pizza

Mathu Vadalara 2 Teaser Launch
Clap Entertainment, Mythri Movie Makers, Sri Simha Koduri, Satya, Ritesh Rana’s Mathu Vadalara 2 Fun-filled Crazy Teaser Unveiled
క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ సింహ కోడూరి, సత్య, రితేష్ రానా ఫన్ ఫిల్డ్ క్రేజీ 'మత్తు వదలారా 2' లాంచ్

You are at idlebrain.com > News > Functions
Follow Us


30 August 2024
Hyderabad

A sequel to the blockbuster Mathu Vadalara, titled Mathu Vadalara 2 was announced recently with two intriguing posters. Starring Sri Simha Koduri in the lead with Satya as his sidekick, the film is being directed by Ritesh Rana, and produced by Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu under the banners of Clap Entertainment and Mythri Movie Makers. Today, the makers released the film’s teaser.

The teaser opens in Ritesh Rana’s signature style with a humorous message: "Share this video to 10 members and win 1 kg of good luck absolutely free." It features Vennela Kishore’s comedic press meet, followed by the introduction of Sri Simha and Satya as He Team Agents. However, the agents take an unexpected turn by becoming robbers. The teaser concludes in Rana’s style, featuring a TV serial episode.

As the teaser suggests, part 2 of Mathu Vadalara will be a fun-filled crazy entertainer with more twists in the narrative. Sri Simha Koduri and Satya’s characters were designed humorously. The teaser also introduced the characters of Faria Abdullah, Sunil, Ajay, Rohini, etc.

Suresh Sarangam’s cinematography stands out, while Kaala Bhairava’s captivating score enhances the film’s playful tone. Karthika Srinivas R is the editor. The production design is impressive for the movie of the genre. The teaser has certainly piqued interest in the movie.

Mathu Vadalara 2 will be released on September 13th.

Cast: Sri Simha Koduri, Satya, Faria Abdullah, Sunil, Vennela Kishore, Ajay, Rohini, Raja Chembolu, Jhansi, Srinivas Reddy, and Gundu Sudharshan.

Technical Crew:
Writer & Director: Ritesh Rana
Banners: Clap Entertainment & Mythri Movie Makers
Producers: Chiranjeevi (Cherry) & Hemalatha
Music: Kaala Bhairava
DoP: Suresh Sarangam
Co-Writer: Teja R
Asst. Writer: Sai Somayajulu
Editor: Karthika Srinivas R
Production Designer: Narni Srinivas
Action Choreography: Wingchun Anji
Lyricist: Faria Abdullah
Vfx Supervisor: Jooluri Anil Kumar
Motion Graphics/Visual Effects: ARK WRX

 

క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ సింహ కోడూరి, సత్య, రితేష్ రానా ఫన్ ఫిల్డ్ క్రేజీ 'మత్తు వదలారా 2' లాంచ్

బ్లాక్ బస్టర్ మత్తు వదలరాకు సీక్వెల్ గా 'మత్తువదలారా2' ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్ లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

"Share this video to 10 members and win 1 kg of good luck absolutely free." అంటూ రితేష్ రానా మార్క్ హ్యుమర్ తో టీజర్ ఓపెన్ అయ్యింది. వెన్నెల కిషోర్ కామెడిక్ ప్రెస్ మీట్‌ తర్వాత శ్రీ సింహ, సత్య హీ టీమ్ ఏజెంట్లుగా పరిచయం అయ్యారు. అయితే, ఏజెంట్లు దొంగలుగా మారడం ద్వారా నెరేటివ్ లో ఊహించని మలుపు వస్తోంది. టీజర్ రితిష్ రానా స్టైల్‌లో టీవీ సీరియల్ ఎపిసోడ్‌తో హిలేరియస్ గా ఎండ్ అయ్యింది.

టీజర్ సూచించినట్లుగా, మత్తు వదలారా2 కథనంలో మరిన్ని మలుపులతో క్రేజీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. శ్రీ సింహ కోడూరి, సత్య పాత్రలు హిలేరియస్ గా వున్నాయి. ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్, రోహిణి తదితరుల పాత్రల ఎంటర్ టైన్నింగ్ గా వున్నాయి.

సురేశ్ సారంగం సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది, కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హ్యుమర్ ని ఎలివేట్ చేసింది. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. టీజర్ సినిమాపై క్యురియాసిటీని మరింతగా పెంచింది.మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ సింహ కోడూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈవాళ చాలా లక్కీగా అనిపిస్తోంది. జనరల్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చేటప్పుడు సినిమా గురించి చాలా చెప్పాల్సివస్తుంది. ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా పార్ట్ 1ని ఆడియన్స్ పెద్ద హిట్ చేశారు. ఫస్ట్ పార్ట్ థియేటర్స్ లో ఎలా మిస్ అయ్యామని, థియేటర్స్ లో చూసుంటే ఎక్స్ పీరియన్స్ ఇంకా అదిరిపోయేదని కొంతమంది మెసేజులు చేశారు. వారందరి కోసం డబుల్ ది ఫన్, థ్రిల్ ఎక్స్ పీరియన్స్ వుండేలా సెకండ్ పార్ట్ చేశాం.13న థియేటర్స్ లోకి వస్తుంది. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. అందరం ఒకే ఫేజ్ లో వున్నాం,సేమ్ హ్యుమర్ తో వస్తున్నాం. ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన బెస్ట్ టీం ఇది. ఇది చాలా ఫన్ జర్నీ. మూవీ చూసినప్పుడు మీకూ అర్ధమౌతోంది. ఈ సినిమా లో ఓ పాట రాయడంతో పాటు పాడాను. అలాగే కొరియోగ్రఫీ కూడా చేశాను. త్వరలోనే పాట వస్తుంది. ఆడియన్స్ సినిమాని ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.

డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మత్తువదలరా ఫస్ట్ పార్ట్ లోనే ఒక ఐడియాని ప్లాంట్ చేసి దాని నుంచి డైరెక్ట్ సీక్వెల్ గా పార్ట్ 2 చేశాం. అందరూ మత్తువదలరా మరోసారి చూసొస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. 13న థియేటర్స్ లోకి వస్తుంది. అందరం చాలా ఇష్టంతో చేశాం. మీరంతా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను' అన్నారు.

నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. ఆల్ ది బెస్ట్ టూ మత్తు వదలారా 2 టీం. చాలా పెద్ద సినియా అవుతుందనే కాన్ఫిడెంట్ గా వున్నాం. టీజర్ చూసాక ష్యూర్ షాట్ అనిపించింది.ఆ వీక్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సినిమా ఇదే అవుతుంది. ' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ మాట్లాడుతూ.. మత్తువదలరాతో నేను, తమ్ముడు డెబ్యు చేశాం. ఆ సినిమా పని చేసినప్పుడు ఎంత ఉత్సాహంగా అనిపించిందో ఐదేళ్ళ తర్వాత ఈ సినిమాకి పని చేస్తున్నపుడు అదే ఉత్సాహం రిక్రియేట్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ ని థియేటర్స్ లో ఎంజాయ్ చేశారు. కొంతమంది ఓటీటీలో చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ని అందరూ థియేటర్స్ లోనే ఎంజాయ్ చస్తారనే నమ్మకం వుంది. అంత మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. సెప్టెంబర్ 13న థియేటర్స్ కి వచ్చేయండి. గట్టిగా సౌండ్ చేద్దాం' అన్నారు,

నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం, మత్తు వదలరా పెద్ద విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. మత్తు వదలరా 2 కోసం రితేష్ మంచి కథ రాసుకొని వచ్చారు. టీజర్ లో సినిమా, పాత్రలు ఎలా వుండబోతుందో చూపించాం. రిలీజ్ లోపల ఇంకొంత కంటెంట్ వస్తుంది. సెప్టెంబర్ 13న సినిమాని థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అన్నారు.

తారాగణం: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రితేష్ రానా
బ్యానర్లు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ) & హేమలత
సంగీతం: కాల భైరవ
డిఓపి: సురేష్ సారంగం
సహ రచయిత: తేజ ఆర్
Asst. రైటర్: సాయి సోమయాజులు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్‌చున్ అంజి
లిరిసిస్ట్: ఫరియా అబ్దుల్లా
Vfx సూపర్‌వైజర్: జూలూరి అనిల్ కుమార్
మోషన్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్: ARK WRX


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved