pizza
24 music launch on 11 April
ఏప్రిల్ 11న సూర్య, విక్రమ్ కుమార్, ఏ.ఆర్.రెహమాన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24 చిత్రం గ్రాండ్ ఆడియో రిలీజ్
You are at idlebrain.com > news today >
Follow Us

5 April 2016
Hyderaba
d

వైవిధ్యమైన పాత్రలతో కలెక్షన్ల సునామీ సృష్టించే హీరో సూర్య, సామాన్యుడి ఆలోచనలకు అందకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రాల్ని తెరకెక్కించే స్టామినా ఉన్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందించిన ప్రెస్టీజియస్ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 11న హైదరాబాద్ లో జరిగే గ్రాండ్ వేడుకలో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సూర్య, సమంత, నిత్యామీనన్, విక్రమ్ కుమార్ తో పాటు ఆస్కార్ అవార్డ్ గ్రహీత, చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ పాల్గొంటారు. ఈ ఆడియో వేడుకకు పలువురు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా హాజరౌతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు, కాలం నా ప్రేయసి అనే మొదటి పాటకు అద్భుతమైన స్పందన లభించింది. భారీ బడ్జెట్ తో కథానాయకుడు సూర్య నిర్మించిన ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... ఇటీవలే విడుదల చేసిన 24 చిత్ర టీజర్ కు, కాలం నా ప్రేయసి అనే మొదటి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన ఈ మ్యాజికల్ మ్యూజిక్ ఆల్బమ్ ను ఈనెల 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఎ.ఆర్.రెహమాన్ అద్భుతమైన బాణీలు చిత్ర కథకు ప్రాణం పోశాయి. అంతే కాదు రీ రికార్డింగ్ తో ప్రతీ సన్నివేశం అబ్బురపరుస్తుంది. చంద్రబోస్, శంశాంక్ వెన్నెలకంటి మంచి సాహిత్యమందించారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు పాల్గొంటారు. టైమ్ ఆధారంగా నడిచే ఈ చిత్ర కథలో హీరో సూర్య విభిన్నంగా కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఈ తరహా కథ, కథనాలు మనం చూడలేదు. దర్శకుడు విక్రమ్ కుమార్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తాం. అని అన్నారు.

సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్,
సినిమాటోగ్రఫి - కె.తిరునాపుక్కరసు
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైన్ - అమిత్ రే మరియు సుభ్రదా చక్రబోర్తి
పాటలు - చంద్రబోస్ మరియు శశాంక్ వెన్నెలకంటి
సౌండ్ డిజైన్ - లక్ష్మీ నారాయణన్
సౌండ్ ఎఫెక్ట్స్ - ఇక్బాల్
యాక్షన్ - అన్బరివ్
కొరియోగ్రఫీ - రాజు సుందరం, బృంద, దినేష్, శ్రీధర్
విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - జులియన్ ట్రౌసెల్లియర్
మేకప్ - క్లోవర్ వూటాన్ మరియు ప్రీతి షీల్.జి.సింగ్
కాస్ట్యూమ్ డిజైన్- దర్శన్ జలన్, ఇషా-దివ్య మరియు నిధి-అనిషా
స్టిల్స్ - ఆర్.వెంకట్రామ్
పబ్లిసిటీ డిజైన్ - రైసింగ్ ఆపిల్, రెడ్ డాట్
పి.ఆర్.ఓ - ఎస్ కె ఎన్ మరియు ఏలూరు శ్రీను
నిర్మాత - సూర్య
రచన - దర్శకత్వం - విక్రం కె కుమార్

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved