pizza
Friend Request trailer launch
'
ప్రెండ్‌ రిక్వెస్ట్‌ట్రైలర్‌ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 June 2016
Hyderabad

మోడ్రన్‌ సినిమా బ్యానర్‌పై ఆదిత్యా ఓం స్వీయ దర్శక నిర్మాణంలో విజయ్‌వర్మ పాకలపాటి నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన చిత్రం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆదిత్యా ఓం ప్రత్యేక పాత్రలో నటించారు. రోహిత్‌ప్రకాష్‌శీతల్‌రిచాసోనిసాగరిక ఛైత్రిమనీషా కేల్‌కర్‌నితేష్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో జరిగింది. ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ఎం.ఎల్‌.సి రుద్రరాజు,నిర్మాతనటుడు అశోక్‌కుమార్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా....

విజయ్‌వర్మ పాకటపాటి మాట్లాడుతూ ''ఈ చిత్రాన్ని సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించడం జరిగింది. సినిమాను జూలై ప్రథమార్థంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇప్పటి నుండి ప్రమోషన్‌ కార్యక్రమాలను భారీ స్థాయిలో చేయనున్నాం. ఇప్పటికే చాలా ఏరియాస్‌లో బిజినెస్‌ పూర్తయ్యింది. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం'' అన్నారు.

ఆదిత్యా ఓం మాట్లాడుతూ ''రెండు సంవత్సరాల క్రితం సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలనుకుని రాసుకున్న కథ ఇది. అప్పటి నుండి మా జర్నీ కొనసాగుతుంది. సోషల్‌మీడియాకు బానిసగా మారిపోయిన యువతను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాం. హర్రర్‌ఎంటర్‌టైన్మెంట్‌ ఎలిమెంట్స్‌ను ఈ కథకు యాడ్‌ చేసి చేశాం. గొప్ప సినిమా అని చెప్పను కానీ మంచి ఎంటర్‌టైనింగ్‌ మూవీ అని మాత్రం చెప్పగలను. మంచి మెసేజ్‌ కూడా మిళితమై ఉంది. నేను చిన్న నిర్మాతనే అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందించాను'' అన్నారు.

రోహిత్‌ మాట్లాడుతూ ''ఆదిత్యా ఓంగారితో కలిసి చేసిన ఈ సినీ ప్రయాణాన్ని మరచిపోలేం. సినిమాలో మెసేజ్‌తో పాటు అన్నీ ఎలిమెంట్స్‌ కలిపి చేసిన చిత్రం. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం'' అన్నారు.

తైదల బాపు మాట్లాడుతూ ''6టీన్స్‌ నుండి నేటి పటాస్‌ వరకు నేను 400 పాటలను రాశాను. అయితే ఫేస్‌బుక్‌పై పాటను రాయడం నాకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. ఆదిత్యా ఓంగారు ఇప్పటి యూత్‌ ట్రెండ్‌కు తగిన విధంగా మంచి టైటిల్‌తో సినిమాను తెరకెక్కించారు. ఆదిత్యా ఓంగారికి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది''అన్నారు.

సాగరిక ఛైత్రి మాట్లాడుతూ ''తెలుగులో ఇది నా తొలి చిత్రం. ఆదిత్యగారి విజన్‌తోనే ఈ సినిమా సాధ్యమైంది. అందరం రెండేళ్లు కష్టపడి చేసిన మూవీ ఇది. ఈ సినిమాను సక్సెస్‌ చేసి మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం'' అన్నారు.

అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ''ఒక నిజాయితీతో కూడిన ప్రయత్నమే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ చిత్రం. టీజర్‌ చాలా బావుంది. ప్రతి ఫ్రేమ్‌ చాలా క్లారిటీతో ఉంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ వస్తోన్న ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ ''ఆదిత్యా ఓం పడ్డ కష్టమే ఈ చిత్రం. టీజర్‌ బావుంది. రోహిత్‌ సహా అందరూ చక్కగా యాక్ట్‌ చేశారు. మంచి కంటెంట్‌ ఉన్న ఈ సినిమా పెద్ద సక్సెస్‌ సాధించి ఆదిత్యా ఓంకుటీంకు మంచి పేరు తీసుకురావావాలి'' అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మహమూద్‌ అహ్మద్‌రాఘవప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

రోహిత్‌ప్రకాష్‌శీతల్‌రిచాసోనిసాగరిక ఛైత్రిమనీషా కేల్‌కర్‌నితేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రాఘవసంగీతం: లవన్‌వీరన్‌కెమెరా: సిద్ధార్థ్‌,సహనిర్మాతనిర్మాణనిర్వహణ: విజయవర్మ పాకలపాటినిర్మాణం: మోడ్రన్‌ సినిమాకథదర్శకత్వం: ఆదిత్యా ఓం.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved