pizza
Chuttalabbayi teaser launch
‘చుట్టాలబ్బాయి’ టీజర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 June 2016
Hyderabad

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయిస‌. ఈ సినిమా టీజ‌ర్ విడుదల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంర‌ద్భంగా....

హీరో ఆది మాట్లాడుతూ ``వీర‌భ‌ద్ర‌మ్‌గారు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాను. ఆయ‌న ఇద్ద‌రు ర‌త్న‌ల్లాంటి నిర్మాత‌లు వెంక‌ట్ త‌లారి, రామ్ తాళ్లూరి నిర్మించారు. సినిమాను గ్రాండ్ లెవ‌ల్లో రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌, బ్యాంకాక్ త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రించాం. మిస్ అండ‌ర్ స్టాడింగ్‌తో డ్రైవ్ అయ్యే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. అరుణ్ కుమార్ మంచి సినిమాటోగ్ర‌ఫీతో సినిమాను రిచ్‌గా తెర‌కెక్కించారు. థ‌మ‌న్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ - ``నిర్మాత‌లు మా తొలి చిత్ర‌మిది. వీర‌భ‌ద్ర‌మ్‌గారు మంచి క‌థ‌ను అందించారు. ఇటీవల చిత్రీకరించిన క్లైమాక్స్‌తో ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి థమన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. త్వరలోనే ఆడియో ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా ఆడియోను రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ - ''ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఆదికి మరో మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం కోసం థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ ఇచ్చారు. ఈ సినిమా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. సినిమా ఓపెనింగ్ రోజు నుండి ఈరోజు వ‌ర‌కు సినిమా పాజిటివ్ వైబ్స్ తో ముంద‌కు సాగుతుంది. ఇద్ద‌రు నిర్మాత‌లు నాతో వేర్వేరుగా సినిమా చేద్దామ‌ని వ‌చ్చారు. ఈ సినిమా చేయ‌డానికి ఇద్ద‌రినీ ఒప్పించాను. ఎంతో క్వాలిటీతో సినిమాను నిర్మించారు. జూన్ 6న ఆడియో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ అరుణ్ మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్‌గారు చెప్పిన క‌థ‌ను న‌మ్మిన నిర్మాత‌లు ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా సినిమాను రూపొందించారు. సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది`` అన్నారు.

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved