pizza
Operation Gold Fish teaser launch
`ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్ ` టీజ‌ర్ విడుద‌ల
You are at idlebrain.com > News > Functions
Follow Us


5 March 2019
Hyderabad

కార్తీక్ రాజు, పార్వ‌తీశం, శ‌షా చెట్రి(ఎయిర్ టెల్ మోడ‌ల్‌) , నిత్యా న‌రేశ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం `ఆప‌రేషన్ గోల్డ్ ఫిష్‌`. మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమా లో ఆది సాయికుమార్ ఎన్.ఎస్‌.జి క‌మెండో పాత్ర‌ను పోషిస్తున్నారు. వినాయ‌కుడు టాకీస్ బ్యాన‌ర్‌పై య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ల్పిత కథాంశంతో.. ` వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత` వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ యాక్ష‌న్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ` తెర‌కెక్కుతోంది. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. ఈ సినిమా టీజ‌ర్‌ను `మ‌హ‌ర్షి` సెట్‌లో సోమ‌వారం ఉద‌యం మ‌హేష్ బాబు విడుద‌ల చేసి యూనిట్‌ను అభినందించారు.

అనంత‌రం హైదరాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో..
చిత్ర ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ అడివి మాట్లాడుతూ - ``ఇది ఒక క్రాస్ జోన‌ర్ మూవీ. యాక్ష‌న్‌, రామ్‌కామ్ అంశాలుంటాయి. అలాగే కాశ్మీరి పండిట్స్ కాశ్మీర్‌లో చంపేసిన ఇష్యూని ఈ సినిమాలో ట‌చ్ చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్‌లోనే కాదు, నార్త్‌లో కూడా ఎవ‌రూ చేయ‌ని విధంగా నటీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను కూడా నిర్మాణంలో భాగ‌స్వామ్యులుగా చేశాం. సినిమాలో ఆది క‌మెండోపాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. అస‌లు ఈ క్యారెక్ట‌ర్‌ను త‌ను ఒప్పుకుంటాడా? అని అనుకున్న త‌రుణంలో ఆది ఈ పాత్ర‌ను చేయ‌డానికి ఒప్పుకున్నందుకు త‌న‌కు థాంక్స్‌. అలాగే కార్తీక్‌రాజు, పార్వ‌తీశం, నిత్యాన‌రేష్‌, శ‌షా చెట్రి, కృష్ణుడు అంద‌రూ చ‌క్క‌టి స‌పోర్ట్ అందించారు. యు అండ్ ఐ మీడియా అధినేత ప‌ద్మ‌నాభ‌రెడ్డిగారు నిర్మాణంతో మంచి స‌హ‌కారాన్ని అందించారు. ఉషాకిర‌ణ్ త‌ర‌పున ఏలూరు సురేష్‌గారు కూడా ఆర్ధికంగా స‌పోర్ట్ అందించారు. జ‌య‌పాల్ అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చాడు. శ్రీచ‌ర‌ణ్ త‌న సంగీతంతో సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాడు. గ్యారీ ఎడిటింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రామ‌కృష్ణ‌గారు ఎక్స్‌ట్రార్డిన‌రీ యాక్ష‌న్ కంపోజ్ చేశారు. ఇక అబ్బూరి ర‌విగారు మోర‌ల్‌గా మా టీంకు ఎంత‌గానో స‌పోర్ట్ చేయ‌డ‌మే కాకుండా.. ఘాజీ బాబా అనే పాత్ర‌లో కూడా న‌టించినందుకు ఆయ‌నకు థాంక్స్‌. మ‌నోజ్‌నందం డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడు, కృష్ణుడిని కొత్త‌గా చూస్తారు. ఓ టీం ఎఫ‌ర్ట్ మూవీ ఇది. త్వ‌ర‌లోనే విడుద‌లవుతుంది`` అన్నారు.

అబ్బూరి ర‌వి మాట్లాడుతూ - ``సాయికిర‌ణ్ అడివి మంచి క‌థ‌ను త‌యారు చేసుకుని ఓ రోజు రాత్రి నాకు వినిపించాడు. నేను థ్రిల్ అయ్యాను. సాధార‌ణంగా సాయికిర‌ణ్ అంటే మ‌న‌కు వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత సినిమాలే గుర్తుకు వ‌స్తాయి. ఆ సినిమాల‌కు భిన్న‌మైన సినిమా ఇది. చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటూ వెళ‌దామ‌ని నేను త‌న‌కు స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చాను. త‌ను వ‌న్ ఆర్మీలా అంద‌రినీ మోటివేట్ చేస్తూ ముందుకు న‌డిపించాడు. త‌ను డ‌బ్బులు సంపాదించుకోలేదు కానీ.. మ‌నుషుల‌ను సంపాదించుకున్నాడు. సాయికిర‌ణ్ ప‌డ్డ క‌ష్టానికి, యూనిట్ ఆయ‌నపై పెట్టుక‌న్న న‌మ్మ‌కానికి ఫ‌లితమే ఈ చిత్రం. ఈ సినిమా క‌థ‌ను తయారు చేసుకునే క్ర‌మంలో హైద‌రాబాద్‌లోని కాశ్మీరీ కుటుంబాల‌తో పాటు, ఆ అంశంపై రీసెర్చ్ చేసిన వ్య‌క్తుల‌ను చాలా మందిని క‌లిశాం. ఇక న‌ట‌న విష‌యానికి వ‌స్తే కెమెరా వెనుక క‌థ గురించి డిస్క‌స్ చేయ‌డం వేరు, కెమెరా ముందు న‌టించ‌డం వేరు. ఎలాగైతేనేం సాయికిర‌ణ్ న‌న్ను ఘాజీ బాబా పాత్ర చేయ‌డానికి ఒప్పించాడు.ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మాకు స‌పోర్ట్‌గా నిలిచిన రానాగారు, త్రివిక్ర‌మ్‌గారు, సూప‌ర్ స్టార్ మ‌హేష్ గారికి థాంక్స్‌`` అన్నారు.

ఆది సాయికుమార్ మాట్లాడుతూ - ``టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సూప‌ర్‌స్టార్ మహేష్‌గారికి థాంక్స్‌. సాయికిర‌ణ్‌గారు టైటిల్‌తో పాటు నేను ఎన్‌.ఎస్.జి క‌మెండో పాత్ర‌ను చేయాల‌ని చెప్ప‌గానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అయితే అప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన నా పాత్ర‌ల‌కు, ఈ పాత్ర‌కు సంబంధ‌మే లేదు. అంత ఇన్‌టెన్స్ ఉన్న పాత్ర‌ను నేను చేయ‌గ‌లుగుతానా? అనిపించింది. అయితే, నాన్న‌గారు క‌థ విన్నారు. ఎన్నో పోలీసు సినిమాలు, దేశ‌భ‌క్తి ఉన్న పాత్ర‌ల్లో న‌టించిన ఆయ‌న‌, `నీకు ఈ పాత్ర స‌రిపోతుంది` అని చెప్పగా ఒప్పుకున్నాను. అయితే న‌న్ను క‌మెండో లుక్‌లో చూసుకున్న త‌ర్వాత నాలో పాత్ర చేయ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం మ‌రింత పెరిగింది.నా పాత్ర పేరు అర్జున్ పండిట్‌. 1980లో కాశ్మీర్‌లో జ‌రిగిన ఓ ఇష్యూని రైజ్ చేస్తూ నిజాయ‌తీగా, జెన్యూన్‌గా చేసిన ప్ర‌య‌త్నం. జ‌య‌పాల్ సినిమాటోగ్ర‌ఫీ, శ్రీచ‌ర‌ణ్ సంగీతం, గ్యారీ ఎడిటింగ్ ..ఇలా అంద‌రం క‌లిసి చేసిన ఓ కంప్లీట్ టీం ఎఫ‌ర్ట్‌`` అన్నారు.

నిత్యా న‌రేష్ మాట్లాడుతూ - ``మా నాన్న‌గారు నేవీలో ప‌ని చేస్తారు. కాబ‌ట్టి నా హార్ట్‌కి బాగా ద‌గ్గ‌రైన సినిమా ఇది. దేశ‌భ‌క్తితో నిండి ఉంటుంది. శ్రీచ‌ర‌ణ్‌గారి ఆర్‌.ఆర్‌, జ‌య‌పాల్‌గారి విజువ‌ల్ ఫీస్ట్ సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. అంద‌రం ప్యాష‌న్‌తో చేసిన సినిమా ఇది`` అన్నారు.

కార్తీక్ రాజు మాట్లాడుతూ - ``క్రాస్ జోన‌ర్ మూవీ. ఈ సినిమా నాకు నిజంగా గోల్డ్ ఫిషే. టీం ఎఫ‌ర్ట్‌. సాయికిర‌ణ్‌గారైతే రోజులో 22 గంట‌లు సినిమా కోస‌మే ప‌నిచేశారు. చ‌ర‌ణ్ 4 పాట‌ల‌తో పాటు అద్భుత‌మైన రీరికార్డింగ్ అందించారు`` అన్నారు.

పార్వ‌తీశం మాట్లాడుతూ - ``సాయికిర‌ణ్‌గారు కేరింత‌లో నాకు మంచి రోల్ ఇచ్చారు. ఈసినిమాలో మంచి పాత్రే ఇచ్చారు. సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడ‌లేను. త్వ‌ర‌లోనే థియేట‌ర్స్‌లో క‌లుసుకుంటాం`` అన్నారు.

ప‌ద్మ‌నాభ రెడ్డి మాట్లాడుతూ - ``సినిమా ప్రొడ్యూస‌ర్ కూడా ఓ సాంకేతిక నిపుణుడే అని న‌న్ను కూడా మేకింగ్‌లో ఇన్‌వాల్వ్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రం క‌ష్ట‌ప‌డ్డాం. సినిమా అద్భుతంగా ఉంటుంది`` అన్నారు.

ఏలూరు సురేష్ మాట్లాడుతూ - ``ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్‌`` అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల మాట్లాడుతూ - ``క్ష‌ణం, గ‌రుడ‌వేగ‌, గూఢ‌చారి చిత్రాల త‌ర్వాత చేస్తున్న సినిమా. నాలుగు పాట‌లుంటాయి. మంచి ఇన్‌టెన్స్‌, ఎమోష‌న్స్ ఉన్న సినిమా`` అన్నారు.

బ్యాన‌ర్‌: వినాయ‌కుడు టాకీస్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: కీర్తి
ఫైట్స్‌: రామ‌కృష్ణ‌, సుబ్బు-న‌భా
సాహిత్యం: రామ‌జోగ‌య్య‌శాస్త్రి
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌
సినిమాటోగ్ర‌ఫీ: జ‌యపాల్ రెడ్డి నిమ్మ‌ల‌
స్క్రిప్ట్ డిజైన్‌: అబ్బూరి ర‌వి
పి.ఆర్.ఓ: నాయుడు - ఫణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిర‌ణ్ రెడ్డి తుమ్మ‌
కో ప్రొడ్యూస‌ర్‌: దామోద‌ర్ యాద‌వ్‌(వైజాగ్‌)
నిర్మాత‌లు: ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గ్యారీ బి.హెచ్‌.జి, సతీష్ డేగల మిత‌గా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు
ద‌ర్శ‌క‌త్వం: సాయికిర‌ణ్ అడివి

 

Photo Gallery (photos by G Narasaiah)

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved