pizza
Pradeep Machiraju’s 30 Rojullo Preminchatam Ela Releasing On January 29th
ప్ర‌దీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా' జ‌న‌వ‌రి 29 విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

11 January -2021
Hyderabad

KKGKGF: Chapter 1 was a huge hit, are you expecting KGF: Chapter 2 to break all records?

 

Pradeep Machiraju’s 30 Rojullo Preminchatam Ela Releasing On January 29th

30 Rojullo Preminchatam Ela marks debut of popular anchor Pradeep Machiraju as hero. Amritha Aiyer paired opposite him in the youthful musical romantic entertainer being helmed by Munna.

Anup Rubens has provided sound tracks for the film and the makers have released three songs so far. All the songs got tremendous response; particularly music lovers became obsessed with Neeli Neeli Aakasam song which got 218 million views thus far.

Meanwhile, the film’s release date is announced with a new poster. 30 Rojullo Preminchatam Ela will release on January 29th. Like Neeli Neeli Aakasam song, the film will also be pleasing to the core, declare the makers with the poster.

The film is produced by successful Kannada producers SV Babu under SV Productions banner.

Dasari Sivendra cranks the camera, while Chandra Bose pens lyrics for all the songs.

Casting: Pradeep Machiraju, Amrutha Aiyer, Siva Narayana, Hema, Posani Krishna Murali, Subhalekha Sudhakar, Viva Harsha, Hyper Adhi, Auto Ramprasad, Badhram, Jabardash Mahesh.

Banner: SV Productions
Producer: S.V. Babu
Written And Directed By: Munna
Editor: Karthik Srinivas
DOP: Dasari Sivendra
Choreographers: Shekhar and Yash
Music: Anoop Rubens
Lyrics: Chandra Bose
Singers: Sid Sriram, Rahul Sipligunj, Anurag Kulkarni, Dhananjay, Suneetha, Mohana Bhogaraju and Madhu Priya

ప్ర‌దీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా' జ‌న‌వ‌రి 29 విడుద‌ల‌

పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా' అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. సుకుమార్ ద‌గ్గ‌ర 'ఆర్య 2', '1.. నేనొక్క‌డినే' చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌దీప్ స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టించారు.

అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత‌లు ఇప్ప‌టివ‌ర‌కూ మూడు పాట‌ల‌ను విడుద‌ల చేశారు. మూడింటికీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. ప్ర‌త్యేకించి 'నీలి నీలి ఆకాశం' పాట సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించి, ఇప్ప‌టివ‌ర‌కూ 218 మిలియ‌న్ వ్యూస్ సాధించ‌డం పెద్ద విశేషం. పాట‌ల‌న్నింటినీ చంద్ర‌బోస్ రాశారు.

లేటెస్ట్‌గా ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌తో సినిమా విడుద‌ల తేదీని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా' జ‌న‌వ‌రి 29న విడుద‌ల‌వుతోంది. 'నీలి నీలి ఆకాశం' పాట ఎలాగైతే ఆక‌ట్టుకుందో, సినిమా కూడా ప్రేక్ష‌కుల్ని అలాగే అల‌రిస్తుంద‌ని నిర్మాత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

క‌న్న‌డంలో ప‌లు స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ తీసిన ఎస్‌.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు.

దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా, కార్తీక్ శ్రీ‌నివాస్ ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

తారాగ‌ణం:
ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌, శివ‌న్నారాయ‌ణ‌, హేమ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వైవా హ‌ర్ష‌, హైప‌ర్ ఆది, ఆటో రామ్‌ప్ర‌సాద్‌, భ‌ద్రం, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్‌.

సాంకేతిక బృందం:
పాటలు: చంద్రబోస్
గానం: సిద్ శ్రీ‌రామ్‌, రాహుల్ సిప్లిగంజ్‌, అనురాగ్ కుల‌క‌ర్ణి, ధ‌నుంజ‌య్‌, సునీత‌, మోహ‌న భోగ‌రాజు, మ‌ధుప్రియ‌
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
ఆర్ట్: నరేష్ తిమ్మిరి
పీఆర్వో: వంశీ-శేఖర్
నిర్మాత: ఎస్వీ బాబు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మున్నా.

 

 

 

 

 

 




   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved