pizza
Aatadukundam Raa.. music launch on 5 August
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో రిలీజ్‌కి రెడీ అవుతున్న సుశాంత్‌ 'ఆటాడుకుందాం..రా'
You are at idlebrain.com > news today >
Follow Us

1 August 2016
Hyderaba
d

'కాళిదాసు', 'కరెంట్‌', 'అడ్డా' వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలతో హీరోగా ప్రేక్షకుల్లోను, అక్కినేని అభిమానుల్లోనూ ఎంతో పేరు తెచ్చుకున్నారు సుశాంత్‌. తాజాగా 'ఆటాడుకుందాం.. రా'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ఆటాడుకుందాం.. రా' (జస్ట్‌ చిల్‌). స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది.

ఆగస్ట్‌ 5న ఆడియో!
నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''శ్రీనాగ్‌ కార్పొరేషన్‌లో ఇది నాలుగో సినిమా. ఈ చిత్రం ఆడియోను ఆగస్ట్‌ 5న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఆడియోను రిలీజ్‌ చేస్తున్నాం. ఆగస్ట్‌ మొదటి వారంలోనే ఫస్ట్‌ కాపీ కూడా రెడీ అవుతుంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి సిద్ధమవుతోంది'' అన్నారు.

సుశాంత్‌, సోనమ్‌ ప్రీత్‌ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాసి, సుధ, ఆనంద్‌, రమాప్రభ, రజిత, హరీష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: వెంకట్‌, రామ్‌ సుంకర, ఛీఫ్‌ కో-డైరెక్టర్‌. డి.సాయికృష్ణ, కో-డైరెక్టర్‌: కొండా ఉప్పల, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రవికుమార్‌ యండమూరి, కథ-మాటలు: శ్రీధర్‌ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved