pizza
Aavu Puli Madhyalo Prabhas Pelli shooting completed
షూటింగ్ పూర్తిచేసుకున్న 'ఆవు పులి మ‌ద్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి'
You are at idlebrain.com > news today >
Follow Us

20 June 2016
Hyderaba
d

'ఆవు పులి మ‌ద్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి' అనే టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే ఇదేదో కాంట్ర‌వ‌ర్స‌ల్ టైటిల్ అనుకున్నారు. కాని ఈ చిత్రం చూసాక ఫుల్ పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతారు. చ‌క్క‌టి ప్రేమ‌క‌థ న‌డుస్తుంటుంది. హీరో ఏ.ర‌వితేజ ఈచిత్రంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కి వీరాభిమానిగా న‌టిస్తున్నారు. అత‌ను ప్రేమించిన అమ్మాయిగా అశ్విని చంద్ర‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. భాహుబ‌లి లాంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో కాళ‌కేయ గా న‌టించి ప్ర‌పంచంలో తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందిన ప్ర‌భాక‌ర్ ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈచిత్రానికి ఎస్‌.జె.చైత‌న్య ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్ప‌ణ‌లో, రెడ్ కార్పెట్ రీల్స్ బ్యాన‌ర్ లో ర‌వి ప‌చ్చ‌పాల నిర్మిస్తున్నారు. ఈచిత్రం యెక్క ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో టీజ‌ర్ ని, అతి త్వ‌ర‌లో ఆడియో ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.చైత‌న్య మాట్లాడుతూ.. ఆవు పులి మ‌ద్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి అనే టైటిల్ ఏమాత్రం వివాదాస్ప‌దం కాదు. చాలా అంద‌మైన ప్రేమ‌క‌థ ని తెరకెక్కించాం. ఏ.ర‌వితేజ‌, అశ్విని చంద్ర‌శేఖ‌ర్ లు జంట‌గా న‌టిస్తున్నారు. కాళ‌కేయ ప్ర‌భాక‌ర్ మా చిత్రంలో చాలా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెల‌గులో మెద‌టిసారిగా ఏడ‌వ‌టానికి వాడే గ్టిజ‌రిన్ ని న‌వ్వించ‌టానికి మా చిత్రంలో వాడాము. అలాగే నెల్లూరు లోని రియ‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్స్ ని ఈ చిత్రంలో న‌టింప‌జేశాము. ఓ రియ‌ల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని మా చిత్రాన్ని తెర‌కెక్కించాము. షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మా చిత్రం యోక్క మోష‌న్ పోస్ట‌ర్ ని ఈ రోజు విడుద‌ల చేశాము. త్వ‌ర‌లో టీజ‌ర్ ని, ఆడియో ని విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాము. మా చిత్రం పూర్తి ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. త‌ప్ప‌కుండా అంద‌రి ఆక‌ట్ట‌కుంటుంది. అని అన్నారు.

ఏ.రవితేజ‌, కాళ‌కేయ ప్ర‌భాక‌ర్‌, అశ్విని చంద్ర‌శేఖ‌ర్, భానుశ్రీ, జ‌బ‌ర్డ‌స్ట్ వేణు, అప్పారావు త‌దిత‌రులు న‌టించ‌గా..

శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్ప‌ణ‌,
సంగీతం- ఎమ్‌.టి.క‌విశంక‌ర్‌,
కెమెరా-ఆర్లి,
స‌హ‌నిర్మాత‌లు- న‌గ‌రం సునీల్‌, మ‌ధుమ‌ణి,
నిర్మాత‌- ర‌వి ప‌చ్చ‌పాల‌
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం- ఎస్‌.జె.చైత‌న్య‌

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved