pizza
Edureetha teaser launch
ఎదురీత‌` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 March 2019
Hyderabad

శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మించిన చిత్రం 'ఎదురీత'. శ్రవణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా నటించారు. లియోనా లిషోయ్ కథానాయిక. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం ట్రైల‌ర్‌ను గురువారం హైద‌రాబాద్‌లో హీరో క‌ల్యాణ్ రామ్ విడుద‌ల చేశారు.

భ‌ద్ర‌మ్ మాట్లాడుతూ ``చేప‌లు ఎన్ని ఉన్నా పుల‌స‌కున్న స్పెషాలిటీ దేనికీ రాదు. ఏటికి ఎదురీదుతుంది పుల‌స‌. అందుకే అంత స్పెష‌ల్‌. శ్రావ‌ణ్ గారు స్క్రీన్ మీద ఎన్నో దెబ్బ‌లు తిన్నారు. క‌థాబ‌లం ఉన్న ఈ సినిమాలో ఆయ‌న న‌టించ‌డం ఆనందంగా ఉంది. ఆయ‌న గొప్ప పెర్ఫార్మ‌న్‌. ఆయ‌న చేసిన ఒక సీన్ చూశాను. బాల‌మురుగ‌న్ గారు చాలా స్ట్రాంగ్ టెక్నీషియ‌న్‌. ఒక స్టార్ డైర‌క్ట‌ర్‌ను అందించిన ఘ‌న‌త తెలుగు సినిమాకు ద‌క్కుతుంది. ఆర్టిస్టులంద‌రూ పోటాపోటీగా చేశారు`` అని అన్నారు.

కెమెరామేన్ విజ‌య్ అద్భుత‌రాజ్ మాట్లాడుతూ ``బాల‌మురుగ‌న్ చాలా బాగా స‌పోర్ట్ చేశారు. ఆయ‌న‌కు, నిర్మాత‌కు ధ‌న్య‌వాదాలు`` అని అన్నారు.

ఫైట్ మాస్ట‌ర్ రామ‌కృష్ణ మాట్లాడుతూ ``ఈ సినిమాలో హీరో క‌న్నా కేర‌క్ట‌రైజేష‌న్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సంప‌త్‌గారి పాత్ర చాలా బావుంటుంది. బాల‌మురుగ‌న్ గారికి మంచి భ‌విష్య‌త్తు ఉంది. ఫైట్స్, సీన్లు చాలా బావుంటాయి`` అని అన్నారు.

మేఘ‌న మాట్లాడుతూ ``శ్ర‌వ‌ణ్‌గారు చాలా క‌ష్ట‌ప‌డి న‌టించారు. యువ‌కుడిగా, 40 ఏళ్ల‌కు పైబ‌డిన వ్య‌క్తిగా ఆయ‌న ఈ సినిమాలో క‌నిపిస్తారు`` అని అన్నారు.

జియా శ‌ర్మ మాట్లాడుతూ ``ఎదురీత టీమ్‌కి ధ‌న్య‌వాదాలు. చాలా స‌పోర్ట్ చేశారు టీమ్‌`` అని అన్నారు.

లియోనీ లిషోయ్ మాట్లాడుతూ ``క‌ల్యాణ్‌రామ్‌గారికి ధ‌న్య‌వాదాలు. టీజ‌ర్ చూసి మైండ్ బ్లో అయింది. హార్ట్ అండ్ సోల్ ఉన్న సినిమా ఇది. బాల‌గారు చాలా మంచి డైర‌క్ట‌ర్‌. శ్ర‌వ‌ణ్ ఫిజిక‌ల్‌గా, మెంట‌ల్‌గా చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. నేను న‌టిస్తున్న తొలి తెలుగు చిత్ర‌మిది`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``క‌ల్యాణ్‌రామ్‌గారికి ధ‌న్య‌వాదాలు. మా నిర్మాత నేను అడిగిన ప్ర‌తిదీ ఇచ్చారు. సినిమా ఇంత బాగా రావ‌డానికి ఆయ‌నే కార‌ణం. హీరో న‌న్ను చాలా బాగా బిలీవ్ చేశారు`` అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ ``నా జీవిత‌మంతా మొద‌టి నుంచీ ఎదురీతే. ఇంత‌కుముందు 200 పెట్టి సినిమా చూస్తే పోతుంది అని అనుకునేవాడిని. కానీ ఈ సినిమా చేశాక టిక్కెట్టు రూ.2వేలు పెట్టినా త‌క్కువే అనిపిస్తోంది. శ్ర‌వ‌ణ్ పేరెంట్స్ మా సిద్ధిపేటే. వాళ్ల ద్వారా అత‌న్ని క‌లిశాను. అంద‌రూ ఈ సినిమాను చూసి ఆశీర్వ‌దించాలి`` అని అన్నారు.

శ్రావ‌ణ్ మాట్లాడుతూ ``15 ఏళ్లుగా నాకు స‌పోర్ట్ చేస్తున్నారు ప్రేక్ష‌కులు. క‌ల్యాణ్‌రామ్‌గారు మా టీజ‌ర్‌ను ఆవిష్క‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. ఎదురీత టైటిల్ అనుకోవ‌డానికి ముందు మా నాన్న‌గారికి చెప్పారు. ఆయ‌న విన‌గానే షాక్ అయ్యారు. 1977లో ఎన్టీఆర్‌గారు న‌టించిన ఎదురీత గురించి చెప్పారు. అప్ప‌ట్లో ఆ సినిమాకు వ‌చ్చిన క్రేజ్‌, హిట్ గురించి చెప్పారు. ఈ టైటిల్ పెట్టినందుకు త‌ప్ప‌కుండా మేం సినిమాకు న్యాయం చేస్తాం. నాకు ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌లు. ఇప్ప‌టిదాకా వాళ్ల‌కు నేను బెస్ట్ తండ్రిని అని అనుకున్నా. కానీ ఈ సినిమాలో న‌టించిన త‌ర్వాత తండ్రి అంటే కేవ‌లం ఫీజులు క‌డితే స‌రిపోద‌ని, పిల్ల‌ల‌తో స‌మ‌యాన్ని గ‌డ‌పాల‌ని తెలుసుకున్నా. ఎమోష‌న‌ల్ చిత్ర‌మిది. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని చూపిస్తుంది. కొడుకంటే పంచ‌ప్రాణాలుగా ఉన్న ఒక తండ్రి స‌డ‌న్‌గా కొడుకును మ‌ర్చిపోయే ప‌రిస్థితి వ‌స్తే ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నేది క‌థ‌.త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. న‌న్ను ప‌రిశ్ర‌మ‌కు కోడి రామ‌కృష్ణ‌గారు ప‌రిచయం చేశారు. `సై`తో రాజ‌మౌళిగారు హిట్ ఇచ్చారు. ఆయ‌న తర్వాత అంత క‌మిట్‌మెంట్ ఉన్న న‌టుడిని బాలానే చూశాను. ఈ చిత్ర నిర్మాత నాకు తండ్రిలాంటివారు. సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంత హిట్ అవుతుంద‌నే విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే , ఈ చిత్రాన్ని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఇంటికెళ్లి త‌మ పిల్ల‌ల్ని ఎత్తుకుని ముద్దుపెట్టుకుంటారు. ఈ సినిమాలో ఫైట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. నేను ఇప్ప‌టిదాకా స్క్రీన్ మీద 100 మంది హీరోల‌చేత దెబ్బ‌లు తిన్నాను. అయితే రామ‌కృష్ణ‌గారు ఫైట్లు కంపోజ్ చేసిన తీరు త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. ఆయ‌న్ని మా ద‌గ్గ‌ర‌కు పంపించిన రామ్ ల‌క్ష్మ‌ణ్‌గారికి ధ‌న్య‌వాదాలు`` అని అన్నారు.

జియా శర్మ, నోయెల్ సేన్, 30 ఇయర్స్ పృథ్వీ, 'రంగస్థలం' మహేష్, కాశి విశ్వనాథ్, ఫిష్ వెంక‌ట్‌, రవిప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్ ఆర్పుదరాజ్, రచయిత: ధనేష్ నెడుమారన్, ఎడిటర్: నగూరన్ రామచంద్రన్, పాట‌లు: డా. చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి, శ్రేష్ఠ‌, విశ్వ‌, రొనాల్డ్ రోన‌క్‌, పోస్టర్ డిజైన్: అనిల్ భాను, పీఆర్: నాయిడు - ఫణి, లైన్ ప్రొడ్యూసర్: ప్రకాష్ మనోహరన్, దర్శకుడు: బాలమురుగన్, నిర్మాత : బోగారి లక్ష్మీనారాయణ

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved