pizza
Vakeel Saab musical fest at MLRIT college
ఉత్సాహంగా "వకీల్ సాబ్" మ్యూజికల్ ఫెస్ట్
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 March -2021
Hyderabad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రచార సందడిమొదలైంది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ప్రెస్టీజియస్సినిమా. వకీల్ సాబ్ చిత్రానికి థమన్ సంగీతం ఒక అసెట్ కాగా...ఇప్పటికేరిలీజైన మూడు పాటలు మగువా మగువా, సత్యమేవ జయతే, కంటి పాప సూపర్ హిట్అయ్యాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్ ను హైదరాబాద్ దుండిగల్లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వేణుశ్రీరామ్, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ గాయనీ గాయకులు హారిక నారాయణ,ఫృథ్వీ, దీపు, శ్రీ కృష్ణ, సాహితీ, సుభ తదితరులు పాల్గొన్నారు. వకీల్సాబ్ చిత్రంలోని పాటలను లైవ్ లో ఫర్మార్మ్ చేశారు. ఈ పాటలను స్టూడెంట్స్ఉత్సాహంగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ....‘‘పవర్ స్టార్ పవన్కళ్యాణ్ గారితో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. వకీల్ సాబ్ సినిమా మీ అందరిఅంచనాలు అందుకునేలా ఉంటుంది. సినిమా చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాం.రేపు థియేటర్లో మీకూ అదే అనుభూతి కలుగుతుందని నమ్ముతున్నాం. సినిమాప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా పవన్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్మర్చిపోలేను. వకీల్ సాబ్ కు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడుథమన్ కు థాంక్స్. అలాగే పాటలకు అధ్బుతమైన లిరిక్స్ ఇచ్చిన రామ జోగయ్యశాస్త్రికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు.

సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ...నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్దఅభిమానిని. మణిశర్మ గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఖుషి, గుడుంబాశంకర్, బాలు చిత్రాలకు పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు మ్యూజిక్చేయడం నా డ్రీమ్. ఎప్పుడెప్పుడు ఆ అవకాశం వస్తుందా అని ఎదురుచూశాను. నాకల పవన్ గారి కమ్ బ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్ చిత్రంతో నెరవేరినందుకుసంతోషంగా ఉంది. పాటలన్నీ సూపర్బ్ గా వచ్చాయి. రీరికార్డింగ్ సగంపూర్తయ్యింది. రీరికార్టింగ్ టైమ్ లో సినిమా చూస్తున్నప్పుడే పేపర్స్చింపేయాలి అనేంత మాస్ సినిమాలో కనిపించింది. మాకే అలా అనిపిస్తే, రేపుథియేటర్లో మీరంతా ఇంకా ఎంజాయ్ చేస్తారు.’’ ఈ అవకాశమిచ్చిన నిర్మాత దిల్రాజు గారికి,డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారికి ధన్యవాదాలు.అన్ని పాటలకుమంచి రచన అందించిన రామజోగయ్యగారికి ప్రత్యేక ధన్యవాదాలు.’’ అన్నారు.ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతిహాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగాన‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌,సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌,ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌,వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి,స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్ ,ద‌ర్శ‌క‌త్వం: వేణు శ్రీరామ్

 

 

Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved