pizza
Devil Trailer Launch
Devil has all the commercial elements along with a new story: Nandamuri Kalyan Ram at trailer launch event
నా మాట తీసుకోండి.. రాసుకోండి.. ‘డెవిల్’ సినిమా చాలా బావుంటుంది - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


12 December 2023
Hyderabad

Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film titled Devil. The film's tagline - The British Secret Agent raised curiosity. The film is directed and produced by Abhishek Nama. Audience eagerly waiting to witness this exciting spy thriller in theatres. The film is releasing worldwide on December 29th across Pan India in Telugu, Tamil, Hindi, Kannada and Malayalam. Today makers unveiled theatrical trailer in a grand launch event. On this occasion,

Writer Srikanth Vissa said, "Thanks to Kalyan Ram garu for his trust and support. Also thanks to director producer Abhishek Garu and thanks to cinematographer Soundar Rajan and editor Tammiraju garu. Harshavardhan Rameshwar has provided great music. Thanks to everyone.

Cinematographer Soundar Rajan said, "Kalyan Ram garu suggested me to be the cinematographer for this film. Abhishek has been amazingly supportive. "We are coming to theatres on December 29."

Music director Harshavardhan Rameshwar said, "I think everyone loved the trailer. You saw so little in the trailer, it will be a blast on big screens.on December 29th. Thanks to Kalyan Ram garu and Abhishek garu for the opportunity. See you on December 29.

Editor Tammiraju said, "Enjoy watching Devil movie in theaters on December 29. Thank you."

Abhishek Nama, director and producer of the film said, "I think everyone liked Devil's trailer. To make a new concept film like this, we need heroes with guts to come forward and one such hero is our Kalyan Ram garu. For two years, Kalyan Ram garu worked without making any other film. Kalyan Ram garu was seen less in the trailer and you will see his vishwaroop in theatres on December 29th. Action and performance are stunning. To make a period movie like this, there should be a good team work. Cinematographer Soundar Rajan garu, Srikanth garu, Action Master Venkat garu all participated in this movie for two years. This year started with a blockbuster like Veerasimha Reddy and it will be completed with a blockbuster Devil on December 29. Thanks to Samyukta and Malvika. Thanks to everyone who supported."

Malavika Nair said, "Some films will break the image of actors. Those kind of films are rare and I found such a movie in the form of Devil. Thanks to Abhishek garu for the opportunity. Srikanth garu narrates brilliantly. Harsha's sound was overwhelming. I worked with Kalyan Ram garu for the first time. Also thanks to Abhishek Nama garu ari for the opportunity. Soundar Rajan worked like a pillar for the entire movie. Thanks to our entire team for the immense support."

Samyukta Menon said, "The entire team worked hard for two years for Devil. The film has a good story and script. Thanks to Abhishek Nama sir for giving this opportunity."

Hero Nandamuri Kalyan Ram said, "I said during Bimbisara that if there is a good story, visuals, music, and team work, the audience will come to the theatres and you made it true. In the same way, Devil is coming to theatres with good story, music and visuals. Thanks to Srikanth who prepared the story, Soundar Rajan garu who provided amazing visuals, Venkat Master, Ramakrishna Master, Costume Designer Rajesh Garu, who created a new world for this film which was made in 1940 back drop. Thanks to Abhishek Nama garu who thought that it would be good to see all these together and made a great film without any hesitation. Cinema is a team effort. The joy that comes when the audience appreciates it is different. On December 29, the devil will stun you in theatres. Take my word, Devil is going to be very good. Devil has a new story along with all the commercial elements you want."

He added, "We will start Bimbisara 2 from April or May next year. Coming to my brother NTR's film Devara. After making a movie like RRR, an actor, a director and a production house have a lot of responsibility in thier hands. Even if a small mistake happened, audience will bot spare. We know how hard it is to take responsibility. We will take care keeping in mind that the audience should enjoy while watching the movie in the theaters tomorrow. The Glimpse is coming soon. Currently glimpse work is going on and VFX taking lots of time. I need you all to be patient to witness a new world that we are going to show. The team will soon announce the release date of the glimpse. On December 29, enjoy watching Devil."

నా మాట తీసుకోండి.. రాసుకోండి.. ‘డెవిల్’ సినిమా చాలా బావుంటుంది - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందిన డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

రైటర్ శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ ‘‘కళ్యాణ్ రామ్‌గారు నాపై ఉంచని నమ్మకానికి, నాకు ఇచ్చిన సపోర్ట్‌కి చాలా థాంక్స్. అలాగే దర్శక నిర్మాత అభిషేక్ గారికి కూడా థాంక్స్. ఇంకా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్‌కి, ఎడిటర్ తమ్మిరాజుగారికి థాంక్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు గ్రేట్ మ్యూజిక్‌ను అందించారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ మాట్లాడుతూ ‘‘ ఈ సినిమాకు నన్ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకోమని కళ్యాణ్ రామ్‌గారే సజెస్ట్ చేశారు. అభిషేక్‌గారు అద్భుతంగా సపోర్ట్ చేశారు. డిసెంబర్ 29న మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ట్రైలర్‌లో మీరు చూసింది తక్కువే. డిసెంబర్ 29న థియేటర్స్ దీన్ని మించి ఉంటుంది. కళ్యాణ్ రామ్‌గారికి, అభిషేక్‌గారికి థాంక్స్. డిసెంబర్ 29న కలుద్దాం’’ అన్నారు.

ఎడిటర్ తమ్మిరాజు మాట్లాడుతూ ‘‘డిసెంబర్ 29న డెవిల్ మూవీని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి..థాంక్యూ’’ అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘డెవిల్ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమా చేయాలంటే, కథను నమ్మి హీరో ముందుకు రావాలంటే గొప్ప విషయం. రెండేళ్ల పాటు కళ్యాణ్ రామ్‌గారు మరో సినిమా ఏదీ చేయకుండా వర్క్ చేశారు. ట్రైలర్‌లో కళ్యాణ్ రామ్‌గారిని చూసింది తక్కువ. రేపు థియేటర్స్‌లో ఆయన విశ్వరూపాన్ని చూస్తారు. యాక్షన్, పెర్ఫామెన్స్ అదిరిపోతుంది. ఇలాంటి పీరియాడిక్ మూవీ చేయాలంటే మంచి టీమ్ వర్క్ ఉండాలి. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్‌గారు, శ్రీకాంత్‌గారు, యాక్షన్ మాస్టర్ వెంకట్‌గారు ఇలా అందరూ రెండేళ్లు ఈ మూవీలో పార్ట్ అయ్యారు. ఈ ఏడాది వీరసింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్‌తో స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ 29న డెవిల్ వంటి బ్లాక్ బస్టర్‌తో కంప్లీట్ అవుతుంది. సంయుక్తా మీనన్, మాళవికకు థాంక్స్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

మాళవికా మోహనన్ మాట్లాడుతూ ‘‘నటీనటులకు కొన్ని సినిమాలు అప్పటి వరకు ఉన్న ఇమేజ్‌ను బ్రేక్ చేస్తాయి. అలాంటి సినిమాలు అరుదుగా దొరుకుతుంటాయి. నాకు డెవిల్ సినిమా రూపంలో అలాంటి సినిమా దొరికింది. అభిషేక్‌గారికి థాంక్స్. శ్రీకాంత్‌గారు అద్భుతంగా నెరేట్ చేశారు. హర్ష సౌండ్ అదిరిపోయింది. కళ్యాణ్ రామ్‌గారితో నేను తొలిసారి పని చేశాను. అలాగే అవకాశం ఇచ్చిన అభిషేక్ నామాగారికి థాంక్స్. సౌందర్ రాజన్‌గారు ఎంటైర్ సినిమాకు పిల్లర్‌లాగా వర్క్ చేశారు. ఆయన సహా టీమ్ సపోర్ట్‌కి థాంక్స్’’ అన్నారు.

సంయుక్తా మీనన్ మాట్లాడుతూ ‘‘డెవిల్ మూవీ కోసం ఎంటైర్ టీమ్ రెండేళ్ల పాటు ఎంతో కష్టపడింది. మంచి కథ, స్క్రిప్ట్‌తో సినిమా వస్తుంది. అభిషేక్ నామాకు థాంక్స్’’ అన్నారు.

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ఆడియెన్స్ థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని బింబిసార సమయంలో చెప్పాను. దాన్ని మీరు నిజం చేశారు. అదే కోవలో డెఫనెట్‌గా డెవిల్ మంచి కథ, కథనాలతో మీ ముందుకు వస్తుంది. విజువల్స్ ఎలా ఉంటాయనేది ట్రైలర్‌లో చూశారు. కథను తయారు చేసుకున్న శ్రీకాంత్, అద్బుతమైన విజువల్స్ అందించిన సౌందర్ రాజన్‌గారు, అలాగే వెంకట్ మాస్టర్, రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారు, 1940 బ్యాక్ డ్రాప్ లో చేయాల్సిన ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని తయారు చేసిన గాంధీగారికి థాంక్స్. వీటన్నింటినీ కలిపి ఇలా చూస్తే బావుంటుందని ఆలోచించి ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను గొప్పగా రూపొందించిన అభిషేక్ నామాగారికి థాంక్స్. ఇలా అందరూ వెనకుండి మా ఆర్టిస్టులందరినీ నడిపించారు. సినిమా అనేది ఓ టీమ్ ఎఫర్ట్. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే వచ్చే ఆనందమే వేరు. డిసెంబర్ 29న డెవిల్ మీ ముందుకు వస్తుంది. నా మాట తీసుకోండి.. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త కథతో డెవిల్ సినిమా ఉంటుంది. బింబిసార 2ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి మొదలు పెడతాం. తమ్ముడు ఎన్టీఆర్ సినిమా దేవర గురించి చెప్పాలంటే.. RRR వంటి సినిమా చేసిన తర్వాత ఓ యాక్టర్‌కి, ఓ డైరెక్టర్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి గాని ఎంతో బాధ్యత ఉంటుంది. చిన్నపాటి తప్పు జరిగినా ఎవరూ ఊరుకోరు. మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. త్వరలోనే గ్లింప్స్ రాబోతుంది. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. వి.ఎఫ్.ఎక్స్‌కి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మేం దేవర మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే గ్లింప్స్ డేట్‌ను టీమ్ అనౌన్స్ చేస్తుంది.. డిసెంబర్ 29న డెవిల్ ను చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

 


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved