pizza
Prementha Panichese Narayana trailer launch
`ప్రేమెంత పని చేసె నారాయణ` ట్రైలర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us


16 June 2018
Hyderabad

జె. ఎస్. ఆర్. మూవీస్ పతాకం పై, శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షత హీరో హీరోయిన్ గా జొన్నలగడ్డ శ్రీనివాస రావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న చిత్రం ప్రేమెంత పని చేసె నారాయణ. ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్ ను ఈ రోజు హైదరాబాద్ లో ని ప్రసాద్ ల్యాబ్ లో సినిమా ప్రముఖుల చేతులమీదుగా పాత్రికేయుల సమక్షంలో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హీరో శ్రీకాంత్, తమ్మారెడ్డి భరద్వాజ్, పరచూరి వెంకటేశ్వర రావు, ఓ కళ్యాణ్, డాలీ మరియు ఇతర ప్రముఖులు పాల్గున్నారు.

అనంతరం పాత్రికేయుల సమావేశం లో పరచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ "మాములుగా ప్రేమలు కాలేజీ లో, బస్సు స్టాండ్ లో, రైల్ లో రకరకాలుగా మొదలవుతుంది, మరి ఈ సినిమాలో వీళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైందో సినిమా చుస్తే తెలుస్తుంది. అలాగే ప్రేమని కులం, మతం, అంతస్తు విడదీస్తుంది , మరి ఈ సినిమా లో ఏమి జరిగి ఉంటుందో సినిమా చూడాలి. మరదూరి రాజా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది. ప్రేమ యూత్ కి నచ్చుతుంది మరియు నవ్వులు మాస్ కి నచ్చుతాయి. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస రావు నాకు మంచి మిత్రుడు చాల కాలం గా పరిచయం ఆయనకి నా కృతఙ్ఞతలు. ఇప్పుడు తన కొడుకు హరి కృష్ణ ని హీరో గా ఈ సినిమా తో ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నాడు. అతనికి ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ " జొన్నలగడ్డ శ్రీనివాస రావు మంచి దర్శకుడు. చాల సినిమాలు చేసాడు. ఇప్పుడు తన కొడుకు హరి కృష్ణ ను పెట్టి ఈ సినిమా నిర్మించాడు. సాంగ్స్ లో హరి కృష్ణ నటన డాన్స్ అని బాగున్నాయి. మంచి హీరో అవుతాడని ఆశిస్తున్నాను. ట్రైలర్ చాల బాగుంది. ఈ సినిమా మంచి హిట్ అవాలని, డైరెక్టర్ శ్రీనివాస రావు కి హరి కృష్ణ కి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. సంగీత దర్శకుడు యాజమాన్య పాటలు చాల బాగున్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్నాయి. ప్రేమెంత పని చేసె నారాయణ మంచి విజయం కావాలని కోరుకుంటున్న" అని తెలిపారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ "జొన్నలగడ్డ శ్రీనివాస రావు దర్శకత్వం లో నేను ఒక సినిమా చేశాను. చాల మంచి డైరెక్టర్. వాళ్ళ అబ్బాయి హరి కృష్ణ నా సినిమా నాతో కలిసి ఒక పాటలో డాన్స్ చేసాడు. చాల బాగా చేసాడు డాన్స్. ఇప్పుడు తాను హీరో గా ఒక్క సినిమా రావటం చాల సంతోషం. ఇప్పుడు పాటలు, ట్రైలర్ చూసాం, చాల బాగున్నాయి. హరి కృష్ణ కి మంచి ఎనర్జీ ఉంది. తప్పకుండా సినిమా హిట్ అవుతుంది" అని తెలిపారు.

డైరెక్టర్ కిశోర్ కుమార్ మాట్లాడుతూ "ఏ సినిమా అయినా కృషి పట్టుదల తో పని చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. పాటలు ట్రైలర్ చూసాము చాల బాగున్నాయి. మంచి హిట్ అవుతుంది అని ఆశిస్తున్నాను" అని తెలిపారు.

జొన్నలగడ్డ శ్రీనివాస రావు మాట్లాడుతూ "కొత్తవాళ్లతో సినిమా తీసాను. నా కొడుకు ని ఆశీర్వదించటానికి వచ్చిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదాలు. మా సినిమా జగపతి బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు అది ఈ సినిమా కి పెద్ద హైలైట్. ఈ సినిమా ఫస్ట్ లుక్ హీరో రవి తేజ గారు లాంచ్ చేసారు, వారికీ నా కృతఙ్ఞతలు. నిజజీవితం లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. లవ్ స్టోరీ సినిమా కానీ చాల కొత్తగా ఉంటుంది. దర్శకుడిగా ఇది నా 9వ సినిమా. ఈ సినిమా క్లైమాక్స్ చాల కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది . యాజమాన్య మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా సహజం గా ఉంటుంది. త్వరలోనే విడుదల చేస్తాను.

కృష్ణ జె.యెస్.ఆర్. మూవీస్ పతాకం పై, శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షత హీరో హీరోయిన్ గా జొన్నలగడ్డ శ్రీనివాస రావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న చిత్రం ప్రేమెంత పని చేసె నారాయణ. ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్ ను ఈ రోజు హైదరాబాద్ లో ని ప్రసాద్ ల్యాబ్ లో సినిమా ప్రముఖుల చేతులమీదుగా పాత్రికేయుల సమక్షంలో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హీరో శ్రీకాంత్, తమ్మారెడ్డి భరద్వాజ్, పరచూరి వెంకటేశ్వర రావు, ఓ కళ్యాణ్, డాలీ మరియు ఇతర ప్రముఖులు పాల్గున్నారు.

నటి నటులు :

హరి కృష్ణ జొన్నలగడ్డ
అక్షిత
ఝాన్సీ
చిలుకూరి గంగా రావు
ఎ . ఆర్. సి. బాబు
రాహుల్ బొకాడియా
పింగ్ పాంగ్
రాఘవపూడి
రాజా రావు

కథ : జె. ఎస్. ఆర్. మూవీస్
స్క్రీన్ ప్లే : భూపతి రాజా, మరుదూరి రాజా
మాటలు : సుబ్బారాయుడు బొంపెం
సంగీతం : యాజమాన్య
పాటలు : వనమాలి, గోసాల రాంబాబు
మేనేజర్ : కొండా నాయుడు
ఎడిటింగ్ : జానకి రామ్
కో డైరెక్టర్ : వి . సిప్పీ
పి .ఆర్. ఓ : సతీష్
ఫైట్స్ : రామసుంకర
కెమెరా : పి. ఎస్. వంశి ప్రకాష్
కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్, విద్య సాగర్
నిర్మాత : సావిత్రి జొన్నలగడ్డ
దర్శకత్వం " జొన్నలగడ్డ శ్రీనివాస రావు

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved