pizza
Sita On The Road trailer launch
సీత ఆన్ ది రోడ్ ట్రైలర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us


8 March 2019
Hyderabad

 

కల్పిక గణేష్, గాయత్రి గుప్త, కాతెర హకిమి, నేసా ఫర్ హాది, ఉమా లింగయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సీత ఆన్ ది రోడ్.జేపీ మోషన్ పిక్చర్స్, డై మూవీస్ పతాకాలపై ప్రణీత్ యారోన్ దర్శకత్వంలో ప్రణీత్, ప్రనూప్ జవహర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది.

దర్శకుడు, నిర్మాత ప్రణీత్ యారోన్ మాట్లాడుతూ.... సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాలను, అక్రమాలను చూసి రియలైజ్ అయి ఈ కథ రాసుకున్నాను. ఒక ఐదుగురు డిఫరెంట్ అమ్మాయిలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవితంలో ఎదగాలనుకుంటారు.. అలాంటి వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది మా చిత్ర కథ. హైదరాబాద్, కర్ణాటక, గోవా వంటి అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. నాకు సహకరించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరకీ ధన్యవాదాలు. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం అన్నారు.

నటి కల్పిక గణేష్ మాట్లాడుతూ.. ఉమెన్స్ డే రోజు మా చిత్ర ట్రైలర్ రిలీజ్ కావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇదొక ఇంపారింగ్ ఉమెన్స్ స్టోరీ. 5 గురు డిఫరెంట్ జనరేషన్స్ అమ్మాయిలు వారి జీవితాన్ని స్వేచ్ఛగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి వారు ఎన్ని యిబ్బందులు ఎదుర్కొన్నారు అనేది మెయిన్ కథాంశం. ప్రతి ఒక్కరూ ది బెస్ట్ ఔట్ ఫుట్ అందించారు.. అన్నారు.

గాయిత్రి గుప్త మాట్లాడుతూ... నా మీద నమ్మకంతో మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రణీత్ కి థాంక్స్. అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేవిధంగా ఈ చిత్రం ఉంటుంది.. అన్నారు.

నిర్మాత ప్రనూప్ జవహర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ మా డైరెక్టర్ ప్రణీత్. చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. సీత ఆన్ ది రోడ్ చిత్రాన్ని అందరూ చూసి ఆదరించాలి.. అన్నారు.

ఐఎన్ టీయుసి అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. మా అబ్బాయి రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి ఈ చిత్రాన్ని రూపొందించాడు. స్త్రీల పట్ల జరుగుతున్న అరాచకాలు ఏ విధంగా వుంటున్నాయో ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ టీమ్ అందరికీ అల్ ది బెస్ట్.. అన్నారు.సీత ట్రైలర్ విడుదల

 

Photo Gallery (photos by G Narasaiah)

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved