pizza
Guru theatrical trailer launch
`గురు` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల 
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 March 2017
Hyderaba
d

వెంక‌టేష్, రితిక సింగ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుధా కొంగ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.శ‌శికాంత్ నిర్మించిన చిత్రం `గురు`. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైదరాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

విక్ట‌రీ వెంక‌టేష్ మాట్లాడుతూ - ``నిజాయితీగా చెప్పాలంటే ఈ సినిమా పూర్తి చేసిన త‌ర్వాత నాలో నేను కొత్త న‌టుడుని చూశాను. నా 30 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో జోన‌ర్ మూవీస్‌లో న‌టించాను. ఎన్నో అవార్డ్స్‌, రివార్డ్స్ వ‌చ్చాయి. ఈ జ‌ర్నీలో నేను ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాను. ఈ 30 ఏళ్ళ‌లో నేర్చుకున్న‌దంతా ఒక‌టైతే గురు సినిమా స‌మ‌యంలో నేర్చుకున్న‌ది ఒక‌టి. అందుకు కార‌ణం ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర‌. ఈ సినిమాను ముందుగా నేనే చేయాల్సింది కానీ జ్వ‌రంతో చేయ‌లేక‌పోయాను. హిందీ, త‌మిళంలో రూపొందిన ఈచిత్రాన్ని త‌మిళంలో విడుద‌ల కాక‌ముందే చూశాను. నాకు న‌చ్చింది. సినిమా చేద్దామ‌నుకున్నాను. సుధ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చి పూర్తిగా చ‌ద‌వ‌మంది. నా కెరీర్‌లో నా క్యారెక్ట‌రేంటి, డైలాగ్స్ ఏంట‌ని చ‌దివేవాడినే కానీ పూర్తి స్క్రిప్ట్ ఎప్పుడూ చ‌ద‌వలేదు. నాకు ముందు కాస్తా కొత్త‌గా అనిపించినా, స‌రేన‌ని స్క్రిప్ట్ మొత్తం చ‌దివాను. ఒక కొత్త ఎన‌ర్జీ వ‌చ్చిన‌ట్లు అనిపించింది. ఈ సినిమాలో నేను పూర్తిగా ఇన్‌వాల్వ్ అయ్యి న‌టించాను. సుధ నా పాత సినిమాల‌న్నీ చూసి నా ముఖ క‌వ‌ళిక‌లు ఎక్క‌డా రిపీట్‌కాకుండా కొత్త‌గా ఉండేలా చూసుకుంది. ఈ సినిమాలో నేను బాక్సింగ్ కోచ్ అంటే గురువుగా ప‌నిచేశాను. కానీ సినిమా చేసే స‌మ‌యంలో సుధ, నాకు గురువు అయ్యింది. నా నుండి బెస్ట్ అవుట్ పుట్ తీసుకుంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమాలో జింగిడి సాంగ్ కూడా నేను పాడాను. ట్యూన్ విన‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను. సంతోష్ నారాయ‌ణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాతో నా ఆలోచ‌న కొత్త‌గా మారింది. కొత్త క్యారెక్ట‌ర్స్ ఏదైనా చేసేయ‌వ‌చ్చున‌నే ఫీలింగ్ వ‌చ్చింది. రితిక‌, ముంతాజ్‌లు చ‌క్క‌గా న‌టించారు. త‌ప్ప‌కుండా గురు సినిమా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది`` అన్నారు.

నిర్మాత ఎస్‌.శ‌శికాంత్ మాట్లాడుతూ - `` నేను గ‌తంలో త‌మిళంలో ల‌వ్ ఫెయిల్యూర్‌, త‌మిళ్ ప‌డం అనే సినిమాలు చేశాను. ల‌వ్ ఫెయిల్యూర్ తెలుగులో కూడా విడుద‌లైంది. త‌మిళ్ ప‌డం సినిమా తెలుగులో సుడిగాడుగా రీమేక్ అయ్యింది. ఇక గురు సినిమా ముందు హిందీ, త‌మిళంలో విడుద‌లై పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా త‌మిళంలో విడుద‌ల కావ‌డానికి ఒక‌టిన్న‌ర నెల‌కు ముందుగానే వెంక‌టేష్‌గారు సినిమా చూసి చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఆయ‌న ఈ సినిమా చేశారు. ఆయ‌న కెరీర్‌లోనే గురు మైల్‌స్టోన్ మూవీ అవుతుంది. ఈ సినిమాలో వెంకీగారు బాక్సింగ్ కోచ్‌గా ప‌నిచేశారు. రితిక చాలా మంచి పెర్‌ఫార్మర్‌. సుధగారు ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. అందరికీ సినిమా న‌చ్చుతుంది`` అన్నారు.

Glam gallery from the event

సుధ కొంగ‌ర మాట్లాడుతూ - ``ఈ సినిమా జ‌ర్నీ గురించి చెప్పాలి. 2010లోనే ఈ క‌థ‌ను త‌యారు చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు మూడు నాలుగేళ్ళు క‌థ‌పై రీసెర్చ్ చేశారు. 250 మంది బాక్స‌ర్స్‌ను, కోచ్‌ల‌ను క‌లిసి ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను. హిందీ, త‌మిళంలో గ‌తేడాది విడుద‌లైన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. నేను మ‌ణిర‌త్నంగారి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ఈ సినిమా ఐడియా వ‌చ్చింది. క‌థ‌ను త‌యారు చేసుకున్నాను. క‌థ త‌యారు కాగానే ముందు నేను క‌లిసింది వెంక‌టేష్‌గారినే. అయితే కొన్ని కార‌ణాల‌తో సినిమా చేయలేక‌పోయాం. త‌ర్వాత హిందీ, తమిళంలో సినిమా చేసిన త‌ర్వాత విడుద‌ల కాక‌ముందే వెంక‌టేష్‌గారికి సినిమా చూపిస్తే, ఇప్పుడు న‌న్ను పెట్టి తెలుగులో సినిమా తీయ్ అన్నారు. వెంక‌టేష్‌గారిని గురు సెట్స్‌లో చూడ‌టానికి నాకు మూడేళ్ళ నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. నేను అసిస్టెంట్‌గా ఉన్న‌ప్పుడు నేను ఎంతో మంది స్టార్స్‌తో వ‌ర్క్ చేశాను. అయితే వెంక‌టేష్‌గారి వంటి క‌మిట్‌మెంట్‌, హ్యుమాలియాలిటీ, సిన్సియారిటీ చూడ‌లేదు. ఈ సినిమా మేకింగ్ వెంక‌టేష్‌గారు గాయ‌ప‌డినా దాని వ‌ల్ల షూటింగ్ ఎక్క‌డా ఆప‌లేదు. వెంక‌టేష్‌గారితో ప‌నిచేయ‌డం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. రితిక‌సింగ్ గ‌త ఆరేళ్ళుగా నాతో ట్రావెల్ అవుతుంది. తెలుగు, త‌మిళం, హిందీ అయినా చ‌క్క‌గా పెర్‌ఫార్మ్ చేసింది. ముంతాజ్ కూడా మంచి బాక్స‌ర్‌, రితిక‌, ముంతాజ్‌లు సిస్ట‌ర్స్‌గా న‌టించారు. నిర్మాత శశికాంత్‌గారు ఎంతో స‌పోర్ట్ చేశారు. చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చారు. రామ్ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. ప్ర‌తి విష‌యంలో ఎంతో కేర్ తీసుకున్నారు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

రితిక సింగ్ మాట్లాడుతూ - ``హిందీ, తెలుగులో సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో తెలుగులో కూడా అదే విధ‌మైన ఇంపాక్ట్ చూపిస్తుంది. నిజ జీవితంలో నాన్న‌గారే నాకు రియ‌ల్ గురు. వెంక‌టేష్‌గారితో వ‌ర్క్ చేయడం ఎంతో కంఫ‌ర్ట్‌గా ఫీల‌య్యాను. ఈ సినిమాకు నాకు నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ఎంతో హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఇన్‌స్పైరింగ్ క్యారెక్ట‌ర్ చేశాను. సుధ‌గారు ఎంతో బాగా తెర‌కెక్కించారు`` అన్నారు.

ఈ కార్యక్రమంలో ముంతాజ్, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved