pizza
Nannu Dochukunduvate thanks meet
'నన్ను దోచుకుందువటే' థాంక్స్‌ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


19 September 2018
Hyderabad

సుధీర్‌బాబు, నభా నటేశ్‌ జంటగా సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆర్‌.ఎస్‌.నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ నెల 21న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన సక్సెస్‌మీట్‌లో...

ఎడిటర్‌ ఛోటా కె.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''అన్ని డిపార్ట్‌మెంట్స్‌ అందరూ కలిసి కష్టపడి చేసిన చిత్రమిది. ఫోన్‌ చేసి సినిమా బావుందని అందరూ అప్రిషియేట్‌ చేయడం ఆనందంగా ఉంది. సినిమా సక్సెస్‌కు కారణమైన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ మాట్లాడుతూ - ''సినిమా సక్సెస్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. కిర్రిక్‌ పార్టీలో చేసిన మ్యూజిక్‌ నచ్చడంతో దర్శకుడు ఆర్‌.ఎస్‌.నాయుడు అప్రోచ్‌ అయ్యారు.తన షార్ట్‌ ఫిలిం చూశాను. కథ నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించాను. సుధీర్‌ స్వంత బ్యానర్‌లోనే సినిమా చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

దర్శకుడు ఆర్‌.ఎస్‌.నాయుడు మాట్లాడుతూ - ''కామెడీ, ఎమోషనల్‌ సీన్స్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. కామెడీ సీన్‌ విషయానికి వస్తే.. షార్ట్‌ ఫిలిం సీన్‌ బాగా నచ్చుతుంది. అలాగే ఎమోషనల్‌ సీన్‌ విషయానికి వస్తే తండ్రి కొడుకుల సీన్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. అందరూ ఫోన్స్‌ చేసి బాగా చేశావని అభినందిస్తున్నారు. నిర్మాతగా సుధీర్‌గారు కథను నమ్మి చేసిన సినిమా ఇది. నభా ఎనర్జిటిక్‌గా నటించింది. తన క్యారెక్టర్‌ను చక్కగా క్యారీ చేసింది. సురేశ్‌ రగుతు ప్రతి సీన్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే అజనీష్‌, ఛోటాకె.ప్రసాద్‌గారు చాలా మంచి సపోర్ట్‌ ఇచ్చారు. సక్సెస్‌లో భాగమై సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌'' అన్నారు.

నభా నటేశ్‌ మాట్లాడుతూ - ''నేను బాగా నటించానని అందరూ అంటుండంతో ఆనందంగా ఉంది. సినిమాలో సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌. హీరోగా సుధీర్‌గారు మంచి కోస్టార్‌.. అలాగే నిర్మాతగా నన్ను నమ్మి మంచి క్యారెక్టర్‌ను నాకు ఇచ్చారు. మంచి రోల్‌ను రాసిన డైరెక్టర్‌ రాజశేఖర్‌గారికి థాంక్స్‌. సురేశ్‌గారు నన్ను ఎంతో అందంగా చూపించారు. అమేజింగ్‌ మూవీలో.. సక్సెస్‌లో నన్ను పార్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

సుధీర్‌ బాబు మాట్లాడుతూ - ''క్లీన్‌ యు మూవీ... ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీని నా తొలి చిత్రంగా ప్రొడ్యూస్‌ చేసినందుకు గర్వంగా ఉంది. సెన్సార్‌వాళ్లు సినిమా చూసి చాలా బాగా ఉందనే చెప్పడంతో మాకు చాలా నమ్మకం వచ్చింది. సినిమా చూసిన హరీష్‌, రానా, ఇంద్రగంటి, సందీప్‌, గోపీమోహన్‌ అందరూ సోషల్‌ మీడియాలో తమ సపోర్ట్‌ను అందించారు. విమర్శకులు కూడా సినిమా బావుందని అప్రిషియేట్‌ చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మౌత్‌ టాక్‌తో ఇంకా పెద్ద సక్సెస్‌ వైపుకు వెళుతుంది. ప్రతి షోకు ఆదరణ పెరుగుతుంది. అజనీష్‌ వెర్సటైల్‌ మ్యూజిక్‌ అందించాడు. అలాగే సురేష్‌ రగుతు ప్రతి విజువల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. డైరెక్టర్‌ ఆర్‌.ఎస్‌.నాయుడు సినిమాను చక్కగా తెరకెక్కించారు. అష్టాచమ్మాలో స్వాతి .. బొమ్మరిల్లులో హాసిని రోల్స్‌లో నభా క్యారెక్టర్‌ను కంపేర్‌ చేశారు. అలాగే ప్రేమకథా చిత్రమ్‌ కామెడీని ప్రేక్షకులు విపరీతంగాఎంజాయ్‌ చేశారు. అంత కామెడీ నా సినిమాలో వర్కవుట్‌ అవుతుందా? అని ఆలోచించేవాడిని. ఈ సినిమాలో షార్ట్‌ ఫిలిమ్‌ సీన్‌ అంతలా నవ్వించింది. అలాగే క్లైమాక్స్‌లో తండ్రి కొడుకుల సీన్‌నున బొమ్మరిల్లులో క్లైమాక్స్‌ సీన్‌తో కంపేర్‌ చేశారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసినందుకు హ్యాపీగా అనిపించింది'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved