pizza
Abbaitho Ammai release on 1 January
జనవరి 1న 'అబ్బాయితో అమ్మాయి' విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

19 December 2015
Hyderabad

నాగశౌర్య‌, ప‌ల్ల‌క్ ల‌ల్వాని జంట‌గా మోహనరూపా ఫిలింస్ తో కలిసి జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి`. రమేశ్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.సెన్సార్ బోర్డ్ 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. జనవరి 1న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ''నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు. అదే రియల్ వరల్డ్ కు వచ్చేసరికి ఈ ఓపెన్ నెస్ ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ ఫ్యూజన్ తో సాగే యువత జీవితాన్ని, ప్రస్తుత ట్రెండ్ ని ఆవిష్కరిస్తూ రమేశ్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇళయరాజాగారు స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభించింది. పోస్టర్స్ కూడా బాగున్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. అన్ని వర్గలవారినీ ఆకట్టుకునే భిన్నమైన ప్రేమకథతో సాగే ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

రమేశ్ వర్మ మాట్లాడుతూ - ''ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నమైన లవ్ స్టోరీతో హార్ట్ టచింగ్ గా సాగే చిత్రం ఇది. ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ మాస్, ఫ్యామిలీస్ చూసే విధంగా ఉంటుంది. ట్రెండీగా, పొయిటిక్ గా సాగే సినిమా. నాగశౌర్య టైలర్ మేడ్ పాత్ర చేశాడు. తన కెరీర్ ని మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది. కథానాయిక పల్లక్ లల్వాని అందచందాలు, అభినయం ప్లస్ పాయింట్. లవ్ స్టోరీస్ లో ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచే చిత్రం అవుతుంది''' అని చెప్పారు.

బ్రహ్మానందం, రావు రమేశ్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: రహ్మాన్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved