pizza
Kathalo Rajakumari teaser launch
`క‌థ‌లో రాజ‌కుమారి` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

08 May 2017
Hyderabad

ఆరోహి సినిమా, ఆర‌న్ మీడియా వ‌ర్క్స్, శ్రీహాస్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై నారా రోహిత్‌, నాగ‌శౌర్య‌, నమిత ప్ర‌మోద్‌, నందిత ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం `క‌థ‌లో రాజ‌కుమారి`. మ‌హేష్ సూర‌ప‌నేని ద‌ర్శ‌క‌త్వంలో సౌంద‌ర్య నారా, ప్ర‌శాంతి, కృష్ణ విజ‌య్ నిర్మాతలుగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..

ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ - ``నారా రోహిత్ సినిమా అంటేనే ప్రేక్ష‌కులు కొత్త‌గా ఉంటాయ‌నుకుంటారు. అందుకు కార‌ణం ఆయ‌న ముందు నుండి డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్స్‌తో సినిమాలు చేయ‌డ‌మే. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే `క‌థ‌లో రాజ‌కుమారి` టైటిలే కొత్త‌గా ఉంది. సినిమా బాగా ఉంది. నేను డ‌బ్బింగ్ స‌మ‌యంలో చూశాను. క‌థ‌ను ఉహించ‌లేరు. స్క్రీన్‌ప్లే కొత్త‌గా ఉంటుంది. మ‌ల‌యాళ హీరోయిన్ చ‌క్క‌గా చేసింది. ఈ సినిమా గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

క్రాంతి మాధ‌వ్ మాట్లాడుతూ - ``రోహిత్‌గారితో నాకు ఎప్ప‌టి నుండో మంచి ప‌రిచ‌యం ఉంది. బాణం రోజుల నుండిత‌న‌తో ట్రావెల్ ఉంది. అలాగే ద‌ర్శ‌కుడు మ‌హేష్ సూర‌ప‌నేనితో కూడా మంచి ప‌రిచయం ఉంది. మంచి క్రియేటివ్ ప‌ర్స‌న్‌. ప్రేమ నాదే, ప‌గ నాదే అంటున్నారు. విజువ‌ల్స్‌, సినిమాటోగ్రాఫ‌ర్ అద్భుతంగా ఉన్నాయి. బాణం నుండి ఈ సినిమా వ‌ర‌కు నారా రోహిత్ డిఫ‌రెంట్ సినిమాలే చేశారు. ఈ జ‌న‌రేష‌న్ హీరోల్లో కొత్త ద‌ర్శ‌కుల‌నే కాదు, కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డంలో నారా రోహిత్‌గారు ముందున్నారు. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే క‌థ‌లో రాజ‌కుమారి ద‌ర్శ‌కుడు మ‌హేష్ సూర‌ప‌నేని, హీరో నారా రోహిత్‌ల‌కు మెమ‌ర‌బుల్ మూవీ అవుతుంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు మ‌హేష్ సూర‌ప‌నేని మాట్లాడుతూ - ``నిర్మాత‌లు కృష్ణ విజ‌య్‌, ప్ర‌శాంతిగారు కుటుంబ స‌భ్యుల్లా మాకెంతో స‌పోర్ట్ అందించారు. ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావుగారు మాకు స్క్రిప్ట్ విష‌యంలో ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. న‌మిత ప్ర‌సాద్ చ‌క్క‌టి పెర్‌ఫార్మ‌ర్‌గా పేరు తెచ్చుకుంటుంది. నందిత చిన్న పాత్ర‌లో న‌టించింది. రోహిత్‌గారు ఒక బ్ర‌ద‌ర్‌లా స‌హ‌కారం అందించారు. సినిమాకు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని డిస్క‌స్ చేశారు. అండ‌గా నిల‌బ‌డ్డారు. చాలా మంచి అవుట్‌పుట్స్ ఇచ్చారు. నాగ‌శౌర్య మంచి న‌టుడే కాదు, సినిమా ప‌రంగా ఎంతో స‌పోర్ట్ అందించారు. ప్యూర్ ల‌వ్‌స్టోరీ. న్యూ ఏజ్ ఎమోష‌న‌ల్ ప్రేమ‌క‌థ‌`` అన్నారు.

నాగ‌శౌర్య మాట్లాడుతూ - ``మ‌హేష్‌, రోహిత్‌గారు స్టోరీ డిస్క‌ష‌న్‌లో ఉంటే జ్యో అచ్యుతానంద త‌ర్వాత నేను, రోహిత్‌గారు క‌లిసి న‌టిస్తే బావుంటుంద‌ని నేను కూడా న‌టిస్తాన‌ని అన్నాను. నా స్వార్థం కోసం చేసిన సినిమా. త‌ప్ప‌కుండా పెద్ద‌హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. అవుట్‌పుట్ చూసి హ్యాపీగా ఫీల‌య్యాను. నేను, రోహిత్ క‌లిసి జ్యో అచ్యుతానంద చేశాం. ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. మా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తార‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

నారా రోహిత్ మాట్లాడుతూ - ``నేను డిఫ‌రెంట్స కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు చేశాను. ఈ క‌థ చెప్ప‌గానే క్యారెక్ట‌రైజేష‌న్ చాలా కొత్త‌గా అనిపించి ఎందుకు చేయ‌కూడ‌ద‌ని ట్రై చేశాను. క‌థ‌ను రాసిన విధానం కొత్త‌గా ఉంది. నేను లైన్ విన‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను. ప‌దిహేను నిమిషాల రోల్ కోసం గ‌డ్డం కూడా పెంచి న‌టించాను. న‌మిత మ‌ల‌యాళ హీరోయిన్ తెలుగులో చుట్టాల‌బ్బాయి సినిమాలో న‌టించింది. చాలా చ‌క్క‌గా న‌టించింది. నందిత అతిథి పాత్ర‌లో న‌టించింది. నాగశౌర్య అడిగి మ‌రి ఈ సినిమాలో ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టించాడు. ఇళ‌యరాజాగారు కొన్సి సాంగ్స్ కంపోజ్ చేశారు. అలాగే విశాల్ కూడా మంచి మ్యూజిక్ అందించారు. న‌రేష్ విజువ‌ల్స్ అద్భుతంగా ఉంది. మ‌హేష్ సూర‌ప‌నేని చాలా క్లారిటీతో ఉంటాడు. ఈ సినిమా నా సినిమాల్లో మెమ‌ర‌బుల్ మూవీ అవుతుంది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved