pizza
Nakshatram teaser launch
`న‌క్ష‌త్రం` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

07 May 2017
Hyderabad

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ ప‌తాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో..

రెజీనా మాట్లాడుతూ - ``న‌క్ష‌త్రం సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా కృష్ణ‌వంశీగారి గురించి చెప్పాలి. కృష్ణ‌వంశీగారు హీరోయిన్‌ల‌ను ఎంత బాగా చూపిస్తారో తెలుసా అని కొంత మంది నాతో అన్నారు. మ‌రి న‌న్ను ఎలా చూపిస్తారోన‌ని అనుకున్నాను. కానీ కృష్ణ‌వంశీగారి విజ‌న్‌ను అర్థం చేసుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఎంటైర్ సినిమాను చూడాల‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. నా కెరీర్‌లో బెస్ట్ మూమెంట్స్‌లో ఒక‌టిగాభావిస్తున్నాను. సాయిధ‌ర‌మ్‌, సందీప్, ప్ర‌గ్యా అంద‌రూ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది`` అన్నారు.

ప్ర‌గ్యాజైశ్వాల్ మాట్లాడుతూ - ``సినిమా విడుద‌ల కోసం మేమంత ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం. అంద‌రం ఎంతో క‌ష్ట‌పడ్డాం. లైఫ్ చేంజింగ్ మూవీలా అనిపించింది. చాలా కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాను. వ్య‌క్తిగా, న‌టిగా ఎంతో డెవ‌ల‌ప్ అయ్యానన‌నుకుంటాను. కృష్ణ‌వంశీగారికి పెద్ద థాంక్స్‌`` అన్నారు.

సందీప్ కిష‌న్ మాట్లాడుతూ - ``మా అంద‌రి ఏడాది క‌ష్ట‌మే నక్ష‌త్రం చిత్రం. నా పుట్టిన‌రోజునాడు టీజ‌ర్ విడుద‌ల కావ‌డం ఇంకా ఆన‌దంగా ఉంది. ఇది కృష్ణవంశీగారి న‌క్ష‌త్రం. సాధార‌ణంగా హీరో కావ‌డం ఒక‌టైతే కృష్ణ‌వంశీ సినిమాలో హీరో కావ‌డం ఒక‌టి. ఏడాదిపాటు క‌ష్ట‌ప‌డి చేశాను. అన్నీ ఎలిమెంట్స్ చ‌క్క‌గా కుదిరాయి. రెజీనా, సాయిధ‌ర‌మ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ చేయ‌డం ఆనందంగా ఉంది. నాతో పాటు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్కరూ ప్రాణం పెట్టి ప‌నిచేశారు`` అన్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - ``ఒక స్నేహితుడు ఫోన్ చేసి కృష్ణ‌వంశీగారి న‌క్ష‌త్రం సినిమాలో ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ ఉంది చేస్తారా అని అడిగారు. ఈ రోల్ చేయ‌డానికి నేను ఒక‌రోజు ఆలోచించాను. కృష్ణ‌వంశీగారి సినిమాలో క్యారెక్ట‌ర్ చేయ‌డం నా అదృష్టం. నేనున్న కెరీర్ ఫేజ్‌లో ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డం క‌రెక్టా కాదా అని ఆలోచించాను. ఎందుకింత ఆలోచిస్తాన‌ని కూడా ఆలోచించి వెంట‌నే కృష్ణ‌వంశీగారిని క‌లిసి సినిమా చేయ‌డానికి ఎప్పుడైనా నేను రెడీయే అన్నాను. మీరు ఎప్పుడు చెబితే అప్పుడు వ‌చ్చేస్తానని అన్నాను. ఈ సినిమాకు వైట్ పేప‌ర్‌లా వ‌చ్చి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. కృష్ణ‌వంశీగారు ఒక గురువులా మాకు కొత్త విష‌యాల‌ను నేర్పారు. ఆయ‌న స్ట‌యిల్లో రావ‌డానికి స‌గం రోజు ప‌ట్టేసేది. ఇంత త్వ‌ర‌గా కృష్ణ‌వంశీ వంటి ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయ‌డాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. తనీష్ చాలా బాగా పెర్‌ఫార్మెన్స్ చేశాడు. శ్రీకాంత్‌గారు సినిమాను చ‌క్క‌గా క్యాప్చ‌ర్ చేశారు. మంచి టీంతో పన‌చేశాను`` అన్నారు.

Glam galleries from the event

తనీష్ మాట్లాడుతూ - ``నేను సాధార‌ణంగా కృష్ణ‌వంశీగారిని క‌లిస్తుండేవాడిని. క‌లిసిన‌ప్పుడ‌ల్లా ఒక్క‌ఛాన్స్‌సార్ అంటుండేవాడిని. న‌క్ష‌త్రం క‌థ అనుకున్న‌ప్పుడు న‌న్ను పిలిచి నా రోల్ గురించి చెప్పారు. ముందు ఆలోచించాను కానీ, ఈ క్యారెక్ట‌ర్ చేయ‌కుండా మిస్ అయ్యుంటే చాలా విష‌యాలు మిస్ అయ్యుండేవాడిని. కృష్ణ‌వంశీగారు నాకు మోర‌ల్ స‌పోర్ట్ ఇచ్చారు. నెగ‌టివ్ క్యారెక్ట‌ర్ అన‌గానే చేయ‌గ‌లనా అని ఆలోచించాను. అయితే ప్ర‌తి ఒక్క‌రూ నాకు చేసిన స‌పోర్ట్‌, కాన్ఫిడెన్స్ మ‌ర‌చిపోలేను. న‌క్షత్రం ష్యూర్ హిట్ సినిమా అవుతుంది`` అన్నారు.

కృష్ణ‌వంశీ మాట్లాడుతూ - ``నిర్మాత‌లకు ముందు థాంక్స్‌. నాపై న‌మ్మ‌కంతో చేసిన సినిమా ఇది. సాయిధ‌ర‌మ్ తేజ్ నాకు ఆఫ్ స్క్రీన్‌లో ప‌దేళ్ళుగా ప‌రిచ‌యం ఉంది. సాయి క్యారెక్ట‌ర్‌ను ముందు మిడిల్ ఏజ్‌డ్ క్యారెక్ట‌ర్‌గా రాసుకున్నాను. చివ‌ర‌కు ఓ యంగ్ హీరోను తీసుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు నాకు సాయిధ‌ర‌మ్‌నే గుర్తుకువ‌చ్చాడు. నేను అనుకున్న‌స‌మయంలో ఓ రేస్‌లా త‌ను దూసుకెళ్తున్నాడు క‌దా, మ‌రి ఈ క్యారెక్ట‌ర్ చేస్తాడా అనుకుని నా ఫ్రెండ్‌తో అడిగించాను. దానికి ఆన్స‌ర్‌గా సాయి నా ఇంటికొచ్చేశాడు. రాగానే ఎప్ప‌టి నుండి రావాలో చెప్పండి నేను వ‌చ్చేస్తాన‌ని అన్నాడు. సాయి క్యారెక్ట‌ర్‌ను ముందు 20నిమిషాల‌ని అనుకున్నాం. కానీ చివ‌ర‌కు అది 40 నిమిషాలు వ‌చ్చింది. సాయి గ్రేట్ జాబ్స్ చేశాడు. సందీప్ ఏడాదిన్న‌ర క్రితం ఓ ప్రోమోలో చూసి ఈ స‌బ్జెక్ట్‌కి ఇత‌నైతే స‌రిపోతాడ‌నిపించి వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చూసి నేను అనుకున్న క్యారెక్ట‌ర్‌కు ఇత‌నైతే స‌రిపోతాడ‌నిపించి త‌న‌తో మాట్లాడి ఒప్పించాను. ఏడాది స‌మ‌యంలో త‌న‌ను బాగా టార్చ‌ర్ పెట్టేశాను. కొత్త సందీప్‌ను చూస్తారు. ర‌మ్య‌కృష్ణ సినిమాకు వ‌చ్చిన కొత్త‌ల్లో ఎలా ఉండేదో అలాంటి లుక్స్ త‌న‌లో క‌న‌ప‌డేవి. మిడిల్ క్లాస్ అమ్మాయి రోల్ కోసం త‌న‌ను సంప్ర‌దించాను. త‌నను చక్క‌గా న‌టించింది. కంచె చూసిన‌ప్పుడు ప్ర‌గ్యా చాలా సాఫ్ట్ గా అనిపించింది. ముందు వేరే వాళ్ళ‌ను అనుకున్నాం కానీ త‌న‌ను క‌లిసిన త‌ర్వాత ప్ర‌గ్యా అయితే స‌రిపోతుంద‌ని భావించే తీసుకున్నాం. కానీ త‌ను చాలా హార్డ్ వ‌ర్క్ చేసింది. చాలా ట‌ప్ యాక్ష‌న్ సీన్స్‌లో న‌టించింది. త‌నీష్‌ను నేను పార్టీస్‌లో క‌లుస్తుండేవాడిని. ఎప్పుడు నవ్వుతుంటాడు, స్మార్ట్‌గా ఉంటాడు క‌దా అని త‌న గురించి ఎప్పుడు ఆలోచించ‌లేదు. ఈ సినిమాలో దారి త‌ప్పిన ఓ యంగ్ క్యారెక్ట‌ర్ అనుకున్న‌ప్పుడు తనీష్‌ను అడిగాను. ముందు త‌ను ఒప్పుకోలేదు అయితే నేనే త‌న‌ను ఒప్పించాను. త‌ను ఎక్స‌లెంట్‌గా న‌టించాడు. ఆరు సాంగ్స్ ఉన్నాయి. అన్నీ చ‌క్క‌గా చేశాను. మ‌రో ముఖ్యపాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టించాడు. శివాజీరాజా, ర‌ఘుబాబు, టార్జాన్ అంద‌రూ ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్ అయ్యారు. కొంత మంది మ‌తాల‌ను అడ్డుపెట్టుకుని చేసే ప‌నుల‌ను ఓ యువ‌కుడు ఎలా అడ్డుకున్నాడ‌నేదే స్టోరీ`` అన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved