pizza
Kartikeya's 90ml Team wrapped up Song shoot in Azerbaijan
అజర్‌బైజాన్‌లో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న '90 ఎంఎల్‌'
You are at idlebrain.com > news today >
Follow Us

4 November, 2019
Hyderabad

Hero Kartikeya Gummakonda's next 90 ml coming up with a different story directed by debutant Shekhar Reddy Erra introducing Neha Solanki to TFI. Sensational hit RX 100 fame Kartikeya Creative Works is making this venture and Ashok Reddy Gummakonda is producing it.

Providing Insights of the movie, producer Ashok Reddy Gummakonda says "Just like the title, 90ml has different, engaging and commercially entertaining concept and story. Wrapping up the shoot schedules with the songs shoot in Azerbaijan, we are making up the post-production works on brisk pace. We'll announce the full-details of cast & crew along with Movie Release Date very soon"

Director Shekhar Reddy Erra says " We shot 3 songs for 8 days in Aesthetic & Beautiful locations of Azerbaijan's Capital Baku, CG Mountains, Caspian Sea. Among them 'Vellipotunde Vellipotunde' will be an emotional song featuring Hero & Heroine, while 'Single Single' is going to be a full dance number shot with the leads and 20 dancers. Also, 'Naatho Nuvvunte Chaalu' a beautiful duet is shot on Kartikeya & Neha along with 10 dancers. Jani Master has choreographed all thes 3 songs with super crazy steps and they are going to be the highlight for movie"

Cast: Kartikeya Gummakonda, Neha Solanki, Ravi Kishan, Rao Ramesh, Ajay, Ali, Pragati, Praveen, Kalakeya Prabhakar, Adhurs Raghu, Satya Prakash, Roll Rida, Nellore Sudarshan, Duvvasi Mohan.

Story-Direction: Shekhar Reddy Erra
Music: Anup Rubens
Camera: J. Yuvaraj
Editor: S.R. Sekhar
Art: G.M. Sekhar
Lyrics: Chnadrabose
Fights & Stunts: Venkat, Jashua
Choreography: Jani
Production Controller: K. Suryanarayana

అజర్‌బైజాన్‌లో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న '90 ఎంఎల్‌'

'ఆర్‌ఎక్స్100' ఫేమ్‌ కార్తికేయ నటిస్తోన్న మరో విభిన్న చిత్రం '90 ఎం.ఎల్‌'. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. 'ఆర్‌ ఎక్స్100' తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్‌ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి ఇందులో కథానాయిక.

ఈ చిత్రం విశేషాలను
నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ వివరిస్తూ ''టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే కమర్షియల్‌ అంశాలతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇటీవలే మూడు పాటలను అజర్‌ బైజాన్‌లో చిత్రీకరించాం. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం'' అని చెప్పారు.

దర్శకుడు శేఖర్‌ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ ''అజర్‌ బైజాన్‌ రాజధాని బాకులోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్ దగ్గర, సీజీ మౌంటెయిన్స్ దగ్గర, క్యాస్పియన్ సముద్రం దగ్గర '8' రోజుల పాటు ఈ మూడు పాటల్ని చిత్రీకరించాం. హీరో హీరోయిన్‌పై 'వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే' అనే ఎమోషనల్‌ గీతాన్ని చిత్రీకరించాం. 'సింగిల్‌ సింగిల్‌' అనే పాటను ఫుల్‌ డ్యాన్స్ నెంబర్‌గా హీరో, హీరోయిన్‌, 20 మంది డ్యాన్సర్లపై తీశాం. 'నాతో నువ్వుంటే చాలు' అనే డ్యూయట్‌ని హీరో - హీరోయిన్‌, 10 మంది డ్యాన్సర్లపై షూట్‌ చేశాం. ఈ '3' పాటలకూ జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఎక్స్ ట్రార్డినరీగా స్టెప్స్ కంపోజ్‌ చేశారు. ఈ సినిమాలో ఈ పాటలు మంచి హైలైట్‌గా నిలుస్తాయి'' అని తెలిపారు.

న‌టీన‌టులు:
కార్తికేయ‌, నేహా సోలంకి, ర‌వికిష‌న్‌, రావు ర‌మేష్‌, ఆలీ ,పోసాని కృష్ణ మురళి,
అజయ్ , ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, అదుర్స్ ర‌ఘు, స‌త్య ప్ర‌కాష్‌, రోల్ రిడా, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, దువ్వాసి మోహ‌న్‌ తదితరులు .

సాంకేతిక నిపుణులు:
సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువ‌రాజ్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌, పాట‌లు: చంద్ర‌బోస్‌, ఫైట్స్: వెంక‌ట్‌, జాషువా, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె.సూర్య‌నారాయ‌ణ‌, నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ రెడ్డి ఎర్ర .


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved