ్ళిచూపులు ద్వారా పెద్ద హిట్‌ కొట్టిన విజయ్‌ దేవరకొండను ఈ సినిమా మరో పదిమెట్లు పైకి తీసుకెళుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

సాయికార్తీక్‌ మాట్లాడుతూ - ''పెళ్ళిచూపులు కంటే విజయ్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది. డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ ఉన్న ఇలాంటి సినిమాలకు మ్యూజిక్‌ చేయడం రేర్‌గా జరుగుతుంటుంది'' అన్నారు.

 

Pooja Jhaveri Glam gallery from the event

 

నిర్మాత ప్రద్యుమ్న మాట్లాడుతూ - ''సోషల్‌ మెసేజ్‌తో కూడిన సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి సినిమాలను ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 90 సినిమాలను చేసిన చౌదరిగారితో కలిసి ఈ సినిమాను చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్స్‌ వారు సినిమా మేకింగ్‌ విషయంలో ఎంతగానో సపోర్ట్‌ చేశారు. దాని వల్ల సినిమాను ఎప్పుడు స్టార్ట్‌ చేశామో, ఎప్పుడు ముగించామో తెలియలేదు. సాయికార్తీక్‌ సూపర్బ్‌ మ్యూజిక్‌ ఇస్తే, శ్యామ్‌ గారు ప్రతి సీన్‌ను ఎంతో రిచ్‌గా చూపించారు. ఇలా బ్రహ్మకడలిగారు, లక్ష్మీ భూపాల్‌గారు, హీరో విజయ్‌, హీరోయిన్‌ పూజ సహా నటీనటులు అందరూ ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశారు. సినిమా బాగా వచ్చింది. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్‌ రవీంద్ర(ఎం.ఎస్‌.ఆర్‌) మాట్లాడుతూ - ''దర్శకుడిగా నా తొలి చిత్రమిది. 2015లో ఈ కథను ప్రద్యుమ్నకు చెప్పాను. అప్పటి నుండి ఈ సినిమా కోసం తనెంతో సపోర్టివ్‌గా నిలబడ్డాడు'' అన్నారు.

విజయ్‌ దేవర కొండ మాట్లాడుతూ - ''పెళ్ళిచూపుల కంటే ముందుగానే ఈ స్టోరీ విన్నాను. చాలా బాగా నచ్చడంతో చేయడానికి సిగ్నల్‌ ఇచ్చేశాను. ఇలాంటి కాన్సెప్ట్‌ ఉన్న సినిమాలను తీసున్న నిర్మాతలు ప్రద్యుమ్న, గణేష్‌లకు ముందుగా థాంక్స్‌. నా తొలి సినిమా అశ్వనీదత్‌గారితో చేస్తే, రెండో సినిమాను సురేష్‌బాబుగారి ప్రొడక్షన్‌లో చేశాను. ఇప్పుడు ఆర్‌.బి.చౌదరిగారి ప్రొడక్షన్‌లో చేయడం హ్యాపీగా ఉంది. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ సినిమా ఆర్‌.బి.చౌదరి, బ్రహ్మకడలి, సాయికార్తీక్‌ వంటి టాప్‌ టెక్నిషియన్స్‌ సపోర్ట్‌ఓ పెద్ద సినిమాగా మారిపోయింది. పెద్ద స్కేల్‌లోని డిఫరెంట్‌ మూవీ'' అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ పూజ, బ్రహ్మకడలి, నవీన్‌, గిరిధర్‌, పార్థసారథి తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు.

విజయ్‌ దేవరకొండ, పూజ జవేరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, మురళీ శర్మ, పృథ్వీ, రఘుబాబు, ప్రభాకర్‌, కృష్ణభగవాన్‌, షకలక శంకర్‌, ఉత్తేజ్‌, నవీన్‌, గిరిధర్‌ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్‌,చ ఫైట్స్‌: విజయ్‌, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: సాయికార్తీక్‌, నిర్మాతలు: ప్రద్యుమ్న, గణేష్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌ రవీంద్ర(ఎం.ఎస్‌.ఆర్‌).Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved