pizza
'jaadoogadu' is ready to release on june 5th
You are at idlebrain.com > news today >
Follow Us

22 May 2015
HyderabaD

"JADOOGADU" An action entertainer in which Naga Shaurya plays an ambitious and a very street smart guy who makes his living by running a small time loan recovery business,he falls in love with a nurse being played by sonarika and the conflict starts when the local gangster played by zakir hussain come into their lives.

The film is being produced under the banner sathyaa entertainments by v.v.n.Prasad and directed by yogesh of "chintakayala Ravi" fame,starring naga shaurya and sonarika along with an ensemble of cast which has sapthagiri,srinivas reddy,prithvi,ajay,zakir hussain,ravi kale &kota srinivasa rao in key roles.

 

జూన్ 5 న 'జాదూగాడు' విడుదల '

'చింతకాయల రవి' ఫేం దర్శకుడు ‘యోగేష్’ దర్శకత్వం లో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’ రూపొందిస్తున్న చిత్రం 'జాదూగాడు' . ‘ఊహలు గుసగుస లాడే, దిక్కులు చూడకు రామయ్య',లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయ వంతమైన చిత్రాల యువ హీరో ‘నాగ శౌర్య’ ఈ చిత్ర కధానాయకుడు కాగా, నాయికగా ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతి గా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

'జాదూగాడు': మాస్ ఎంటర్ టైనర్ చిత్ర దర్శకుడు 'యోగేష్' మాట్లాడుతూ..' కధానాయకుడు నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రం లోఅతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. లోన్ రికవరీ బిజినెస్ చేసే పాత్రలో ఈ చిత్ర కధానాయకుడు కనిపిస్తారు. కధానాయిక సోనారిక తొ ప్రేమలో పడ్డ తరువాత లోకల్ గ్యాంగ్ లీడర్ తొ కదానాయకుడి వివాదం ఇటు కధను, అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందన్నది చిత్రమని, మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం లో కధానాయకుడి పాత్రను తీర్చి దిద్దటం జరిగిందని,వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ 'జాదూగాడు' అన్నారు దర్శకుడు.

జూన్ 5 న 'జాదూగాడు' విడుదల:

పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు’ చిత్రం ను జూన్ 5 న విడుదల చేయ నున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడు సాగర్ మహతి సంగీతం ఈ చిత్ర విజయానికి ఓ మెట్టు అవుతుందని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.

ప్రధాన తారాగణం :
కోట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ,‘అదుర్స్’ రఘు, స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ లు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్ ,ఎడిటర్: యం.ఆర్.వర్మ: ఆర్ట్ : సాహి సురేష్ ; ఫైట్స్ : వెంకట్ ; కథ , మాటలు : మధు సూదన్; పాటలు : వరికుప్పల యాదగిరి , శ్రీమణి, విశ్వ.

నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం : యోగేష్


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved