pizza
2.0 release on 25 January 2018
జనవరి 25న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, శంకర్‌ల '2.0'
You are at idlebrain.com > news today >
Follow Us

22 April 2017
Hyderabad

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. '2.0' చిత్రాన్ని సుభాష్‌ కరణ్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు.

ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం మాట్లాడుతూ - ''సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారు, శంకర్‌గారి కాంబినేషన్‌లో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎంతో లావిష్‌గా రూపొందుతున్న '2.0' ఇండియన్‌ సినిమాలో ఒక చరిత్ర సృష్టిస్తుంది. మా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న '2.0' చిత్రాన్ని జనవరి 25, 2018 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం. మొదట దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని అనుకున్నాం. అయితే విఎఫ్‌ఎక్స్‌లో వరల్డ్‌ క్లాస్‌ స్టాండర్డ్స్‌ని అందుకోవడానికి ఎంతో కేర్‌ తీసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని చేస్తున్నాం. దాని వల్ల దీపావళికి రిలీజ్‌ చెయ్యాలనుకున్న ఈ చిత్రాన్ని జవనరి 25, 2018న విడుదల చేస్తున్నాం. విజువల్‌గా ఇప్పటివరకు ఇండియన్‌ సినిమాలో చూడని క్వాలిటీని '2.0'లో ఆడియన్స్‌ చూస్తారు'' అన్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved