pizza
Shubhalekha+Lu theatrical trailer launch
`శుభ‌లేఖ‌+లు` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


25 August 2018
Hyderabad

శుభ‌లేఖ‌లు అనే ప‌దం విన‌గానే పెళ్లి తంతు గుర్తుకొస్తుంది. వెయ్యి అబ‌ద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి జ‌రిపించాల‌ని పెద్ద‌లు అంటారు. పెళ్లికి చెప్పే అబ‌ద్ధం త‌ప్పు కాద‌ని, రెండు మ‌న‌సుల‌ను క‌ల‌ప‌డానికి చేసే మంచి ప్ర‌య‌త్న‌మ‌ని వారి భావ‌న‌. కానీ నేటి ట్రెండ్‌లో పెళ్లి అంటే `స‌త్యం` అనే ధోర‌ణి మొద‌లైంది. ఇప్పుడు పెళ్లి కోసం ఆడే అబ‌ద్ధాల‌ను ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అలాంటి విష‌యాల‌ను డిస్క‌స్ చేస్తూ చాలా ఇన్నొవేటివ్ క‌థాంశంతో `శుభ‌లేఖ‌+లు` చిత్రం రూపొందుతోంది. శ‌ర‌త్ న‌ర్వాడే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. హ‌నుమా తెలుగు మూవీస్ ప‌తాకంపై సి.విద్యాసాగ‌ర్‌, ఆర్‌.ఆర్‌.జ‌నార్ద‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సాయి శ్రీనివాస్‌, దీక్షా శ‌ర్మ హీరో హీరోయిన్లు. ప్రియా వ‌డ్ల‌మాని లీడ్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్ర‌ధారులు. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను దిల్‌రాజు శనివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో..

విస్సు మాట్లాడుతూ - ``మ‌హ‌ర్షి బ్యాన‌ర్‌పై చేస్తున్న తొలి ప్ర‌య‌త్న‌మిది. ఈ ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

జ‌నార్ధ‌న్‌ మాట్లాడుతూ - `` ఎప్ప‌టి నుండో సినిమా చేయాల‌నే కోరిక ఉండేది. అయితే గ‌త ఏడాది నుండే ఈ కోరికకు శ్రీకారం చుట్టాం. సినిమా ఎంత గొప్ప‌గా ఉంటుందో అని ఇప్పుడే చెప్ప‌ను. భ‌విష్య‌త్‌లో సినిమా స‌క్సెస్ త‌ర్వా త మాట్లాడుదాం`` అన్నారు.

హీరోయిన్ మాట్లాడుతూ - ``ఒక ఫ్యామిలీలా క‌లిసి పోయి చేసిన సినిమా. ద‌ర్శ‌కుడిగారు చాలా ఓపిక‌గా మా నుండి త‌న‌కు కావాల్సిన న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నారు`` అన్నారు.

హీరో మాట్లాడుతూ - ``నా హృద‌యానికి ద‌గ్గ‌రైన సినిమా. ద‌ర్శ‌కుడు శ‌ర‌త్‌గారు హార్ట్ ట‌చింగ్‌గా సినిమాను తెర‌కెక్కించారు. రేపు సినిమా చూసిన త‌ర్వాత సినిమాను గుర్తుండిపోయే చిత్ర‌మ‌వుతుంది. జ‌నార్ధ‌న్‌గారు, సాగ‌ర్‌గారు న‌మ్మ‌కంతో నాతో సినిమా చేశారు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ప్రాముఖ్య‌త ఉంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మాట్లాడుతూ -`` దిల్‌రాజుగారి ప్రొడ‌క్ష‌న్‌లో నేను పనిచేశాను. ఆయ‌న ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. మంచి నిర్మాత‌లు దొరికారు. మంచి ప్యాష‌నేట్ వ్య‌క్తులు. నేచుర‌ల్ వేలో విస్సుగారు రాశారు. డిఫ‌రెంట్ సినిమా అని చెప్ప‌ను.. కానీ రెగ్యుల‌ర్ సినిమా మ‌న ఇంట్లో చూసిన క‌థ‌లానే ఉంటుంది. టైటిల్‌లో ప్ల‌స్ గురించి చాలా మంది అడిగారు. ఒక పెళ్లి జ‌రిగే క్ర‌మంలో ఆ పెళ్లిలోని యూత్ జీవితంలో ఎలాంటి మార్పులు వ‌చ్చింద‌నేదే సినిమా. పెళ్లిలో ముందు జ‌రిగే స‌న్నివేశాలు అన్ని ఉంటాయి. ఒక పెళ్లి వల్ల .. అంద‌రి ల‌వ్‌స్టోరీస్‌కు క్లియ‌రెన్స్ వ‌చ్చి మ‌రో రెండు జంట‌లు పెళ్లికి సిద్ధ‌మ‌వుతాయి. అందుకే టైటిల్‌ను అలాపెట్టాం`` అన్నారు.

అప్పాజీ ,డా . ఇర్ఫాన్ , తిరువీర్,సింధు తదితరులు నటించిన ఈ చిత్రానికి క‌థ - మాట‌లు: జ‌నార్ద‌న్‌ -విస్సు, సంగీతం: కేఎమ్ రాధాకృష్ణ‌న్‌, కెమెరా: ముర‌ళీమోహ‌న్ రెడ్డి, ఎడిటింగ్‌: మ‌ధు, ఆర్ట్: బ‌్ర‌హ్మ క‌డ‌లి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె.సూర్య‌నారాయ‌ణ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ‌ర‌త్ న‌ర్వాడే.

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved