pizza
Eureka teaser released
లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'యురేక' చిత్రం టీజర్ విడుదల..!!
You are at idlebrain.com > News > Functions
Follow Us


11 May 2019
Hyderabad

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత నిర్మాత గా కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'యురేక'.. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకుడు.. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకులనుంచి రెస్పాన్స్ దక్కించుకుంది.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు..

తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.. టీజర్ ఎంతో ఇంటెన్సివ్ గా ఉంటూ సినిమా పై అంచనాలను పెంచుతుంది..

ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా ఇది.. చాలా బాగా వచ్చింది.. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది.. విడుదలైన కొద్దీ సేపట్లోనే టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఆడియన్స్ అంచనాలకు తగ్గకుండా సినిమా ఉంటుంది అన్నారు..

నిర్మాత ప్రశాంత్ తాత మాట్లాడుతూ.. యురేక సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతిఒక్కరికకీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.. డైరెక్టర్ కార్తీక్ ఆనంద్ అద్భుతంగా ఈ సినిమా ని తెరకెక్కించారు.. తప్పకుండా ప్రేక్షకులు ఆదారించి ప్రోత్సహిస్తారనీ.. ప్రతి ఒక్కరు తమ నటన తో పాత్రలకీ జీవం పోశారు.. త్వరలోనే ట్రైలర్, విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు..

కార్తీక్ ఆనంద్, మున్నా, డింపుల్ ,షాలినీ, అపూర్వ బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్ ,రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ ఆర్.కె. ,వెణుగొపాల్ రావు, కొటేష్ తదితరులు నటిస్తొన్న చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ ఆనంద్, నిర్మాత : ప్రశాంత్ తాత, సహా నిర్మాత : లలిత కుమారి బొడ్డుచర్ల , సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి, ఆర్ట్ : అవినాష్ , ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బి.ఆర్.ఎస్.టి.సాయి, సాహిత్యం : రామాంజనేయులు పి.ఆర్.ఓ : సాయి సతీష్..

Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved