pizza
IPC Section - Bhaaryaa Bandhu Trailer launch
You are at idlebrain.com > News > Functions
Follow Us


17 June 2018
Hyderabad

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు". 'సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్' (ఆడాళ్ళ నుంచి మగాళ్లను రక్షించండి) అన్నది స్లోగన్. శరశ్చంద్ర హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో.. నేహా దేశ్ పాండే హీరోయిన్. నిన్నటి మేటి కథనాయకి ఆమని, గుండె జారి గల్లంతయ్యిందే ఫేమ్ మధునందన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన రెట్టడి శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆలూరి క్రియేషన్స్ పతాకంపై.. ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల జరుపుకోవడంతో పాటు మిగతా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆడియో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి, అందులో భాగంగా చిత్రం ట్రైలర్స్ విడుదల చేశారు.

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరై ట్రైలర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత ఆలూరి సాంబశివరావు, దర్శకుడు రెట్టడి శ్రీనివాసరావు, హీరో శరత్ చంద్ర, సంగీత దర్శకుడు విజయ్ కూరాకుల, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్, ఆర్ట్ డైరెక్టర్ కె.వి.రమణలతోపాటు ఈ చిత్రంలో హీరోకి తల్లిదండ్రులుగా నటించిన వాసు ఇంటూరి, రాగిణి పాల్గొన్నారు.

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని, ఒక సున్నితమైన అంశానికి సునిశిత హాస్యాన్ని జోడించి రూపొందించిన "ఐపిసి సెక్షన్.. భార్యాబంధు" మంచి విజయం సాధించాలని రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు. విజయ్ కూరాకుల స్వరపరిచిన పాటలన్నీ బాగున్నాయన్నారు.

'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' వంటి ఒక మంచి సినిమాతో హీరోగా పరిచయమవుతుండడం అదృష్టంగా భావిస్తున్నానని హీరో శరత్ చంద్ర అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాత ఆలూరి సాంబశివరావు అన్నారు. తనకు దర్శకుడిగా అవకాశమిచ్చి.. విడుదలయ్యాక అందరూ గొప్పగా మాట్లాడుకునేంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన నిర్మాత ఆలూరి సాంబశివరావు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ అన్నారు. హీరోగా పరిచయమవుతున్న శరశ్చంద్రకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని, ఆమని పాత్ర, విజయ్ కురాకుల సంగీతం, మౌనశ్రీ మల్లిక్ సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం లభించడం పట్ల విజయ్ కురాకుల, మౌనశ్రీ మల్లిక్ కృతజ్ఞతలు తెలియజేశారు.

మధునందన్, వాసు ఇంటూరి, భరత్ (ఫన్ బకెట్ ఫేమ్), బస్ స్టాప్ కోటేశ్వరరావు, అప్పలరాజు, తడివేలు, రాగిణి, రమణీ చౌదరీ, మహిజ, రశ్మి, ఇంద్రాణి, సంగీత ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి.. మాటలు: అల్లూరి సీతారామరాజు-అంకాలపు శ్రీనివాస్, పాటలు: మౌనశ్రీ మల్లిక్, ఆర్ట్: కె.వి.రమణ, పి.ఆర్.ఓ: ధీరజ్ అప్పాజీ, ప్రొడక్షన్ కంట్రోలర్: ధవళ చిన్నారావు, కో-డైరెక్టర్: కె.సేతుపతి, రచనాసహకారం-చీఫ్ కో-డైరెక్టర్: బి.సుధాకర్ రాజు, ఎడిటింగ్: బి.మహేంద్రనాథ్, సినిమాటోగ్రఫీ: పి.శ్యామ్, సంగీతం: విజయ్ కూరాకుల, నిర్మాత: ఆలూరి సాంబశివరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; రెట్టడి శ్రీనివాస్!!

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved